📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

మాలీవుడ్‌ యాక్ష‌న్ ఓటీటీ మూవీ

Author Icon By Divya Vani M
Updated: December 19, 2024 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మ‌ల‌యాళం యాక్ష‌న్ డ్రామా చిత్రం క‌డ‌క‌న్ త్వరలో సన్ నెక్స్ట్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇసుక మాఫియా నేప‌థ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో హ‌కీమ్ షాజ‌హాన్‌, రంజిత్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు సంగీతం గోపీ సుంద‌ర్‌ అందించారు.థియేటర్లలో ప‌ది నెల‌లు పూర్త‌యిన తర్వాత కడకన్ ఓటీటీలో విడుదల అవుతోంది. సాజిల్ మాంపాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 మార్చిలో విడుదలై, ప్రేక్షకులు మరియు విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు, డిసెంబర్ 20 నుండి ఈ చిత్రం సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కడకన్ చిత్రంలో హ‌కీమ్ షాజ‌హాన్‌, రంజిత్, శ‌ర‌త్ స‌భా, జాఫ‌ర్ ఇడుక్కి ముఖ్య పాత్రలు పోషించారు.ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రంతో ప‌లువురు న‌టీన‌టులు మ‌ల‌యాళం చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు.ప్ర‌చారంలో ఉన్న మేర‌కు, ఈ సినిమా వాస్తవికంగా జరిగిన ఇసుక మాఫియా సంఘటనల ఆధారంగా, ఫిక్ష‌న్ అంశాలను జోడించి రూపొందించబడిందని దర్శకుడు పేర్కొన్నారు.

ఈ చిత్రంలో ఈ క్రైమ్ కారణంగా ఎలా అమాయ‌కులు ప్రాణాలు కోల్పోతున్నారో చూపించారు. కడకన్ చిత్రం నీలంబూర్ ప్రాంతంలో జరగడం ప్రారంభం అవుతుంది.ఇసుక మాఫియా గ్యాంగ్ లీడ‌ర్లు మ‌ణి, సుల్ఫీ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటాయి.ఈ విభేదాలు రెండు కుటుంబాల మధ్య స్నేహం కంటే శత్రుత్వంగా మారిపోతాయి. సుల్ఫీ, లక్ష్మిని ప్ర‌ణంగా ప్రేమిస్తాడు.ఆమె కోసం మాఫియా వ్యాపారాన్ని వదిలిపోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ అనుకోకుండా సుల్ఫీ, లోకల్ సీఐ రంజిత్‌తో గొడవ ప‌డ‌తాడు. రంజిత్ మ‌ణితో చేతులు క‌లిపి, సుల్ఫీని దెబ్బ తీయ‌డానికి కుట్ర‌లు ప‌న్నుతాడు. సుల్ఫీని అరెస్ట్ చేయాలనుకుంటాడు. ఈ నేప‌థ్యంలో, సుల్ఫీ మాన‌సికంగా, శారీరకంగా ఈ వ్యూహాల‌ను ఎలా ఎదుర్కొన్నాడో, తన ప్రియురాలికి ఇచ్చిన మాటను నిల‌బెట్టుకుంటున్నాడా లేదా అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన అంశం. కడకన్ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతం అందించాడు, ఆయన గీత గోవిందం సినిమా ద్వారా ప్రసిద్ధి చెందారు.

ActionDrama HakeemShahzan IsukaMafia KadakhanMovie MalayalamCinema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.