📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఫ్యాన్స్ ను మెప్పించలేకపోయినా…నిర్మాతను మెప్పించిన మాస్ మహారాజ్

Author Icon By Divya Vani M
Updated: October 23, 2024 • 5:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్‌గా తెరకెక్కింది అయితే అసలు కథలో అనేక మార్పులు చేసి కమర్షియల్ అంశాలు జోడించి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కానీ వారిని పూర్తిగా ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది మొత్తం రూ. 85 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ 50 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి నిర్మాతలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలించింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీ సిరీస్ పనోరమ స్టూడియోస్ వంటి నిర్మాణ సంస్థలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యాయి మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ హక్కులను తీసుకుని విడుదల చేశారు.

సినిమా విడుదలకు ముందు ఈ చిత్రంపై అంత పెద్ద అంచనాలు లేకపోయినా హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ (మిరపకాయ్) కారణంగా కొద్దిగా ఆసక్తి ఏర్పడింది టీజర్ ట్రైలర్‌లు మంచి ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేయడమే కాకుండా లాంగ్ హాలీడేస్ కుదరడంతో కాస్త పాజిటివ్ టాక్ కూడా వచ్చింది అందరూ రవితేజ ఈ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ చేస్తారని భావించారు కానీ ఆ అంచనాలు విఫలమయ్యాయి సినిమా ఊహించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడంతో నిర్మాతలకు భారీగా నష్టాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుండి రూ. 6 కోట్లు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అందులో రూ. 2 కోట్లు డైరెక్ట్‌గా ఇచ్చి మిగిలిన రూ. 4 కోట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన తదుపరి ప్రాజెక్ట్‌ రెమ్యూనరేషన్‌లో తీసుకోవాలని హరీష్ శంకర్ తెలిపారు ఈ నిర్ణయానికి రవితేజతో పాటు అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలాగే హీరో రవితేజ కూడా తన రెమ్యూనరేషన్ నుండి రూ. 4 కోట్లు తగ్గించి నిర్మాతలకు సహాయపడినట్లు సమాచారం సాధారణంగా రవితేజ తన రెమ్యూనరేషన్ విషయంలో కఠినంగా ఉంటారని సినీ వర్గాల్లో పేరుంది అయినప్పటికీ నిర్మాతలకు ఇలాంటి సహాయాన్ని అందించడం సర్వత్రా హర్షణీయంగా ప్రశంసలు పొందింది అయితే ఈ సినిమా కారణంగా నిర్మాతలకు సుమారు రూ. 20 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు పరిశ్రమ వర్గాల నుండి సమాచారం మిస్టర్ బచ్చన్ మూవీ ఆశించినంత విజయాన్ని సాధించకపోయినా రవితేజ మరియు హరీష్ శంకర్ చేసిన ఈ మంచి నిర్ణయాలు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి.

BollywoodRemake BoxOffice BoxOfficeFailure CommercialMovies DirectorHarishShankar HarishShankar HarishShankarDecision MassMaharaja MovieFlop MovieLoss MovieRemake MrBachchanMovie PeopleMediaFactory RaviTeja RaviTejaFans RaviTejaSupport TeluguCinema tollywood TollywoodUpdates TSeries

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.