📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

పుష్ప-2 లో మరికొన్ని సీన్లు

Author Icon By Divya Vani M
Updated: December 30, 2024 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాకు పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్ని సాధించి, ప్రేక్షకులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు సమాచారం. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹1,730 కోట్ల వసూళ్లు సాధించడంతో పాత రికార్డులను పగులగొట్టి, కొత్త మైలురాళ్లను సృష్టించింది. బాలీవుడ్‌లోనే ₹800 కోట్ల పైగా వసూళ్లు వచ్చాయి. కానీ, సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో పుష్ప 2 టీమ్ సెలబ్రేషన్స్‌ నుంచి దూరంగా ఉంది.

అల్లు అర్జున్ కూడా ఎలాంటి సక్సెస్ టూర్స్‌ను ప్లాన్ చేయలేదు. అయితే, పుష్ప 2 టీమ్ అభిమానులకు ఉత్సాహానిచ్చేలా కొత్త సీన్లు జతచేస్తూ సినిమాను తిరిగి ప్రదర్శించనుందని వార్తలు వస్తున్నాయి. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా థియేటర్లలో ఈ సన్నివేశాలను చూపించనున్నారు. ఇందులో అల్లు అర్జున్ కూడా ఈ సీన్స్‌కు డబ్బింగ్ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం Annapurna Studiosలో డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

pushpa2

పుష్ప 2 సినిమా రన్‌టైమ్ సుమారు 3 గంటల 15 నిమిషాలు ఉండటంతో, కొన్ని ముఖ్యమైన సీన్లు ఎడిటింగ్ సమయంలో తొలగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ తొలగించిన సీన్లను తిరిగి జతచేయనున్నారు. మొత్తం 20 నిమిషాల సీన్లు జతచేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నిర్ణయం ప్రధానంగా ఓటీటీ వర్షన్ కోసం తీసుకున్నప్పటికీ, థియేట్రికల్ వర్షన్‌లోనే ఈ సీన్లను చూపించనున్నారు. పుష్ప 2 సినిమా పుష్ప సీక్వెల్‌గా వచ్చి, కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ప్రత్యేక పాటతో సందడి చేసింది.

AlluArjun Pushpa2 Pushpa2Movie Pushpa2Releases Pushpa2Success PushpaSequel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.