हिन्दी | Epaper

పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్

Divya Vani M
పుష్ప 2 రీ లోడెడ్ వెర్షన్

పుష్ప 2 విడుదలై 40 రోజులు గడిచినా, థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు నిర్మాతలు కొత్త ప్లాన్‌తో ముందుకు వెళ్లుతున్నారు. ఇప్పటికే 3 గంటలు 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు మరో 20 నిమిషాలు జోడించి ‘రీ లోడెడ్ వర్షన్’గా జనవరి 17న విడుదల చేయనున్నారు. పుష్ప 2 ఫుల్ రన్ పూర్తయినా, థియేటర్లకు ప్రేక్షకులు రావచ్చా అని అనుకునే వారికి నిర్మాతలు ఇచ్చే సమాధానం ఇదే. ఈ కొత్త వెర్షన్‌తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సినిమా ఆరంభం నుంచే కలెక్షన్ల వర్షంతో రికార్డులను తిరగరాస్తోంది. పుష్ప రాజ్ బాక్సాఫీస్‌ను ఊహించని స్థాయిలో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పుష్ప 2 అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది.

బన్నీ పెర్ఫార్మెన్స్‌కి అమితాబ్ బచ్చన్‌ మాత్రమే కాదు, మొత్తం భారతదేశం ఫిదా అయిపోయింది. ఇప్పటివరకు 42 రోజుల్లోనే రూ.1850 కోట్లు వసూలు చేసిన పుష్ప 2, 43వ రోజున కూడా కోటి రూపాయల వసూళ్లు రాబట్టింది. హిందీ వర్షన్‌లో మాత్రమే రూ.850 కోట్లు వసూలు చేసింది. జవాన్ తర్వాత హిందీలో సోలోగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా పుష్ప 2 మాత్రమే.బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కూడా పుష్ప 2 దాటిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.230 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఈ సమయంలో ‘రీ లోడెడ్ వర్షన్‘ విడుదల చేయడం సినిమాకు మరింత బలం ఇవ్వనుంది.టికెట్ ధరల విషయంలోనూ నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 నుండి రూ.150 మధ్య టికెట్ ధరలు ఉండేలా చర్చలు జరుగుతున్నాయి. జనవరి 17న విడుదలవుతున్న ఈ కొత్త వెర్షన్‌తో పుష్ప 2 రూ.2000 కోట్ల క్లబ్‌లో చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

కమల్ హాసన్‌పై సింగర్ చిన్మయి ఆగ్రహం.. కారణం ఏంటో తెలుసా?

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

అల్లు శిరీష్, నయనికలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది
2:14

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ వచ్చేసింది

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

‘తెలుసు కదా’వైఫల్యం పై రాశీ ఖన్నా ఏమన్నదంటే?

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నాకు గోలీల ఫ్యాక్టరీ ఉందా? రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటుడు రాజశేఖర్!

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

నిర్మాతగా నేను చాలా నష్టపోయా.. విజయ్ సేతుపతి

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఆఫర్‌ను తిరస్కరించిన అనిల్ కపూర్.. కారణం తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

టాలీవుడ్‌ సీనియర్ నిర్మాత ఎం. అర్జునరాజు కన్నుమూత

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్
1:26

రాజేంద్ర ప్రసాద్‌కు ధన్యవాదాలు తెలిపిన విశాల్

📢 For Advertisement Booking: 98481 12870