हिन्दी | Epaper
‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి

దిశా పటానీపై నోరుజారిన కంగువా ప్రొడ్యూసర్ భార్య

Divya Vani M
దిశా పటానీపై నోరుజారిన కంగువా ప్రొడ్యూసర్ భార్య

తమిళ్ స్టార్ సూర్య నటించిన కంగువా సినిమా నవంబర్ 14న విడుదలైనప్పటి నుంచే వివిధ విమర్శలు, చర్చల మధ్య కొనసాగుతోంది. సినిమా విడుదలైన తొలిరోజే నెగటివ్ రివ్యూల ప్రభావం కలెక్షన్లపై పడింది. అయితే, అన్నింటికీ వ్యతిరేకంగా సినిమా వసూళ్లు మాత్రం స్థిరంగా కొనసాగుతుండటం గమనార్హం.కంగువా సినిమాలో బాలీవుడ్ గ్లామర్ స్టార్ దిశా పటానీ సూర్య సరసన నటించింది. తమిళ సినిమాల్లో ఆమెకు ఇదే తొలి ప్రాజెక్ట్. అయితే, ఆమె పాత్రకు సినిమాలో చాలా తక్కువ స్కోప్ ఇచ్చారని విమర్శలు వస్తున్నాయి. కేవలం పాటల కోసం, కొన్ని గ్లామర్ సీన్ల కోసం ఆమె పాత్రను పరిమితం చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దిశా పాత్రపై వస్తున్న విమర్శలకు నేహా జ్ఞానవేల్ (చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భార్య) స్పందిస్తూ, “దిశా పటానీని కేవలం గ్లామర్ కోసం తీసుకున్నాం. ఆమె పాత్రకు అదనంగా స్కోప్ ఇవ్వాల్సిన అవసరం లేదు,” అని చెప్పడం కొత్త వివాదానికి దారితీసింది. నేహా వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఒక మహిళగా ఉండి మరో మహిళను చులకన చేయడం సరికాదు,” అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దిశా పాత్రను ఇంత తక్కువగా చూపించడంపై కూడా నిరసన వ్యక్తమవుతోంది.

కంగువా సినిమాకి భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం హైలైట్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని చోట్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను నిరాశపరచిందని అభిప్రాయాలు వచ్చాయి. ఈ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న నిర్మాత జ్ఞానవేల్ రాజా, “సౌండ్ వాల్యూమ్‌ను రెండు పాయింట్లు తగ్గించమని ఎగ్జిబిటర్లను కోరాం,” అని తెలిపారు.ఇప్పటి వరకు కంగువా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.50 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. అయితే, ఈ సినిమా బడ్జెట్ రూ.350 కోట్లు మించిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలో సూర్య యోధుడి పాత్రలో కనిపించడమే కాకుండా, ఫ్రాన్సిస్ అనే బౌంటీ వేటగాడిగా కూడా అలరించాడు.కంగువా కథను మళ్లీ విస్తరించేందుకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. కంగువా ఇలాంటి వివాదాల మధ్యనైనా, తన కథనంతో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870