📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

తెలుగులో మిస్ చేసుకున్న స్టార్ హీరో నాఇలాంటి ఛాన్స్ ఎవరైనా వదులుకుంటారా కంగువ

Author Icon By Divya Vani M
Updated: October 27, 2024 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సుమారు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సూర్య హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం ‘కంగువ’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమ ఈ సినిమాను ‘బాహుబలి’ లేదా ‘RRR’ తరహాలో విజయం సాధిస్తుందని ఆశిస్తోంది. సినిమా విడుదలకు ముందు, ప్రమోషన్స్ కోసం సూర్య సహా మూవీ టీం విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవలే సూర్య, బిగ్ బాస్ ఎపిసోడ్‌లో పాల్గొని సినిమాకు మరింత ప్రచారం కల్పించాడు ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ‘కంగువ’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గోపీచంద్‌తో ‘శౌర్యం’ ‘శంఖం’ వంటి సూపర్‌హిట్ చిత్రాలు తీసిన శివ, ఈ సినిమాకు దర్శకుడు. కథనంగా చూస్తే ఇది పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినూత్న కథా చిత్రమని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

కంగువ చిత్రం ఏకంగా 2000 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది, ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో కొన్ని చిత్రాలు వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరుతున్నాయి. కంగువ మాత్రం ఈ స్థాయిని మించిపోతుందనే అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు ఉన్నప్పటికీ, ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి ఇప్పుడున్న ఆసక్తికర అంశం ఏమిటంటే, ఈ కథను సూర్యకు ముందు అల్లు అర్జున్‌కు వినిపించారట. స్టూడియో గ్రీన్ సంస్థ, అల్లు అర్జున్‌తో కలిసి ఈ కథను తెరకెక్కించాలని మొదట్లో అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ అప్పటికే మూడు ప్రాజెక్టులకు కమిట్ అవడంతో, ఈ కథను వెంటనే చేయలేకపోయారు. అల్లు అర్జున్ తరువాత సినిమాలు పూర్తి అయిన తర్వాత ఈ సినిమా చేయాలని భావించినా, అప్పటికి కథ చాలా ఆలస్యం అయ్యింది. ఆ సమయానికే దర్శకుడు శివ ఈ కథను సూర్యకు వినిపించగా, ఆయన వెంటనే ఒప్పుకుని షూటింగ్ ప్రారంభించారు ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో వచ్చిన టాక్ ప్రకారం, ‘కంగువ’ ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ కథను ముందు అల్లు అర్జున్ చేయాల్సి ఉండి, చివరకు సూర్య చేతిలోకి వెళ్ళడం, అందరూ భావించినంత ఘన విజయాన్ని సాధిస్తే, ఇది అల్లు అర్జున్ చేయాల్సిన మంచి సినిమా చేజారిపోయిందని చెప్పుకోవచ్చు.

AlluArjun BigBudgetMovies BlockbusterExpectations IndianCinema Kanguva PanIndianFilm SivaDirector Suriya TamilCinema tollywood UpcomingMovies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.