📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం

Author Icon By Divya Vani M
Updated: December 22, 2024 • 4:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్‌కు రానుంది.ఇటీవలే తమిళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి,ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించేందుకు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తోంది.తమిళ సినిమా ఇండస్ట్రీలో ఆర్జే బాలాజీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. చాలా సినిమాల్లో కమెడియన్‌గా కనిపించిన అతను ఇప్పుడు హీరోగా,డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరో సూర్యతో కలిసి ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్న ఆర్జే బాలాజీ,ఈ మధ్య కాలంలో సొర్గవాసల్ అనే చిత్రంలో నటించి ప్రశంసలు అందుకున్నాడు.సిద్ధార్థ్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించాడు.సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్, కరుణాస్, నట్టి సుబ్రమణ్యం, షరాఫ్ యు ధీన్,బాలాజీ శక్తివేల్,రవి రాఘవేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు.నవంబర్ 29న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

తక్కువ బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది.ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌తో కూడిన కథనాలు కోలీవుడ్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. సినిమా థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సొర్గవాసల్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.డిసెంబర్ 27న సొర్గవాసల్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.స్వైప్ రైట్ స్టూడియోస్,థింక్ స్టూడియోస్ బ్యానర్లపై సిద్ధార్థ్ రావ్,పల్లవి సింగ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. క్రిస్టో జేవీయర్ సంగీతం అందించారు.సినిమా కథ గురించి చెప్పాలంటే, ఇందులో హీరో రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తాడు.అతనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్‌తో స్నేహం ఏర్పడుతుంది.

OTT releases RJ Balaji Movies Soragavasal Streaming Date Suspense Crime Thriller Tamil Movies on Netflix

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.