📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

ఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలు.. భారీ వ్యూస్‍తో సత్తా

Author Icon By Divya Vani M
Updated: December 20, 2024 • 8:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఓటీటీల్లో థ్రిల్లర్ చిత్రాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది.ఈ జానర్‌లో ఉండే ట్విస్టులు, సస్పెన్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది వివిధ భాషల్లో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పించాయి.భారీ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇప్పుడు ఈ ఏడాది బాగా దుమ్మురేపిన టాప్-10 థ్రిల్లర్ చిత్రాల గురించి తెలుసుకుందాం.తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా థియేటర్లలో ఘనవిజయం సాధించింది. జూన్ 14న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 12న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది.ఈ సినిమా అనేక వారాలపాటు గ్లోబల్‌గా ట్రెండింగ్‌లో నిలిచింది. దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు.విక్రాంత్ మాసే ప్రధాన పాత్రలో నటించిన సెక్టార్ 36 సెప్టెంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

ఈ క్రైమ్ థ్రిల్లర్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఆదిత్య నంబల్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రారంభం నుంచి భారీ వ్యూస్ అందుకుంది.లక్ష్య, రాఘవ్ జుయాల్, తాన్య లీడ్ రోల్స్ చేసిన కిల్ సెప్టెంబర్ 6న డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.ఆరంభం నుంచి మంచి హైప్‌తో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్‌లో నిలిచింది. విశ్వక్ సేన్ నటించిన గామి ఈ ఏడాది మార్చి 8న థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఏప్రిల్ 12న జీ5లో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.తొలి రోజుల్లోనే గామి నేషనల్ వైడ్ ట్రెండ్‌గా మారింది.మలయాళంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై రూ.200 కోట్ల కలెక్షన్లను సాధించింది.మే 5న డిస్నీ+ హాట్‌స్టార్‌లోకి వచ్చిన ఈ చిత్రం కూడా ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.స్పై థ్రిల్లర్ బెర్లిన్ లో అపర్షక్తి ఖురానా,ఇష్వాక్ సింగ్ లీడ్ రోల్స్ చేశారు. సెప్టెంబర్ 13న జీ5లో విడుదలైన ఈ చిత్రం బధిర గూఢచారి కథనంతో సస్పెన్స్‌ను పీక్‌కు చేర్చింది. మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అన్వేషిప్పిన్ కండేతుమ్ మార్చి 8న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.

Hotstar Thrillers Malayalam Hits OTT Thriller Movies Tamil Thrillers Telugu OTT Hits Top 10 Thrillers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.