బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (At Chinnaswamy Stadium) జరిగిన దుర్ఘటన కర్ణాటకను కుదిపేసింది. ఐపీఎల్ విజయోత్సవంలో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడంతో బాధ్యత తీసుకుంటూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. శనివారం బోర్డు అధ్యక్షుడు రఘురాం భట్‌కి రాజీనామా లేఖలను అందజేశారు.ఈ ఘటనపై పోలీసుల అభిప్రాయం గమనార్హం. చిన్నస్వామి స్టేడియంలో RCB విజయోత్సవానికి కేఎస్‌సీఏ అనుమతి ఇవ్వలేదని వారు స్పష్టం చేశారు. స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్ కోసం అంగీకారం లేకుండానే ప్రోగ్రాం నిర్వహించారని ఆరోపించారు.
CID దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కర్ణాటక ప్రభుత్వం క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) చేత దర్యాప్తు చేపట్టించింది. శనివారం నుంచి CID బృందం (CID Team) రంగంలోకి దిగి KSCA కార్యాలయాన్ని సందర్శించి సమాచారం సేకరిస్తోంది.
ఆర్సీబీ, DNA ఎంటర్‌టైన్‌మెంట్ పై కేసు నమోదు
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో RCBను ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఫ్రాంచైజీ ఈవెంట్ పార్టనర్ అయిన DNA ఎంటర్‌టైన్‌మెంట్ మరియు స్టేడియం నిర్వహణ బాధ్యతలపై కేఎస్‌సీఏ పేరు కూడా చేర్చారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. అరెస్టయిన వారిలో RCB మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే ఉన్నారు.
రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిషన్
తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయి విచారణ కోసం ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు, హైకోర్టు సుమోటోగా ఈ కేసును స్వీకరించింది. ప్రభుత్వం నుండి స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. జూన్ 10న ఈ కేసు విచారణ చేపట్టనున్న.
Read Also : PAN Card Inactive : పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి: లేకపోతే భారీ జరిమానా!