हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

chia seeds: సబ్జా గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Sharanya
chia seeds: సబ్జా గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వేసవిలో అధికంగా వేడిచేసే వాతావరణంలో శరీరాన్ని చల్లబరచడం ఎంతగానో అవసరం. నీరసం, డీహైడ్రేషన్‌, తలనొప్పులు, వేడి గాలులు వంటి ఇబ్బందులు ఈ కాలంలో సాధారణం. అయితే ప్రకృతి మనకు ఇచ్చిన అమూల్యమైన ఔషధ సంపదల్లో సబ్జా గింజలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి చిన్నగా కనిపించినా శరీరానికి ఇచ్చే మేలు మాత్రం అపారంగా ఉంటుంది.

సబ్జా గింజల ప్రత్యేకత:

సబ్జా గింజలు ఇవి నీటిలో నానబెట్టినప్పుడు పారదర్శకమైన జెల్‌ లాంటి పొర ఏర్పడుతుంది. ఇవి శరీరంలో వేడి తగ్గించడంలో సహాయపడటమే కాకుండా, శ్వాసకోశ ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ, మరియు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో మానవ శరీరం వేడి కారణంగా అలసట, నీరసం, నీటిలోపం వంటి సమస్యలకు గురవుతుంది. సబ్జా గింజలు నీటిలో నానబెట్టిన తర్వాత తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇవి సహజంగా శరీరాన్ని కూల్ చేస్తాయి. వేసవిలో రోజు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే హీట్ స్ట్రోక్ నివారించవచ్చు.

బరువు తగ్గడంలో సబ్జా గింజల ప్రాముఖ్యత:

ఒంట్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి సబ్జా గింజల్లో ఉంది. ఇవి అధికంగా ఫైబర్ కలిగి ఉండడం వలన ఆకలిని తగ్గిస్తాయి. కేబ్సులు తక్కువగా ఉండటం వల్ల, అధిక బరువుతో బాధపడేవారికి సబ్జా నీళ్లు మంచి పరిష్కారం.

వేగంగా జీర్ణమవుతాయి:

ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలు, గ్యాస్, ఆమ్లత, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు రోజుకు ఒకసారి సబ్జా నీళ్లు తాగితే మంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి మెరుగైన ప్రభావం:

సబ్జా గింజలు చర్మ సంబంధిత వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడతాయి. మొటిమలు, నల్ల మచ్చలు, పొడి చర్మం, చర్మ కాంతిని కోల్పోవడం వంటి సమస్యలకు ఇది సమర్థమైన పరిష్కారం. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నవి కావడంతో చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో:

సబ్జా గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. గుండెపోటు, హై బిపి, హై కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించే శక్తి కలిగివుంది. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇవి రుచి మరియు ఉపయుక్తత రెండింటికీ సమతుల్యంగా ఉండడం వల్ల, నీళ్లు, పాలలో కలిపి, నిమ్మకాయ జ్యూస్, మజ్జిగ, రూస్, లస్సీ వంటి ఎన్నో డ్రింక్‌లలో మిక్స్ చేసి తినవచ్చు. వాటి రుచి లోపించకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

సబ్జా గింజలను కనీసం 6-8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని పాలలో, నిమ్మకాయ జ్యూస్‌లో, లేదా శీతల పానీయాల్లో కలిపి తాగాలి. రోజుకు ఒక గ్లాస్ ఉదయం, ఒక గ్లాస్ సాయంత్రం తాగితే మంచిది. ఎక్కువ మోతాదులో తీసుకోవడం మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వారు వైద్యుల సలహాతో మాత్రమే తీసుకోవాలి. చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వాలి. సబ్జా గింజలు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్య రహస్యంగా చెప్పవచ్చు. వేసవిలో వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, ఆరోగ్య పరిరక్షణకు సహాయపడతాయి. ప్రకృతి వైద్యంలో ప్రాముఖ్యత గల ఈ గింజలను రోజువారీ జీవనశైలిలో కలిపి, ఆరోగ్యంగా జీవించవచ్చు.

Read also: Raw mango: వేసవిలో పచ్చి మామిడితో కూడా బోలెడన్ని లాభాలు?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870