📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Latest Telugu news : Women’s Health – మహిళల ఆరోగ్యం, ఫిటెనెస్కు పెద్దపీట వేయలేమా!

Author Icon By Sudha
Updated: September 24, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత ఆశయ సాధనలు, పిల్లల పెంపకం, కెరీర్ బాధ్యతలతో సతమతం అవుతున్న మహిళలకు తమ వ్యక్తిగత ఆరోగ్యం, (Women’s Health)ఫిట్నెస్, శ్రేయస్సు పట్ల ఆలోచించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. మహిళల ఆరోగ్యం (Women’s Health), శ్రేయస్సుల పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఏటా సెప్టెంబర్ చివరి బుధవారం రోజున, అనగా 24 సెప్టెంబర్ 2025 రోజున జాతీయ మహిళా ఆరోగ్యం ఫిట్నెస్ దినోత్సవం (నేషనల్ ఉమెన్స్ హెల్త్ అండ్ ఫిట్నెస్ డే)” పాటించడం ఆనవాయితీగా మారింది. మహిళా ఆరోగ్యం చాలా సంక్లిష్టతతో కూడి పలు సవాళ్ల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. మహిళలకు కౌమార దశ నుంచి వృద్ధాప్యం వరకు మోనోపాజ్, గర్భం దాల్చడం, పిల్లల్ని కనడం, రుతు స్రావ సమస్యలు, పిఓసిఎస్ సమస్యలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. దీనికి తోడుగా ప్రతి చిన్న సమస్యను బూతద్దంలో చూస్తూ అనవసర ఆందోళన, నిరాశ, ఒత్తిడులు, పని ఆధార ఒత్తి డులు, సామాజిక కట్టుబాట్లకు లోనవుతూనే ఉంటారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మహిళలకు అనారోగ్యం, శారీరక సమస్యలు, మానసిక ఉద్రేకాలు, భావోద్వేగ సమస్యలను అదుపులో ఉంచుకోవడానికి తగు సమాధానా లను ప్రచారం చేయడం నిరంతరం కొనసాగించాలి. కుటుంబ బాధ్యతలు, పని ప్రదేశాలు, ఒత్తిడులు, పిల్లల పెంపకం బాధ్యతలు, వ్యక్తిగత సమస్యల పట్ల సమతుల్యత సాధించడానికి తమ ఆరోగ్యాలను సహితం పణంగా పెట్టడం జరుగుతోంది. మహిళల ఆరోగ్యం (Women’s Health), ఫిట్నెస్ సాధించుట వల్ల జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండడం, మానసిక శ్రేయస్సు పెరగడం, శారీరక శక్తిజననం, సరైన సమయంలో నిద్రపోవడం, ఏకాగ్రత పెరగడం, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కలగడం, శారీరక వ్యాయామాలకు సమయం కేటాయించడం లాంటి ఉపయోగాలు కలుగుతాయి. మహిళలకు అందుబాటులో ఉన్న సమయాన్నితగు రీతిలో ప్రాధాన్యతా క్రమంలో గడపడం, దినచర్యలో శారీరక శ్రమకు ప్రాధాన్యం ఇవ్వడం, టెక్నాలజీ వాడుతూ తేలికగా పని చేయడం, సుసాధ్యం అయ్యే లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అవసరం అయినప్పుడు పనిని ఇతరులకు కేటాయించడం, విశ్రాంతికి తగు సమయం. కేటాయించడం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇవ్వడం లాంటివి విధిగా జరగాలి.

Women’s Health – మహిళల ఆరోగ్యం, ఫిటెనెస్కు పెద్దపీట వేయలేమా!

మహిళలు తమ పని ఒత్తిడిలో తగు పోషకాహారాన్ని (Nutrition)తీసుకోవడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ తిన్న తర్వాత మిగిలి న దానిని తిని తమ అనారోగ్యాలను కొని తెచ్చుకుంటారు. సమతుల పోషకాహారం తీసుకోవడం, పోషకాహార లోపాలను గమనించి ఆహార అలవాట్లు మార్చుకోవడం, ప్రతిరోజు తగు నీటిని తాగడం, బరువును అదుపులోఉంచుకోవడం, పోష కాహారాన్ని మాత్రమే తయారు చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్ వాడ కాన్ని తగ్గించడం, శరీర స్వభావాన్ని బట్టి ఆహారం ఎంపికచేసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మహిళలు తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మానసిక వికాసానికి అవసర మైన వ్యాయామాలు, ఒత్తిడినియంత్రణ, మానసిక స్పష్టత, నిద్రలేమి సమస్యను దూరం చేయడం, ఆశావహ సామాజిక సంబంధాలను నెలకొల్పడం, నిలకడను పెంచుకోవడం, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం, ఆత్మగౌరవాన్ని కాపాడుతుంటే ముం దుకు సాగడం లాంటివి కొనసాగించాలి. మహిళలు తమ జీవనశైలిని తగురీతిలో మార్చుకుంటూ, పోషకాహారం తీసు కుంటూ, కుటుంబ శ్రేయస్సు తోపాటు తమ ఆరోగ్యం పరి రక్షించుతుంటూ, ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలి.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

మహిళల ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

అన్ని ప్రశంసలు, విజయాలు మరియు సేవల మధ్య, మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవడానికి కూడా సమయం కేటాయించడం ముఖ్యం. ఆరోగ్యకరమైన శరీరం కలిగి ఉండటం వల్ల ప్రపంచంలో ఇటువంటి శక్తివంతమైన మరియు సానుకూల ప్రభావాలను కొనసాగించడానికి శక్తి మరియు మానసిక స్పష్టత లభిస్తుంది.

మహిళల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

మహిళలు రోజుకు ఒక పానీయం లేదా అంతకంటే తక్కువకు ఆల్కహాల్‌ను పరిమితం చేయడం వల్ల ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు క్యాన్సర్ మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ధూమపానం మానుకోండి. ధూమపానం మానేయడం వల్ల మహిళలు అనేక రకాల క్యాన్సర్లు, గుండె జబ్బులు మరియు చిగుళ్ల వ్యాధి వంటి ఇతర పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

#telugu News Breaking News fitness healthy lifestyle latest news wellness women's-wellness womens-health

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.