📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Wheat Vs jowar Roti : గోధుమ Vs జొన్న రోటీ ఏది బెస్ట్!

Author Icon By Sudha
Updated: January 27, 2026 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన భారతీయ సాంప్రదాయ వంటకాళ్లలో రొట్టెలు ఎంతో ప్రసిద్ధి గాంచినవి.. మన తాతల కాలం నుంచి అందరూ వాటినే ఎక్కవగా ఆహారంగా తీసుకునే వాళ్లు. అయితే ఇంతకు మందు కేవలం జొన్నలు, రాగులు వంటి దాన్యాలతో చేసే రొట్టెలు ఎక్కువగా తినేవారు. కానీ ప్రస్తుతం అందరూ జొన్న, రాగులు వంటి మిల్లెట్స్ రోటీలతో పాటు గోధుమ రోటీలు కూడా తింటున్నారు. కొంతమంది గోదుమ రొట్టెలు తినడానికి ఇష్టపడితే మరికొందరు జొన్న రొట్టెలు తింటారు. బరువు తగ్గాలనుకునే వారికి, జొన్న రొట్టే లేదా గోదుమ రొట్టే (Wheat Vs jowar Roti )రెండింటిలో ఏ ఉత్తమమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం.. గోధుమ రొట్టె చాలా తేలికైనది ఇది త్వరగా జీర్ణం అవుతుంది. జొన్న రొట్టెలో ఫైబర్, ప్రోటీన్, ఇనుము పుష్కలంగా ఉంటాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది అలాగే తక్షణ శక్తిని అందిస్తుంది.

Read Also : http://Bitter gourd juice : ఈ రెండు రోగాలకు దివ్యౌషధం కాకరకాయ జ్యూస్

Wheat Vs jowar Roti

ఒక జొన్న రోట్టెలొ గోధుమ రొట్టె (Wheat Vs jowar Roti )కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. గోధుమ రోట్టెలో దాదాపు 2.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది, అయితే జొన్న రొట్టెలో దాదాపు 3.2 గ్రాములు ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచడానికి, ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఒక జొన్న రొట్టెలో దాదాపు 3.3 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, గోధుమ రొట్టెలో దాదాపు 2.6 గ్రాములు ఉంటాయి. అంటే మిల్లెట్ రొట్టెలో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కణాల నష్టాన్ని సరిచేయడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి ప్రోటీన్ అవసరం. జొన్న రొట్టెలో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది . గోధుమ రొట్టెలో 1.1 మి.గ్రా.తో పోలిస్తే, ఒక జొన్న రొట్టెలొ దాదాపు 2.1 మి.గ్రా. ఇనుము ఉంటుంది. ఇనుము రక్తహీనతను నివారిస్తుంది, శరీరం అంతటా ఆక్సిజన్‌ను రవాణా చేయడంలో సహాయపడుతుంది, అలసటను తగ్గిస్తుంది.ఒక గోధుమ రొట్టెలో దాదాపు 15.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి, అదే ఒక జొన్నరొట్టెలో దాదాపు 19.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. తక్కువ కార్బ్ ఆహారం అనుసరించేవారికి లేదా వారి కార్బోహైడ్రేట్లను తగ్గించుకోవాలనుకునే వారికి, గోధుమ రొట్టెలు మంచి ఎంపిక, అయితే మీరు గోధుమ రొట్టెను ఏడాది పొడవునా తినవచ్చు. కానీ జొన్న రొట్టే వెచ్చని స్వభావం కారణంగా వేసవిలో తక్కువగా తినాలని సిఫార్సు చేస్తారు. అందుకే శీతాకాలంలో జొన్న రొట్టెలను ఎక్కువగా తింటారు. చిరు ధాన్యాలు, గోధుమ రోటీలు రెండూ ఆరోగ్యకరమైనవే. అందువల్ల, మీ అవసరాలు, వాతావరణం, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వాటిని మీ ఆహారంలో ప్రత్యామ్నాయంగా చేర్చుకోవడం ఉత్తమం, తద్వారా మీ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News godhuma roti jonna roti jowar roti latest news Telugu News wheat roti wheat vs jowar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.