📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Brush teeth: రాత్రి పూట బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..

Author Icon By Sudha
Updated: September 11, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉదయం కంటే రాత్రిపూట బ్రష్ చేసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. దంతాలు శుభ్రం చేసుకోకపోతే.. అది మీ చిరునవ్వుతో పాటు ప్రశాంతమైన నిద్రను కూడా దూరం చేస్తుంది. చాలామందికి రాత్రి భోజనం చేశాక బ్రష్ (Brush teeth) చేసే అలవాటు ఉంటుంది. కానీ అది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు.. మీ నిద్ర, మొత్తం ఆరోగ్యంపై ప్రభావం (Impact on health)చూపే కీలకమైన అంశం. పడుకునే ముందు దంతాలు శుభ్రం (Brush teeth) చేసుకోకపోతే.. అది మీ చిరునవ్వుతో పాటు ప్రశాంతమైన నిద్రను కూడా దూరం చేస్తుంది. మనం నిద్రపోతున్నప్పుడు నోటికి విశ్రాంతి దొరుకుతుందని అనుకుంటాం. కానీ అప్పుడే నోటి వాతావరణంలో పెద్ద మార్పులు చోటుచేసుకుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట లాలాజలం ఉత్పత్తి దాదాపు సగానికి పడిపోతుంది. లాలాజలం అనేది నోటికి సహజమైన రక్షణ వ్యవస్థ లాంటిది. ఇది యాసిడ్స్‌ను అదుపులో ఉంచి, దంతాలపై ఉన్న ఎనామిల్‌ను రిపేర్ చేస్తుంది.

Brush teeth: రాత్రి పూట బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..

దంతాలపై ప్రభావం

లాలాజలం తగ్గడం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇది దంతాలపై పాచి పేరుకుపోవడానికి, చిగుళ్లు బలహీనపడటానికి కారణమవుతుంది. రాత్రి సమయంలో మన శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. కానీ నోట్లో బ్యాక్టీరియా యాక్టివిటీ ఎక్కువగా ఉంటే ఈ హీలింగ్ ప్రాసెస్ ఆగిపోయి, ఇన్‌ఫ్లమేషన్ మొదలవుతుంది అని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఉదయం బ్రష్ చేయకపోవడం కన్నా రాత్రి బ్రష్ (Brush teeth)చేయకపోవడం ఎక్కువ హానికరమని హెచ్చరిస్తున్నారు. సరైన నిద్ర లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గి, చిగుళ్ల సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా పుచ్చిపోయిన పళ్లు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, లేదా నిద్రలో పళ్లు కొరుక్కోవడం వంటి సమస్యలు మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. రాత్రిపూట మీ నోటిని పట్టించుకోకపోతే, అది మీ చిరునవ్వును, నిద్రను రెండింటినీ పాడు చేస్తుంది అని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

Brush teeth: రాత్రి పూట బ్రష్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..

నోటి pH బ్యాలెన్స్‌

పడుకోవడానికి కనీసం 60-90 నిమిషాల ముందు ఏమీ తినకండి. రాత్రిపూట తినే ఆహారం బ్యాక్టీరియాకు ఆహారంగా మారుతుంది. రోజూ రాత్రి బ్రష్ చేయడం, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి. ఘాటైన మెంతాల్ ఉన్న పేస్ట్‌లు కాకుండా, పుదీనా లేదా లవంగ నూనె ఉన్న మౌత్‌వాష్ వాడటం మంచిది. ఇది నోటి pH బ్యాలెన్స్‌ను కాపాడటానికి సహాయపడుతుంది. గురక, పళ్లు కొరకడం వంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్లు సూచించిన నైట్ గార్డులు వాడాలి. ఇవి దవడ కండరాలకు విశ్రాంతినిచ్చి, గాలి ప్రసరణను మెరుగుపరుస్తాయి. అలాగే రాత్రిపూట చిగుళ్ల వాపు రక్తంలో కలిసి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ప్రమాదాలను పెంచుతుంది. ముఖ్యంగా పిల్లలు, పంటి క్లిప్పులు ఉన్న టీనేజర్లు, మందులు వాడే వృద్ధులు, ఒత్తిడితో బాధపడేవారు రాత్రిపూట నోటి ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. పడుకోవడానికి మూడు, నాలుగు గంటల ముందు షుగర్ ఉన్న పానీయాలు, కెఫీన్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల నిద్ర, నోటి ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి.

దంతాలను తోముకోవడం చరిత్ర ఏమిటి?

నోటి ఆరోగ్యం వైపు కొనసాగుతున్న ప్రయాణంలో, దంతాలను తోముకోవడం యొక్క చరిత్ర 3000 BC నాటి ఒక ముఖ్యమైన ఆచారంగా నిలుస్తుంది. టూత్ బ్రష్ యొక్క మొట్టమొదటి రూపం ఈజిప్ట్ మరియు బాబిలోనియా పురాతన నాగరికతల నుండి వచ్చింది, అక్కడ ప్రజలు తమ దంతాలను శుభ్రం చేసుకోవడానికి “చూ కర్ర” – చివర చిరిగిన కొమ్మను ఉపయోగించారు.

బ్రషింగ్‌ను ఎవరు కనుగొన్నారు?

ఈజిప్షియన్ సమాధులలో లభించిన ఆధారాలు క్రీస్తుపూర్వం 3500 – 3000 నాటి ప్రారంభ టూత్ బ్రష్‌లను ఈజిప్షియన్లు మరియు బాబిలోనియన్లు కొమ్మల చివరలను తొక్కడం ద్వారా టూత్ బ్రష్‌లను తయారు చేశారు. క్రీస్తుపూర్వం 1600 ప్రాంతంలో చైనీయులు ‘చూయింగ్ స్టిక్స్’ను అభివృద్ధి చేశారు, ఇవి సుగంధ ద్రవ్యాల చెట్ల నుండి కొమ్మలను తీసుకొని శ్వాసను తీపి చేయడానికి నమలడం.

ఏ దేశం పళ్ళు తోముకోవడం ప్రారంభించింది?

పళ్ళు తోముకోవడం చరిత్ర దాదాపు 5,000 సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో ప్రారంభమైంది. వారు తమ దంతాలను శుభ్రం చేసుకోవడానికి అరక్ చెట్టు కొమ్మలను నమలడం అనే మార్గదర్శక ఆలోచనతో ముందుకు వచ్చారు. ఈ ప్రత్యేక కొమ్మలు ఒక చివర చిరిగిపోయి, బ్రష్ లాంటి సాధనాన్ని సృష్టిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/raisins-health-benefits-empty-stomach/health/544848/

Breaking News brushing habits Dental Care healthy teeth latest news night brushing oral hygiene Telugu News tooth decay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.