📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Neem Leaves : వేపాకుల‌ను రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

Author Icon By Sudha
Updated: June 16, 2025 • 3:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చేదుగా ఉండే ఆహార ప‌దార్థాల‌ను తినేందుకు చాలా మంది అంత‌గా ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఆయుర్వేదం(Ayurveda), నాటి వైద్యశాస్త్రం, మరియు నవీన వైద్య (modern medicine)పరిశోధనల్లో వీటి ఆరోగ్య ప్రయోజనాలు(Benefits)చాలానే ఉన్నట్లు స్పష్టమైంది.

Neem Leaves : వేపాకుల‌ను రోజూ తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..

ఔష‌ధాలుగా..
చేదుగా ఉండే ఆహారాలు మ‌న‌కు ఔష‌ధాలుగా ప‌నిచేస్తాయి. అందుక‌నే చేదుగా ఉండే వేపాకుల‌కు ఆయుర్వేదంలో ఎంత‌గానో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. చేదుగా ఉండే కాక‌ర‌కాయ‌ల‌నే తిన‌లేరు, ఇక వేపాకుల‌ను ఎలా తింటారు.. అని సందేహించ‌కండి. ఎందుకంటే వేపాకుల‌ను తిన‌డం వల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. అనేక ర‌కాల వ్యాధుల‌కు వేప దివ్య ఔష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వేపాకుల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే నాలుగైదు తీసుకుని నేరుగా అలాగే న‌మిలి తినాలి. చేదుగా ఉన్న‌ప్ప‌టికీ తిన‌డం అల‌వాటు చేసుకుంటే కొద్ది రోజుల‌కు ఎలాంటి చేదు రుచిని మీరు ఫీల్ అవ్వ‌రు.
డ‌యాబెటిస్‌కు దివ్యౌష‌ధం
ప్ర‌స్తుతం చాలా మంది డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. చిన్న వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా షుగ‌ర్ వ‌స్తోంది. అయితే వేపాకులు డ‌యాబెటిస్‌కు దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తాయి. వేపాకుల‌ను రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తింటుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల ఇన్సులిన్ నిరోధ‌కత త‌గ్గుతుంది. శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు వేపాకుల‌ను తినాలి. ఎందుకంటే షుగ‌ర్ లెవ‌ల్స్ మ‌రీ అధికంగా పడిపోతే ప్ర‌మాదం క‌నుక డాక్ట‌ర్ సూచ‌న మేర‌కు ఈ ఆకుల‌ను తినాల్సి ఉంటుంది.
ర‌క్త శుద్ధి
వేపాకుల‌ను తిన‌డం వ‌ల్ల ర‌క్త శుద్ధి జ‌రుగుతుంది. వేపాకుల్లో శుద్ధి చేసే గుణాలు ఉంటాయి. ఇవి లివ‌ర్‌, కిడ్నీల‌పై ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో ఆయా భాగాల్లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోతాయి. ఉద‌యం ప‌ర‌గ‌డుపునే వేపాకుల‌ను తింటే శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. రోగాలు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. వేపాకుల్లో యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. క‌నుక ఈ ఆకుల‌ను తింటుంటే పొట్ట‌లో ఉండే నులి పురుగులు న‌శిస్తాయి. ముఖ్యంగా చిన్నారుల‌కు ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వారికి ఒక‌టి లేదా రెండు వేపాకుల‌ను తినిపిస్తుంటే ఫ‌లితం ఉంటుంది.
ఇన్‌ఫెక్ష‌న్లకు దూరం
వేపాకుల్లో ఫ్లేవ‌నాయిడ్స్‌, టెర్పినాయిడ్స్‌, నింబిన్‌, నింబిడిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి యాంటీ వైర‌ల్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో శ‌రీరం వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల‌ను త‌గ్గిస్తుంది. వ‌ర్షాకాలం సీజ‌న్‌లో వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. ద‌గ్గు, జ‌లుబు నుంచి సైతం త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. వేపాకుల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. వేపాకుల‌ను నేరుగా అలాగే తింటుండాలి. లేదా వీటిని పేస్ట్‌లా చేసి దాన్ని క‌ట్టులా చేసి క‌డుతుండాలి. దీంతో శ‌రీరంలోని నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇలా వేపాకుల‌తో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also:Skipping: రోజూ స్కిప్పింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu neem leaves daily? of eating Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news What are the benefits

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.