రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసులు నీరు(Water) తాగాలనేది సాధారణ సిఫారసు అయినప్పటికీ, ఈ సూత్రం అందరికీ వర్తించదని నిపుణులు చెబుతున్నారు. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులు, వాతావరణం వంటి అంశాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. తగినంత నీరు తాగితే శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండటం, రోగనిరోధక శక్తి పెరగడం, మెదడు, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడటం వంటి లాభాలు కలుగుతాయి. అదే సమయంలో, శరీరంలో నీటి శాతం తగ్గితే ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పి తలనొప్పి, నీరసం, ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు వస్తాయి.
Read also : FinInternet: డిజిటల్ ఆస్తుల కోసం కొత్త ఆర్థిక నెట్‌వర్క్
నీరు ఎప్పుడు, ఎలా తాగాలి?
ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో నిమ్మరసం పిండుకుంటే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు చెమట రూపంలో ద్రవాలు బయటకు పోతాయి కాబట్టి నీరు తాగడం ముఖ్యం. ‘National Library of Medicine’ అధ్యయనం ప్రకారం, భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగడం ఉత్తమం. అయితే, భోజనం చేస్తున్నప్పుడు లేదా చేసిన వెంటనే నీరు తాగకూడదు. తలనొప్పి, అలసట ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే నీరు తాగడం మేలని సూచిస్తున్నారు.
తగిన మోతాదు, అధిక వినియోగంతో సమస్యలు
‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం, వాతావరణం, ఆహార పద్ధతులను బట్టి పురుషులు రోజుకు 3 లీటర్లు, మహిళలు 2.2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తాగాలని సిఫార్సు చేయబడింది. ‘mayoclinic’ అధ్యయనం ప్రకారం, ఆహారం ద్వారా లభించే నీటితో కలిపి పురుషులు రోజుకు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలి.
అయితే, ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ‘వాటర్ ఇన్ టాక్సికేషన్’ వచ్చి శరీరంలో సోడియం స్థాయి పడిపోతుంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలిక డయాబెటిస్, బీపీతో బాధపడుతున్నవారు అవసరానికి మించి నీరు తాగితే కిడ్నీ, గుండెపై ఒత్తిడి పెరిగి గుండెకు రక్తం పంప్ కావడం తగ్గిపోతుందని డాక్టర్ అమ్మన్న నలమాటి హెచ్చరించారు. గంటకు 250-350 మి.లీ చొప్పున గోరు వెచ్చని నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కాళ్లు, ముఖం వాపులు ఉన్నా, నడిస్తే ఆయాసం వచ్చినా నీళ్లు తాగడం తగ్గించి వైద్యుల సలహా తీసుకోవాలి.
అధ్యయనాలు, ఆరోగ్య ప్రయోజనాలు
తగినంత నీరు తాగేవారిలో కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయని ‘జర్నల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్’ పేర్కొంది. కేవలం ఒక శాతం డీహైడ్రేషన్ కూడా దృష్టి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపుతుందని ‘యూరోపియన్ హైడ్రేషన్ ఇన్ స్టిట్యూట్’ నివేదికలో తెలిపింది. చల్లని నీరు కంటే, గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియకు మంచిదని సిఫార్సు చేస్తున్నారు. నీరు తగినంత తాగడం వల్ల చెమట, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోయి, మెదడు, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది.
రోజుకు ఎంత నీరు తాగాలని ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తోంది?
పురుషులు 3 లీటర్లు, మహిళలు 2.2 నుంచి 2.5 లీటర్ల నీరు తాగాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సు చేస్తోంది.
ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వచ్చే ప్రమాదం ఏమిటి?
ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ‘వాటర్ ఇన్ టాక్సికేషన్’ వచ్చే అవకాశం ఉంది, దీని వల్ల శరీరంలో సోడియం స్థాయి పడిపోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :