📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Heart Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే..

Author Icon By Sudha
Updated: June 19, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం గుండెపోటు(heart attack)కు కో లెస్ట్రాల్ (Cholesterol)మాత్రమే కారణమని కాదు, అనేక ఇతర అంశాలు కూడా భారీ పాత్ర వహిస్తున్నాయని తాజా పరిశోధనలు (Latest research)సూచిస్తున్నాయి.

Heart Health: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే..


గుండెపోటు… ఈ పేరు వింటేనే గుండె గుభేల్ అంటుంది. కొలెస్ట్రాల్ ఒక్కటే దీనికి కారణమని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదంటోంది కొత్త పరిశోధన. మన రోజువారీ అలవాట్లు, చిన్న చిన్న మార్పులు సైతం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు. మందులు, పరీక్షలతో పనిలేకుండా కేవలం ఐదు నిమిషాల అలవాట్లతో గుండెపోటును ఎలా నివారించవచ్చో తెలుసా?
దైనందిన అలవాట్లు
గుండెపోటు అనేది ఈ రోజుల్లో చాలామందిని కలవరపెడుతోంది. కొలెస్ట్రాల్ ఒక్కటే దీనికి కారణం కాదని, మన దైనందిన అలవాట్లు గుండె ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. కేవలం ఐదు నిమిషాల చిన్నపాటి మార్పులు సైతం ఔషధాల కన్నా ప్రభావవంతంగా పని చేస్తాయట. వైద్యులు తరచుగా మందులు, పరీక్షలు సూచిస్తారు. కానీ, మన రోజువారీ అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయో చెప్పరు. చిన్న చిన్న మార్పులు, కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో చేసే పనులు మన గుండెకు గొప్ప రక్షణ కవచంలా నిలుస్తాయి. కూర్చున్న చోటు నుంచి లేచి కాళ్ళు, చేతులు సాగదీయడం, శ్వాసపై ధ్యాస పెట్టడం లేదా భోజనం తర్వాత కాసేపు నడవడం లాంటివి చిన్న మార్పులుగా అనిపించినా, వీటి ప్రభావం చాలా పెద్దది.
పది నిమిషాలు నడవడం
భోజనం చేశాక పది నిమిషాలు నడవడం కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాదు, శరీరంలో వాపును తగ్గించడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం తర్వాత రోజూ కాసేపు నడవడం ద్వారా మీ గుండెకు గొప్ప రక్షణ కల్పించవచ్చు.
తగినంత నిద్ర లేకపోతే
సరిగా నిద్రపోకపోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని 200% పెంచుతుంది అని తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. నిద్ర కేవలం విశ్రాంతి కాదు, శరీరానికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే ప్రక్రియ. తగినంత నిద్ర లేకపోతే ఒత్తిడి నియంత్రణ, రక్తపోటు, వాపు స్థాయిలు దెబ్బతింటాయి. కనీసం 7-8 గంటల నిద్ర గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఉదయం సూర్యరశ్మి శరీరంలోని సహజ గడియారాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. గుండెకు అత్యుత్తమ ఔషధం నిద్రే.
హానికరమైన రసాయనాలు
ప్లాస్టిక్ పాత్రలలో ఆహారాన్ని వేడి చేయడం లేదా నిల్వ చేయడం వెంటనే మానేయాలి! ప్లాస్టిక్ నుండి విడుదలయ్యే హానికరమైన రసాయనాలు హార్మోన్లను దెబ్బతీసి, శరీరంలో వాపును పెంచుతాయి. ఇవి రెండూ గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ప్లాస్టిక్ బదులు గాజు, స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు వాడండి. తాగే నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకోండి.
ఆరోగ్యకరమైన శరీర బరువును కొనసాగించడం గుండెపై భౌతిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువులో కొద్దిపాటి మార్పు సైతం గుండె ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది.

Read Also:Health: తలనొప్పి ఎక్కువగా ఉందా.. అయితే ఈ ఆసనాలను ట్రై చేయండి

#BeyondCholesterol #GutHealth #HealthyLifestyle #HeartAttack #HeartHealth #Inflammation Breaking News in Telugu Google news Google News in Telugu heart disease.. Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today To avoid Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.