📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Thirst at night :రాత్రిపూట దాహం వేస్తుందా? తేలిగ్గా తీసుకోకండి..

Author Icon By Sudha
Updated: July 14, 2025 • 4:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాత్రిపూట నిద్రలో నుంచి లేచి నీరు తాగే అలవాటు కేవలం అలవాటే కాదు, కొన్నిసార్లు అది బాడీలో ఏదో ఒక ఆరోగ్య సంబంధి (health related) సమస్యకు సంకేతంగా ఉండవచ్చు. దీన్ని “nocturia” అంటారు. ఇది ఒక ఆరోగ్య సమస్యగా మారకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. షుగర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్మోన్ల మార్పులు లాంటి సమస్యలు దీని వెనక రీజన్స్ అయి ఉండొచ్చు. ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవడం అస్సలు సేఫ్ కాదు.

డీహైడ్రేట్

రాత్రిపూట (Thirst at night) ఎక్కువగా దాహం అనిపించడం షుగర్‌ కు ఒక ముఖ్య లక్షణం. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని ఎక్కువ చక్కెర శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. బాడీ ఎక్కువ మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపడానికి ట్రై చేస్తుంది. దీంతో డీహైడ్రేషన్, దాహం ఏర్పడతాయి. దీనివల్ల రాత్రిపూట (Thirst at night) మళ్లీ మళ్లీ నీరు తాగాలనిపిస్తుంది. ఇది షుగర్‌ తో సంబంధం లేని ఒక అరుదైన వ్యాధి. ఈ ప్రాబ్లమ్ వల్ల బాడీలోని యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ లోపించడంతో ఎక్కువగా మూత్రం వస్తుంది. దీని వల్ల శరీరం నీటిని నిలుపుకోలేదు. అందుచేత రాత్రిపూట విపరీతమైన దాహం వేయడం కామన్.

Thirst at night :రాత్రిపూట దాహం వేస్తుందా? తేలిగ్గా తీసుకోకండి..

నోటి లోపల తేమ తగ్గిపోతుంది

కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే బాడీలోని నీటి శాతం సమతుల్యంలో ఉండదు. దీని ఎఫెక్ట్‌ తో రాత్రిపూట (Thirst at night) ఎక్కువగా మూత్ర విసర్జన అవసరం ఏర్పడుతుంది. దాంతో పాటు దాహం అనిపించడం కూడా సహజం. తరచూ రాత్రిపూట నీరు తాగాల్సి వస్తే కిడ్నీ టెస్టులు చేయించుకోవడం మంచిది. నిద్ర సమయంలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం వల్ల నోటి లోపల తేమ తగ్గిపోతుంది. ఈ పొడిబారిన పరిస్థితి వల్ల శరీరానికి నీటి అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. రాత్రిపూట దాహంగా ఉండడం స్లీప్ అప్నియా అనే కండిషన్‌ కు సిగ్నల్ కావచ్చు.

Thirst at night :రాత్రిపూట దాహం వేస్తుందా? తేలిగ్గా తీసుకోకండి..

మెడిసిన్స్ వల్ల డీహైడ్రేషన్

మహిళల్లో మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు ఎక్కువ చెమట, నీరు కోల్పోవడం లాంటి వాటికి దారి తీస్తాయి. దీనివల్ల రాత్రిపూట విపరీతమైన దాహం కావచ్చు. రాత్రిపూట ఉప్పు, కారంగా ఉండే ఫుడ్ తినడం వల్ల బాడీ నీరు కోల్పోతుంది. కొంతమంది వాడే మెడిసిన్స్ వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. ఆల్కహాల్, కాఫీ లాంటి డ్రింక్స్.. ఇవి మూత్ర విసర్జనను పెంచే గుణాలు కలిగి ఉండటం వల్ల బాడీలోని నీరు తగ్గిపోతుంది. నిద్రలో ముక్కు మార్గం మూసుకుపోయినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వల్ల నోరు ఎండిపోతుంది. రాత్రిపూట తరచూ నీరు తాగాలనిపించడం చిన్న సమస్యలా కనిపించవచ్చు. కానీ దీని వెనక ఆరోగ్య సమస్యలు దాగి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది తరచూ జరుగుతుందంటే డాక్టర్లను కలిసి అసలు కారణం తెలుసుకోవడం బెస్ట్.

రాత్రి దాహం దేనిని సూచిస్తుంది?

పగటిపూట తగినంత నీరు తాగకపోవడం వల్ల రాత్రిపూట అధిక దాహం వేస్తుంది. మీరు మసాలా లేదా ఉప్పగా ఉండే ఆహారాలు తినడం లేదా పడుకునే ముందు మద్యం తాగడం వల్ల కూడా మీకు రాత్రిపూట దాహం వేస్తుంది. వేడి గదిలో ఉండటం లేదా నోటి ద్వారా శ్వాస తీసుకోవడం ఇతర కారణాలు

రాత్రి దాహాన్ని ఎలా ఆపగలను?

రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటం, కెఫిన్ లేదా ఆల్కహాల్ వంటి మూత్రవిసర్జన పదార్థాలను నివారించడం, పరిమిత సోడియంతో సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు అధిక దాహానికి దోహదపడే ఏవైనా వైద్య పరిస్థితులను నిర్వహించడం ద్వారా మీరు రాత్రిపూట దాహాన్ని తగ్గించుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Curd : జ్ఞాపక శక్తి పెరగాలంటే పెరుగులో ఇది కలిపి తీసుకోండి.

Breaking News frequent thirst at night health warning latest news night thirst nocturnal thirst Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.