చిలగడదుంప బజ్జీలు – (Sweet potato fritters) వింటేనే నోరూరుతుంది కదా ! ఇది రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కొంత మేర ఉపయోగకరంగా ఉండే స్నాక్ (Healthy Snacks ) కూడా. చిలగడదుంపలను (స్వీట్ పొటాటోలు) వాడి బజ్జీలు (Sweet potato fritters)తయారు చేస్తే అవి సాధారణ ఆలు బజ్జీలకంటే కొద్దిగా హెల్తీ ఆప్షన్ అవుతాయి. ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి పల్చగా పొడవాటి ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, వాము, సోడా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. అంటే బజ్జీ వేసేందుకు వీలుగా జారుడుగా పిండి వచ్చేలా ఈ నీళ్లను పోసుకోవాలి.
కావలసిన పదార్థాలు
శనగపిండి: కప్పు, బియ్యప్పిండి: అరకప్పు, వాము: పావు స్పూను, కారం: ఒక స్పూను, ఉప్పు: తగినంత
సోడాఉప్పు: చిటికెడు, చిలగడ దుంపలు: పెద్దవి రెండు, నూనె: వేయించడానికి సరిపడినంత.
తయ్యారు చేసే విధానం
ముందుగా చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి పల్చగా పొడవాటి ముక్కలుగా తరిగి నీళ్లలో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. అందులో ఉప్పు, వాము, సోడా, కారం వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. అంటే బజ్జీ వేసేందుకు వీలుగా జారుడుగా పిండి వచ్చేలా ఈ నీళ్లను పోసుకోవాలి. తర్వాత పిండిలో అన్నీ కలిసేలా బాగా కలియబెట్టాలి. ఎంత కలిపితే బజ్జీలు అంత గుల్లగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా కాగాక, ఇందాక కలిపి పెట్టుకున్న పిండిలో చిలగడదుంప ముక్కలను ముంచి అందులో వేయాలి. మంట తక్కువగా పెట్టి కాలిస్తే లోపలి చిలగడదుంప కూడా చక్కగా ఉడుకుతుంది.
వడలు చరిత్ర ఏమిటి?
వడలను మొదట పురాతన రోమన్లు తినారని, తరువాత వారు వాటిని యూరప్‌కు పరిచయం చేశారని నమ్ముతారు . వడలను అనేక వంటకాల్లో ఉపయోగిస్తారు. ఫ్రెంచ్ బీగ్నెట్స్, ఇటాలియన్ “బిగ్నే” మరియు గ్రీకు “లౌకౌమేడ్స్” వివిధ దేశాలకు ప్రత్యేకమైన వడల రకాలకు ఉదాహరణలు.
వడ మరియు డోనట్ మధ్య తేడా ఏమిటి?
డోనట్స్‌ను సాధారణంగా వేయించి, పేస్ట్రీ క్రీమ్ లేదా జెల్లీ వంటి ఫిల్లింగ్‌ను పైపు ద్వారా పంపిస్తారు. వడలు తరచుగా తరిగిన ఆపిల్ లేదా అరటిపండ్లు వంటి ఘన పదార్థాలను వేయించడానికి ముందు పిండిలో కలుపుతారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ ప్రారంభ దశలో కనిపించే ముఖ్య