మొలకలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల, అనేక మంది మొలకల (Sprouts ) ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటుంటారు. అయితే, వర్షాకాలం వచ్చేసరికి ఈ మొలకలు (Sprouts )తడిగా మారి త్వరగా పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి తేమను ఎక్కువగా ఆకర్షించడంతో ఫంగస్, బాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని తింటే లేనిపోని రోగాలు (Chronic diseases) వస్తాయి. అందుకే, వానకాలంలో మొలకలను పచ్చిగా తినడానికి బదులుగా.. ఉడకబెట్టి తీసుకోవాలి. ఇక చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటే.. నోటికీ రుచిగా ఉంటుంది.
నిల్వ చేసే పద్దతి
మొలకలు తయారు చేసే సమయంలో నీటిని తక్కువగా వాడాలి. అవసరమైన నీటిని వడకట్టిన తరువాత మొలకలు తడి తగ్గిన తరువాత నిల్వ చేయాలి. మొలకలను (Sprouts ) గాలివొచ్చే చోట లేదా ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వుంచకూడదు. తడి ఎక్కువైతే వెంటనే పాడవుతాయి. మొలకలను తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచితే అవి ఎక్కువ రోజులు తాజాగానే ఉంటాయి. ఫ్రిజ్‌లో వాడే ముందు వరకు నిల్వ చేయవచ్చు. మొలకల్లో నలుపు లేదా ముదురు రంగు మార్పు ఉంటే, వాసన ఉంటే వాటిని వెంటనే పడెయ్యాలి . వర్షాకాలంలో ఎక్కువ మొలకలు కాకుండా ఒక్కోసారి తక్కువ మొత్తంలో తయారు చేసి, త్వరగా వాడటం మంచిది.
మొలకల ప్రత్యేకత ఏమిటి?
మొలకలు అనేవి ధాన్యాలు, పప్పులు లేదా గింజలు నీటిలో నానబెట్టి, కొంత సమయం తర్వాత మొలకలు వాలినప్పుడు సిద్ధమయ్యే సహజ ఆహార పదార్థాలు. ఇవి సాధారణ ఆహార పదార్థాలతో పోలిస్తే పోషక విలువలో చాలా గొప్పవిగా గుర్తించబడతాయి. మొలకల తయారీ ప్రక్రియ వల్ల గింజలలోని పోషకాలు ప్రాకృతికంగా పెరుగుతాయి.
మొలకలు రోజూ తినడం మంచిదేనా?
రోజు ఉదయం మొలకలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అవును, మొలకలు పోషకాలతో నిండి ఉంటాయి మరియు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి కాబట్టి, సాధారణంగా ప్రతిరోజూ తినడం మంచిది. అయితే, ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి వాటిని సరిగ్గా శుభ్రం చేసి నిల్వ చేయడం ముఖ్యం.