📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Snoring – గురక ప్రాణాంతకమా.. కాదా తెలుసుకుంద్దాం ..

Author Icon By Sudha
Updated: October 1, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గురకనే వైద్య పరిభాషలో అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా అంటారు. గురక అనేది ఒక సాధారణ శ్వాస రుగ్మత. నిద్రపోయే సమయంలో పెద్దగా వచ్చే శబ్ధంతో దీనిని సులభంగా గుర్తించవచ్చు. ఈ గురక (Snoring)స్లీప్ ఆప్నియాకు సంకేతం కావచ్చు. ఇది గుండెపై ఒత్తిడిని పెంచి, గుండెపోటు, అధిక రక్తపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది. సాధారణ నిద్రగా భావించకుండా, అలసటగా అనిపిస్తే లేదా గురక (Snoring) తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొంతమంది నిద్రపోయిన వెంటనే గురక (Snoring)పెట్టేస్తారు. సాధారణంగా ఈ గురక మంచి నిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ, వైద్య నిపుణుల ప్రకారం, గురక ప్రాణాంతకం కావచ్చు. సాధారణ గురక సమస్య కానప్పటికీ, బిగ్గరగా గురక పెట్టేవారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ గురక కారణంగా వయసుతో సంబంధంలేకుండా నిద్రలోనే మృతి (Died in sleep) చెందిన ఘటనలూ ఉన్నాయి.

Snoring – గురక ప్రాణాంతకమా.. కాదా తెలుసుకుంద్దాం ..

బిగ్గరగా గురక పెట్టడం కొన్నిసార్లు స్లీప్ ఆప్నియాకు సంకేతం. స్లీప్ ఆప్నియాతో బాధపడేవారికి వాయు మార్గం ఇరుకుగా మారి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసి ప్రాణాంతకం కావచ్చని వైద్యులు పేర్కొన్నారు. స్లీప్ ఆప్నియా అధిక రక్తపోటు, స్ట్రోక్ మరియు ఇతర గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. నిద్రపోతున్నప్పుడు బిగ్గరగా గురక వస్తున్నా లేదా నిద్ర తర్వాత అలసటగా అనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ వహించకూడదు. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.. ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులను వెంటనే సంప్రదించండి.

గురకను ఎలా ఆపాలి?

జీవనశైలి మార్పులు గురకను ఆపడానికి మొదటి వరుస చికిత్స. సిఫార్సు చేయబడిన జీవనశైలి మార్పులలో ధూమపానం మానేయడం, నిద్రవేళకు ముందు మద్యం సేవించడం మానేయడం మరియు పక్కకు తిరిగి పడుకోవడం (పార్శ్వ స్థానం) ఉన్నాయి. పక్కకు తిరిగి పడుకోవడం వల్ల నాలుక యొక్క బేస్ వెనుకకు పడి వాయుమార్గాన్ని అడ్డుకునే ధోరణి తగ్గుతుంది.

గురకకు ప్రధాన కారణం ఏమిటి?

గురకకు ప్రధాన కారణం గాలి ఇరుకైన వాయుమార్గం గుండా వెళుతున్నప్పుడు గొంతులోని సడలించిన కణజాలాలు అల్లాడుట. నిద్రలో నాలుక, మృదువైన అంగిలి మరియు గొంతులోని కండరాలు విశ్రాంతి పొందినప్పుడు ఈ సంకుచితం సంభవిస్తుంది, దీనివల్ల అవి కంపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు గురక శబ్దం వస్తుంది. దీనికి దోహదపడే కారకాలు వయస్సు, అధిక బరువు, మద్యం సేవించడం మరియు నాసికా రద్దీ, ఇవన్నీ వాయుమార్గ అవరోధాన్ని పెంచుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News breathing problems latest news sleep apnea Sleep Disorders snoring snoring causes Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.