📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Sesame Jaggery Laddu – రోజూ ఒక నువ్వుల ల‌డ్డూ తింటే ఎంతో మంచిది

Author Icon By Sudha
Updated: September 1, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాయంత్రం అయిందంటే చాలా మంది ఏం చిరు తిండి తిందామా.. అని ఆలోచిస్తుంటారు. బ‌య‌ట ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై ల‌భించే బ‌జ్జీలు, బొండాలు, మిర్చి, పునుగుల‌తోపాటు స‌మోసా, బేక‌రీల‌లో ల‌భించే వివిధ ర‌కాల ప‌ఫ్స్‌, చిప్స్ వంటి ఫుడ్స్‌ను సాయంత్రం తింటారు. అయితే ఇవ‌న్నీ అనారోగ్య‌క‌ర‌మైన ఆహారాలు. వీటిని తింటే మ‌న శ‌రీరానికి ఎలాంటి లాభం క‌ల‌గ‌క‌పోగా న‌ష్టాలే క‌లుగుతాయి. ఎప్పుడో ఒక‌సారి అయితే జిహ్వా చాప‌ల్యం కొద్దీ ఈ ఆహారాల‌ను తిన‌వ‌చ్చు. కానీ త‌ర‌చూ తింటే ఆరోగ్యానికి తీవ్ర‌మైన హాని క‌లుగుతుంది. కానీ సాయంత్రం స‌మ‌యంలో ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ తింటే త‌ద్వారా స్నాక్స్ తిన్న అనుభూతి క‌లుగుతుంది. పైగా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయి. శ‌రీరానికి ఎలాంటి హాని క‌ల‌గ‌దు. ఇక ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ విష‌యానికి వ‌స్తే వాటిల్లో నువ్వుల ల‌డ్డూలు (Sesame laddus) ఒక‌టని చెప్ప‌వ‌చ్చు.

Sesame Jaggery Laddu – రోజూ ఒక నువ్వుల ల‌డ్డూ తింటే ఎంతో మంచిది

హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి

నువ్వుల లడ్డూల‌ను బెల్లంతో (Sesame Jaggery Laddu)క‌లిపి త‌యారు చేసుకుని రోజూ సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్ రూపంలో ఒక‌టి లేదా రెండు ల‌డ్డూల‌ను తింటే అనేక ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ల‌డ్డూల్లో పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి. నువ్వుల్లో క్యాల్షియం స‌మృద్ధిగా ఉంటుంది క‌నుక ఈ ల‌డ్డూల‌ను తింటే ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. నువ్వుల్లో ఉండే మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ కూడా ఎముక‌ల‌ను బ‌లంగా ఉంచుతాయి. దంతాలు కూడా దృఢంగా ఉంటాయి. ఈ ల‌డ్డూల‌ను తింటే ఆయా పోష‌కాలు స‌మృద్ధిగా ల‌భించి వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నువ్వుల లడ్డూల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ ల‌డ్డూల‌ను తింటే శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది.

జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది

నువ్వుల ల‌డ్డూల‌ను (Sesame Jaggery Laddu)తింటే శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. సాయంత్రానికి నీర‌సం అల‌స‌ట ఉంటాయి క‌నుక ఆ స‌మయంలో ఈ ల‌డ్డూల‌ను తింటే మ‌ళ్లీ ఉత్సాహంగా మారుతారు. శ‌క్తి వ‌చ్చి మళ్లీ యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. ఈ ల‌డ్డూల్లో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించి ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. క‌నుక అల‌స‌ట‌, నీర‌సం ఉన్న‌వారు ఈ ల‌డ్డూల‌ను తింటుంటే మేలు జ‌రుగుతుంది. నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం రాకుండా చూస్తుంది. బెల్లం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. క‌నుక నువ్వుల ల‌డ్డూల‌ను రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటే త‌ద్వారా జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

Sesame Jaggery Laddu – రోజూ ఒక నువ్వుల ల‌డ్డూ తింటే ఎంతో మంచిది

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ ప‌టిష్టం

నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. అలాగే లిగ్న‌న్స్‌, ఫైటోస్టెరాల్స్ కూడా స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. నువ్వుల ల‌డ్డూల‌ను తింటే శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో శ‌రీరం వేడిగా ఉంటుంది. చ‌లి నుంచి త‌ట్టుకోవ‌చ్చు. అలాగే ఈ ల‌డ్డూల్లో ఉండే మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తాయి. దీంతో సీజ‌న‌ల్ గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ఇలా ఈ ల‌డ్డూల‌ను రోజూ తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

నువ్వుల లడ్డు ఆరోగ్యానికి మంచిదా?

ఆర్థరైటిస్ మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించడానికి టిల్ గుర్ లడ్డు మంచిది . నువ్వులలో పుష్కలంగా ఉండే మరియు ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడే విటమిన్ బి12, రక్తహీనతతో బాధపడే పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక్కడ కొన్ని అపారమైన ప్రయోజనాలు మరియు మీ కోసం త్వరిత టిల్ లడ్డు రెసిపీ ఉన్నాయి.

షుగర్ పేషెంట్స్ నువ్వుల లడ్డు తినవచ్చా?

డయాబెటిస్ నివారణ మందులు, నువ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ మందులను ఉపయోగించి రక్తంలో చక్కెర కూడా నియంత్రించబడుతుంది. నువ్వులను డయాబెటిస్ మందులతో తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా తగ్గుతాయి.

నువ్వులు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా?

నువ్వులలో లిగ్నన్లు మరియు ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే మొక్కల సమ్మేళనాలు. ఫైటోస్టెరాల్స్ మీ రోగనిరోధక ప్రతిస్పందనను పెంచుతాయని మరియు కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తాయని కూడా నమ్ముతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/fish-health-benefits-advantages/health/538943/

Breaking News Healthy Sweets Jaggery Benefits latest news Sesame Laddu Sesame Seeds Telugu News traditional Indian sweets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.