📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Raw Papaya – ప‌చ్చి బొప్పాయిని తింటే ఎన్ని ప్రయోజనాలో..

Author Icon By Sudha
Updated: September 17, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బొప్పాయి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. బొప్పాయి పండ్ల‌ను అంద‌రూ ఇష్టంగా తింటుంటారు. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. వీటిని తింటే ప‌లు వ్యాధుల‌ను సైతం న‌యం చేసుకోవ‌చ్చు. అయితే బొప్పాయి పండ్లు మాత్ర‌మే కాదు, ప‌చ్చి బొప్పాయి కాయ‌ల‌ను (Raw Papaya) కూడా మ‌నం తిన‌వ‌చ్చు. వీటిని ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు వివిధ ర‌కాల వంట‌కాల్లోనూ వేస్తుంటారు. ప‌చ్చి బొప్పాయిని (Raw Papaya)తిన‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి కూడా వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో (Curing diseases)స‌హాయం చేస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిల్లో ఉండే పోష‌కాలు మ‌న‌ల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి.

Raw Papaya – ప‌చ్చి బొప్పాయిని తింటే ఎన్ని ప్రయోజనాలో..

అజీర్తి ఏర్ప‌డ‌దు

ప‌చ్చి బొప్పాయిలో ప‌పైన్ అనే శ‌క్తివంత‌మైన ఎంజైమ్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌కు చెందిన ఎంజైమ్‌. అందువ‌ల్ల ప‌చ్చి బొప్పాయిని (Raw Papaya)తింటే ప‌పైన్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది పండిన బొప్పాయి క‌న్నా ప‌చ్చి బొప్పాయిలోనే అధికంగా ఉంటుంది. క‌నుక ప‌చ్చి బొప్పాయిని తింటే మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే ప్రోటీన్లను జీర్ణం చేయ‌డంలో ప‌పైన్ ఎంతో స‌హాయం చేస్తుంది. కొంద‌రు చికెన్‌, మ‌ట‌న్ వంటివి వండిన‌ప్పుడు త్వ‌ర‌గా ఉడ‌కాల‌ని, మెత్త‌గా ఉండాల‌ని చెప్పి ప‌చ్చి బొప్పాయి ముక్క‌ల‌ను కూడా కూర‌ల్లో వేస్తుంటారు. దీని వ‌ల్ల మాంసం త్వ‌ర‌గా ఉడికి సుతిమెత్త‌గా ఉంటుంది. అలాంటి మాంసాన్ని తింటే తేలిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్తి ఏర్ప‌డ‌దు. కొవ్వు ప‌దార్థాల‌ను జీర్ణం చేయ‌డంలోనూ ప‌చ్చి బొప్పాయి ఎంతో స‌హాయం చేస్తుంది. ప‌చ్చి బొప్పాయిని తిన‌డం వ‌ల్ల అజీర్తి, గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, మ‌లబ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఆక‌లి నియంత్ర‌ణ‌

ప‌చ్చి బొప్పాయిలో ఉండే ప‌పైన్‌, కైమో ప‌పైన్ అనే ఎంజైమ్‌లు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను సైతం క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీంతో గుండె జబ్బులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ప‌చ్చి బొప్పాయిలో క్యాల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. వీటి వ‌ల్ల ప‌చ్చి బొప్పాయిని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయదు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. ప‌చ్చి బొప్పాయిని తింటే కొవ్వు మెట‌బాలిజం పెరుగుతుంది. కొవ్వు వేగంగా ఖ‌ర్చ‌వుతుంది. దీంతో బ‌రువు త‌గ్గుతారు. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ప‌చ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది.

Raw Papaya – ప‌చ్చి బొప్పాయిని తింటే ఎన్ని ప్రయోజనాలో..

చ‌ర్మం ఆరోగ్యంగా

పచ్చి బొప్పాయిలో విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. దీంతో శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్లకు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ప‌చ్చి బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కాంతివంతంగా మారి మెరుస్తుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ముఖంపై ఉండే పిగ్మెంటేష‌న్ సైతం త‌గ్గిపోతుంది. ప‌చ్చి బొప్పాయిని తింటే మ‌హిళ‌ల‌కు నెల‌స‌రి స‌మ‌యంలో వ‌చ్చే నొప్పులు త‌గ్గిపోతాయి. ఇలా ప‌చ్చిబొప్పాయి మన‌కు ఎంతో మేలు చేస్తుంది. ఇక దీన్ని ఎలా తినాలి.. అని చాలా మంది సందేహిస్తుంటారు. దీనికి పోష‌కాహార నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే.. ప‌చ్చి బొప్పాయిని సాధార‌ణ బొప్పాయిలా నేరుగా తిన‌లేం. కానీ ప‌చ్చి బొప్పాయిని ఉడ‌క‌బెట్టి లేదా ఇత‌ర కూర‌ల్లో కలిపి వండుకుని తిన‌వ‌చ్చు. ఇలా తింటుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

పచ్చి బొప్పాయి తినడం మంచిదేనా?

పండిన బొప్పాయిని పచ్చిగా తినడం మంచిది, కానీ పండని, పచ్చి బొప్పాయిని సాధారణంగా జీర్ణ సమస్యలను నివారించడానికి మరియు ముఖ్యంగా గర్భధారణ సమయంలో సమస్యాత్మకంగా ఉండే రబ్బరు పాలును కలిగి ఉండటం వలన తినడానికి ముందు ఉడికించాలి. పచ్చి పండిన బొప్పాయి ఫైబర్, విటమిన్లు మరియు పపైన్ వంటి జీర్ణ ఎంజైమ్‌లతో సమృద్ధిగా ఉండే పోషక-దట్టమైన పండు, జీర్ణక్రియకు సహాయపడటం, వాపు తగ్గించడం, హృదయ సంబంధ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడం మరియు బరువు నిర్వహణను ప్రోత్సహించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

పచ్చి బొప్పాయి కాలేయానికి మంచిదా?

పచ్చి బొప్పాయి సాధారణంగా దాని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు పపైన్ వంటి ఎంజైమ్‌ల కారణంగా కాలేయానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది, ఇవి కాలేయాన్ని శుభ్రపరచడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కొవ్వు కాలేయ వ్యాధిని మెరుగుపరచడానికి మరియు మొత్తం కాలేయ నిర్విషీకరణకు మద్దతు ఇస్తాయి. జీర్ణక్రియకు సహాయపడటం ద్వారా మరియు జీర్ణం కాని ప్రోటీన్ల నుండి కాలేయంపై భారాన్ని తగ్గించడం ద్వారా కాలేయ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడానికి దీనిని ఆహారంలో చేర్చవచ్చు.

బొప్పాయి గింజలను తినవచ్చా?

బొప్పాయి గింజలను తినవచ్చు, కానీ మితంగా తినవచ్చు, ఎందుకంటే అవి బలమైన, మిరియాల రుచిని కలిగి ఉంటాయి మరియు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి, జీర్ణక్రియకు సహాయపడతాయి, పరాన్నజీవులు మరియు బ్యాక్టీరియాతో పోరాడతాయి మరియు శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. అయితే, గర్భిణీ స్త్రీలు మరియు నిర్దిష్ట పరిస్థితులు ఉన్నవారు వాటిని నివారించాలి మరియు సంభావ్య దుష్ప్రభావాలను, ముఖ్యంగా జీర్ణ సమస్యలను నివారించడానికి వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/health-benefits-five-fruit-plants-for-home-garden/health/548523/

Breaking News digestive health health benefits latest news natural remedies raw papaya Telugu News weight loss

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.