📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Pharmacist – వైద్యుల, రోగులకు వారధులు ఫార్మసిస్టులే

Author Icon By Sudha
Updated: September 25, 2025 • 3:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆరోగ్యంపై ప్రతి వారికీ శ్రద్ధ ఉండడం సహజం. ఆరో గ్యం కోసం ప్రపంచంలోని ప్రతిఒక్కరూ నానాపాట్లు పడు
తుంటారు. చికిత్సకన్నా, నివారణే నయమని, ఇప్పుడిప్పుడే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ చిన్నపాటి రోగంవచ్చినా, వెంటనే మందులు తీసుకుంటున్నారు. ఆరోగ్య మెరుగుదలలో మందులు ప్రధానపాత్ర పోషిస్తున్నాయి. ఇంతకూ మందులను ఎవరు మెరుగుపరుస్తారో, ఎవరు తయారు చేస్తారో తెలుసా ఫార్మాసిస్టులు. వైద్య బృందంలో ఫార్మసిస్టుల (Pharmacist) ప్రాముఖ్యత ఎంతో ఉంది. చికిత్స, ఉత్పత్తులను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా రోగులకు ఆరోగ్య సేవలను మెరుగుపరచడం ఔషధ నిపుణుల ప్రాథమిక లక్ష్యం. అందువల్ల, ఫార్మసిస్ట్ (Pharmacist)ప్రాముఖ్యత, పాత్ర గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న ప్రపంచ ఫార్మసిస్ట్ (Pharmacist)దినోత్స వాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఫార్మాసిస్టులు మానవాళి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎలాంటి పాత్ర పోషిస్తారో, వైద్య ప్రపంచంలో ఫార్మాసిస్టుల పాత్ర ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం అనివార్యం గా ఉంది. వాస్తవానికి ఫార్మాసిస్టు రెండో వైద్యుడిగా (As the second doctor) పరిగణించబడతాడు. రోగులకు కావాల్సిన మందులను, ఏ రోగికి ఎంత మోతాదులో కావాలో నిర్ధారిస్తాడు. అంతేకాదు వాటి వల్ల ప్రయోజనాలు కలిగేలా చేస్తాడు. దుష్ప్రభావాలు కలగకుండా మార్గనిర్దేశాలు చేస్తాడు. క్లినికల్ ఫలితాలను మెరుగుపరచడానికి మందులు వాడే పద్ధతిని, సురక్షితమైన వాడకాన్ని కూడా ప్రోత్సహిస్తాడు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరోగికీ అందరికీ సురక్షితమైన, సమర్థవంతమైన మందులు అందించేందుకు అనుక్షణం ఫార్మాసిస్టులు కృషిసల్పుతారు. ఔషధాల వాడకాన్ని మెరుగుపరచి, రోగుల భద్రతను నిర్ధారించే, పరిరక్షించేందుకు ఫార్మాసిస్టులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తారు. ప్రజల ఆరోగ్య భద్రత రీత్యా మెడిసిన్స్లోని లోపాలను తగ్గించేందుకు ఫార్మాసిస్టులు ఎక్కువగా కృషి చేస్తారు. ఫార్మాసిస్టులు వారి విస్తృత జ్ఞానం, నైపుణ్యాన్ని ప్రజల ఆరోగ్యాల కోసం ఉపయోగిస్తారు. ఏ ఒక్క రోగికి హాని కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందనే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకుని, పనిచేస్తారు. వారు తయారు చేసిన మెడిసిన్స్ నుండి ఉత్తమ ఫలితం వచ్చేలా కృషి చేస్తారు. చాలా మంది వారి పని, తాము సూచించిన మందులను అప్పగించడమే అనుకుంటారు. కానీ జ్ఞానం, అనుభవంపరంగా వారు డాక్టర్ కంటే ఏమాత్రం తక్కువ కాదు. ఫార్మాసిస్టులకు మెడిసిన్స్, వాటి దుష్ప్రభావాల గురించి సంపూర్ణ అవగాహన ఉంటుంది.

Pharmacist – వైద్యుల, రోగులకు వారధులు ఫార్మసిస్టులే

ప్రధానంగా వైద్యుల వద్దకు వెళ్లలేని, వైద్యం చేయిం చుకోలేని నిరుపేదలకు, ఔషధాలను అందించడంలోనూ వారు ఎక్కువ బాధ్యత వహిస్తారు. కాని ఔషధ పంపిణీకి మించి ఫార్మాసిస్టు పాత్ర విస్తరిస్తుందని మనం తెలుసుకోవాలి. రోగులకు హాని లేదా మరణానికి మరో ప్రధాన కారణం ఔషధ లోపం అని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. లోపం తరచుగా శాశ్వత అవ యవ నష్టం, పక్షవాతం లేదా మరణానికి దారి తీస్తుంది. ఔషధ లోపం, వాటిని నివారించడంలో ఫార్మాసిస్టుల వల్ల కలిగే పరిణామాలను చూసిన ఈరోజును ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటి కల్ ఫెడరేషన్ 2009 ఇస్తాంబుల్ (టర్కీ)లో జరిగిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఫార్మసీఅండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో గుర్తించింది. కానీ అంతకుముందే 1912 సంవ త్సరంలోనే సెప్టెంబర్ 25న ఫార్మాసిస్టు డే జరుపుకోవ డానికి ఎంపిక చేయబడింది. అప్పటి నుండి ఫార్మాస్యూటి కల్ ఫెడరేషన్ ప్రారంభించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కనీసం 2.6 మిలియన్ ఫార్మసిస్టులు ఇతర ఫార్మా స్యూటికల్ సిబ్బంది ఉన్నట్లు అంచనా వేసింది. ఆరోగ్యకరమైన జీవనానికి సలహాఇవ్వడం, వ్యాధిని నివారించడానికి టీకాలు వేయడం మందులు సరిగ్గా తీసుకునెలా చూడడం, తద్వారా వ్యాధులను చక్కగా నయం చేయడం, జీవిత నాణ్యతను మెరుగుపరచడం, సురక్షితమైన, సమర్థవంతమైన మందులు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంద్వారా ఔషధ శాస్త్రవేత్తలు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేస్తున్న సేవలు అమోఘం. ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరూ ఫార్మాసిస్టుల సేవలను గుర్తించి, ఔషధ తయారీ నుండి, కావలసినవారికి పంపిణీ, మందు లు వాడే విధానం వరకు, అసమాన సేవలు అందిస్తున్నవారి ప్రతిభావంతమైన పాత్రకు సముచిత గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించాలి.
-రామ కిష్టయ్య సంగన భట్ల

ఫార్మసీ అంటే ఏమిటి?

ఫార్మసీ అనేది క్లినికల్ హెల్త్ సైన్స్, ఇది మెడికల్ సైన్స్‌ను కెమిస్ట్రీతో కలిపి డిస్కవరి, ప్రొడక్షన్‌, పారవేయడం, సురక్షితమైన, సమర్థవంతమైన ఉపయోగం, మేడికేషన్, డ్రగ్స్, చార్జ్ చేయబడతాయి. ఫార్మసీ సాధనకు డ్రగ్స్ గురించి అద్భుతమైన జ్ఞానం, వాటి చర్యల విధానాలు, దుష్ప్రభావాలు, పరస్పర చర్యలు, కదలికలు, విషలక్షణాలు. అదే సమయంలో, దీనికి చికిత్స పరిజ్ఞానం, రోగలక్షణ ప్రక్రియలను అవగాహన చేసుకోవడం. క్లినికల్ ఫార్మసిస్ట్‌ ఫార్మసిస్ట్‌ల వంటి కొన్ని ప్రత్యేకతలు ఇతర నైపుణ్యాలు అవసరం, ఉదాహరణకి భౌతిక, ప్రయోగశాల డేటాను తెలుసుకుని నిర్దారణ చేసే పరిజ్ఞానం.

ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అంటే ఏమిటి?

ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అనేది మందుల డిజైన్, చర్యలు, డెలివరీ, మందుల స్వభావమునకు సంబంధించిన అధ్యయనంలో గొప్ప విజ్ఞాన రంగాల గ్రూపు. వారు కెమిస్ట్రీ (ఇనార్గానిక్, భౌతిక, జీవరసాయన, విశ్లేషణాత్మక), జీవశాస్త్రం (అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, సెల్ బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ), ఎపిడెమియాలజీ, స్టాటిస్టిక్స్, కెమోమెట్రిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమికల్ ఇంజనీరింగ్ నుండి జ్ఞానాన్ని తెలుసుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News Doctors Health Services HealthCare latest news Pharmacists Pharmacy Role Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.