📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Milk: పిల్లలు పాలు తాగే సరైన సమయం తెలుసా?

Author Icon By Sudha
Updated: July 23, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లల ఎదుగుదలపై తల్లిదండ్రులు చూపే శ్రద్ధలో ఆహారం ముఖ్యమైన భాగం. పాలు (Milk) అనేది పోషకాహారాల్లో ముఖ్యమైనదిగా గుర్తింపు పొందినది. ఇందులో ఉండే కాల్షియం, విటమిన్ డీ, ప్రొటీన్లు పిల్లల ఎముకల అభివృద్ధికి, దంతాల బలానికి, మొత్తం శరీర శక్తికి ఎంతో అవసరం. అయితే పాలు ఎప్పుడైతే తాగించాలో, ఎలా తాగించాలో తెలియకపోతే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనేక మంది తల్లిదండ్రులు ఉదయం నిద్రలేవగానే, బ్రష్ చేసిన వెంటనే పిల్లలకు పాలు (Milk) ఇస్తుంటారు. ఉదయాన్నే పాలు (Milk)తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుందని వారు భావిస్తారు. కానీ, ఈ అలవాటు పిల్లలలో కొన్ని సమస్యలను సృష్టించగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు పిల్లల్లో చిరాకును కలిగించగలవు. అందుకే, కొందరు నిపుణులు పిల్లలకు ఉదయాన్నే ఖాళీ కడుపు (empty stomach)తో పాలు ఇవ్వకూడదని చెబుతున్నారు. పాలలో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదే. అయితే, ఉదయాన్నే మొదటగా పాలు తాగితే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. పాలలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. ఈ రెండూ లేకపోవడం వల్ల ఉదయం పూట పాలు తాగడం సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా రోజు మొత్తం చురుకుగా ఉండాలను కుంటే ఉదయం పాలు తాగడం తగ్గించాలి. ఇది జీర్ణశక్తిని బలహీనపరుస్తుంది. శక్తి తగ్గిపోతుంది. కాబట్టి, పిల్లలకు ఏదైనా తినిపించిన తర్వాతే పాలు ఇవ్వడం ఉత్తమం. పిల్లలకు అల్పాహారం తర్వాతే పాలు తాగే అలవాటు చేయాలి.

Milk: పిల్లలు పాలు తాగే సరైన సమయం తెలుసా?

ఆకలి వేయదు

ఖాళీ కడుపుతో పాలు తాగడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. పాలలో ఉండే కొవ్వు, ప్రోటీన్ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి, దీనివల్ల పిల్లలకు ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఫలితంగా, వారికి ఆకలి వేయదు. పిల్లలకు ఆకలి వేయకపోతే, వారు ఇతర పోషకాలను తీసుకోలేరు. ఇది వారి ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. ఉదయం నిద్రలేవగానే పిల్లలకు తల్లిపాలు కూడా ఇవ్వకూడదని గుర్తుంచుకోవాలి. పాలలో ఫైబర్ ఉండదు. ఫైబర్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణవ్యవస్థ చురుకుగా ఉండదు. అందుకే గ్యాస్ సమస్యను తగ్గించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినమని వైద్యులు సలహా ఇస్తారు. పాలలో ఫైబర్ లేనందున, ఎక్కువ మోతాదులో తీసుకుంటే అది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. దీనివల్ల రోజంతా అసౌకర్యం, కడుపు ఉబ్బరం అనిపిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా తలెత్తవచ్చు. అయితే, ఈ లక్షణాలు అందరిలోనూ కనిపిస్తాయని చెప్పలేం. జీర్ణ సమస్యలు ఉన్నవారిలో అధిక మోతాదులో పాలు తీసుకున్నప్పుడు లక్షణాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది.రాత్రిపూట ఎక్కువ పాలు తాగడం వల్ల పిల్లలలో ఐరన్ లోపం ఏర్పడవచ్చు. ఇతర ఆహార పదార్థాల నుండి ఐరన్ గ్రహింపు సరిగ్గా జరగదు. అంతేకాకుండా, పాలలో సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇది పిల్లలలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఫైబర్ లోపం వల్ల పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. కాబట్టి, ఏదైనా తిన్న తర్వాతే పాలు తాగే అలవాటు చేసుకోవడం అవసరం.

Milk: పిల్లలు పాలు తాగే సరైన సమయం తెలుసా?

పాలకు బదులుగా

పాలకు బదులుగా తేలికైన ఆహారం ఇవ్వడం ఉత్తమం. యాపిల్, అరటిపండు లేదా పొప్పడి వంటి పండ్లను ఇవ్వవచ్చు. ఇవి అందుబాటులో లేకపోతే, అల్పాహారంలో ఇడ్లీ, దోశ, ఉప్మా, పోహా వంటివి ఇవ్వవచ్చు. వీటిలో సరైన మోతాదులో పోషకాలు ఉంటాయి. ఇవి రుచికరంగా ఉంటాయి కాబట్టి పిల్లలు సంతోషంగా తింటారు. ఓట్స్ లేదా సజ్జ పిండిని కూడా ఇవ్వవచ్చు. అయినప్పటికీ, ఉదయం పాలు ఇవ్వాలనుకుంటే, ఏదైనా తినిపించిన తర్వాతే ఇవ్వాలి. ఉదయం కాకపోతే, సాయంత్రం స్నాక్స్ సమయంలో ఇవ్వవచ్చు. కానీ ఖాళీ కడుపుతో మాత్రం అస్సలు ఇవ్వకూడదు.

పాలను మొదట ఎవరు కనుగొన్నారు?

పాలు క్రమం తప్పకుండా తాగిన మొదటి వ్యక్తులు పశ్చిమ ఐరోపాలో తొలి రైతులు మరియు పశువుల కాపరులు – పశువులను పెంచే వ్యక్తులు – ఆవులు సహా పెంపుడు జంతువులతో నివసించిన మొదటి మానవులలో కొందరు. మధ్యప్రాచ్యంతో పాటు ఆఫ్రికా మరియు ఆసియాలో మరిన్ని పురావస్తు ఆధారాలు కనుగొనబడ్డాయి.

పాలు నిజంగా ఎంతకాలం ఉంటాయి?

పాలు గడువు ముగుస్తాయి. పాల కార్టన్‌పై ఉన్న తేదీ, అది “అమ్మకం ద్వారా,” “వాడుక ద్వారా,” లేదా “ఉపయోగం ద్వారా” తేదీ అయినా, తయారీదారు ఇకపై పాల గరిష్ట నాణ్యత మరియు తాజాదనాన్ని హామీ ఇవ్వని బిందువును సూచిస్తుంది. ఈ తేదీ దాటి కొన్ని రోజులు పాలు తీసుకోవడం సాధారణంగా సురక్షితం అయినప్పటికీ, దానిని తినే ముందు చెడిపోయే సంకేతాలను తనిఖీ చేయడం ఉత్తమం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Buttermilk: మజ్జిగలో అల్లం కలిపి తాగితే కలిగే అద్భుత ఆరోగ్య

Best Time to Drink Milk Breaking News Child Nutrition healthy habits Kids Health latest news Milk for Kids Parenting Tips Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.