📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Makhana :మధుమేహం ఉన్నవారు మఖానా తింటే ఏమవుతుందో తెలుసా..

Author Icon By Sudha
Updated: July 28, 2025 • 4:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మధుమేహం (Diabetes) అనేది పూర్తిగా నయమయ్యే వ్యాధి కాదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచడం ద్వారా దీన్ని ఆరోగ్యంగా నియంత్రించవచ్చు. ఈ పరిస్థితిలో ఉండే వ్యక్తులు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అధిక చక్కెర, కర్బోహైడ్రేట్లు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తుంటారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవనశైలి కారణంగా నేడు పిల్లల నుంచి పెద్దల దాకా ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. అయితే, ఈ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది తినకూడదని నిపుణులు పదే పదే చెబుతుంటారు.

Makhana :మధుమేహం ఉన్నవారు మఖానా తింటే ఏమవుతుందో తెలుసా..

మఖానా (Makhana)తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచవు. మఖానాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహానికి మంచివిగా పరిగణించబడతాయి. మఖానా (Makhana)లో యాంటీ డయాబెటిక్ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని మెరుగుపరచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతూ, తగ్గుతూ ఉంటే, మీరు తప్పనిసరిగా మీ ఆహారంలో మఖానాను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి లైట్ స్నాక్‌గా కూడా మఖానా (Makhana)ను తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, వీటిని నూనెలో వేయించకుండా పొడి వేపడం మంచిది. ఉప్పు లేకుండా తీసుకోవడం ఉత్తమం అంటున్నారు. అలాగే, రోజుకు కొద్దిగా మాత్రమే తినాలని చెబుతున్నారు. డాక్టర్ సలహాతో మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తం మీద మఖానా మధుమేహులకు సరైన ఆహారంగా చెప్పొచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

మఖానకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది?

మధుబని – మఖానా మాతృభూమి నేడు, అనేక ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాహారం, బరువు తగ్గడంలో సహాయపడటం మరియు వంటలో వాడటానికి ప్రసిద్ధి చెందిన మఖానా ఉనికి 200 సంవత్సరాల క్రితం నాటిది. మఖానా సాగు మూలం బీహార్‌లోని ప్రసిద్ధ మిథిలాంచల్ ప్రాంతమైన మధుబనిలో జరిగింది.

మఖానా ఏ దేశానికి చెందినది?

మఖానా మొక్క ఆగ్నేయాసియా మరియు చైనాకు చెందినదిగా పరిగణించబడుతుంది. భారతదేశంలోని బీహార్ భారతదేశంలోని మఖానా ఉత్పత్తిలో ~90% వాటాను కలిగి ఉన్న ప్రముఖ రాష్ట్రం. ఇతర రాష్ట్రాలు: పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, అస్సాం, జమ్మూ & కాశ్మీర్, ఒడిశా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ & ఉత్తరప్రదేశ్ కానీ వాణిజ్యపరంగా కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఉత్పత్తి చేయబడుతుంది.

మఖనాన్ని బ్లాక్ డైమండ్ అని ఎందుకు పిలుస్తారు?

మఖానా, గోర్గాన్ గింజ లేదా ఫాక్స్ గింజ అని కూడా పిలుస్తారు, ఇది ప్రిక్లీ వాటర్ లిల్లీ (యూరియాల్ ఫెరాక్స్) యొక్క ఎండిన తినదగిన విత్తనం. దాని చిన్న, గుండ్రని నలుపు/గోధుమ విత్తనాల కారణంగా ‘నల్ల వజ్రం’ అని పిలుస్తారు, ఇవి ప్రాసెస్ చేసినప్పుడు తెల్లగా మారుతాయి .

Read hindi news: hindi.vaartha.com

Read Also: Banana: అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Blood Sugar Control Breaking News Diabetes diabetic diet Healthy Snacks latest news low glycemic foods Makhana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.