📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటున్నారా.. ఐతే ఇది మీ కోసమే..

Author Icon By Sudha
Updated: July 24, 2025 • 5:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వర్షాకాలం అంటే చల్లని వాతావరణం, తడిసిన నేలలు, మట్టి వాసన – ఇవన్నీ మనలో ఉత్సాహం కలిగించడమే కాదు, కొందరికి ఐస్‌క్రీం తినాలనే కోరికను మరింత పెంచుతాయి. కానీ, ఈ సీజన్‌లో ఐస్‌క్రీం
(Ice Cream) తినడం వల్ల శరీరానికి కొన్ని దుష్ప్రభావాలు రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్‌ క్రీం (Ice Cream) అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు తినడానికి ఇష్టపడతారు. కానీ వర్షాకాలంలో తింటేనే కదా త్రిల్ అని అనుకుంటారేమో.. ఇలా చల్లటి వర్షాకాలంలో ఐస్‌ క్రీం (IceCream) తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు తెలిస్తే షాక్‌ అవుతారు. వర్షాకాలంలో వాతావరణంలో మార్పుల కారణంగా వేడి వేడి ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనికి విరుద్ధంగా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, వర్షాకాలం, చలికాలంలో ఐస్ క్రీం వంటి ఆహారాలు తినడం వల్ల జలుబు, దగ్గు, ఛాతీ బిగుతుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లకు (infections)కూడా కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు.

Ice Cream : వర్షాకాలంలో ఐస్ క్రీమ్ తింటున్నారా.. ఐతే ఇది మీ కోసమే..

మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం

ఐస్ క్రీంలో చక్కెర, కేలరీలు, అనవసరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని అంటున్నారు. శీతాకాలం, వర్షాకాలంలో ఐస్‌ క్రీం తినడం వల్ల శరీరంలో ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని చెప్పారు.. ఇది డయాబెటిస్‌కు కూడా దారితీస్తుందని అంటున్నారు. అలాగే వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. గొంతు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అంతే కాదు, వర్షాకాలంలో ఐస్ క్రీం తినడం వల్ల మెదడులోని నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తలనొప్పి, దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ఐస్ క్రీం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల ఊబకాయం కూడా వస్తుంది. కాబట్టి, ఐస్‌ క్రీం అంటే మీకు ఎంత ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో ఐస్ క్రీం తినకపోవడమే మంచిదని చెబుతున్నారు .

ఐస్ క్రీం తినడానికి ఉత్తమ వాతావరణం ఏది?

శీతాకాలంలో, మీ ఐస్ క్రీం వేసవిలో కంటే ఎక్కువసేపు ఉంటుంది. అంటే మీరు ప్రతి చెంచా త్వరగా కరిగిపోతుందనే చింత లేకుండా మీ సమయాన్ని వెచ్చించి ఆస్వాదించవచ్చు. మీకు ఇష్టమైన ఐస్ క్రీం ఒక స్కూప్ (లేదా రెండు!) ఆస్వాదించడానికి శీతాకాలం సరైన సమయం.

భారతదేశంలో మొదటి ఐస్ క్రీమ్ తయారు చేసింది ఎవరు?

16వ శతాబ్దంలో, మొఘల్ సామ్రాజ్యం హిందూ కుష్ నుండి దాని రాజధాని ఢిల్లీకి మంచును తీసుకురావడానికి గుర్రపు సైనికుల రిలేలను ఉపయోగించింది, భారత ఉపఖండం నుండి ప్రసిద్ధ ఘనీభవించిన పాల డెజర్ట్ అయిన కుల్ఫీని తయారు చేయడానికి దీనిని ఉపయోగించారు, దీనిని తరచుగా సాంప్రదాయ భారతీయ ఐస్ క్రీం అని పిలుస్తారు.

ఐస్ క్రీమ్ ను కనుగొన్న మొదటి మహిళ ఎవరు?

యూరోపియన్లు చెప్పిన దానికంటే మించి, కొంతమంది అమెరికన్లు ఐస్ క్రీంను మొదట మార్తా వాషింగ్టన్ తయారు చేసిందని, లేదా ఫ్రాన్స్ నుండి థామస్ జెఫెర్సన్ ఈ దేశానికి తీసుకువచ్చారని, లేదా వైట్ హౌస్‌లో ఫస్ట్ లేడీ డోలీ మాడిసన్ కనిపెట్టారని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Milk: పిల్లలు పాలు తాగే సరైన సమయం తెలుసా?

Breaking News cold and cough health tips ice cream immunity Monsoon Health Seasonal Illness

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.