వెజ్ బుర్జీ (Veg Burji ) అనేది రుచికరమైన, ఆరోగ్యకరమైన (Healthy)తక్కువ సమయంలో తయారయ్యే ఆహార వంటకం. వెజ్ బుర్జీ (Veg Burji )ముఖ్యంగా కూరగాయలతో (vegetables) తయారవుతుంది. అండాల బుర్జీకి మంచి ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు. వెజ్ బుర్జీని (Veg Burji ) బ్రేక్‌ఫాస్ట్, లంచ్, లేదా స్నాక్ టైమ్‌కి సరిగా సరిపోతుంది.
కావలసిన పదార్దాలు
శనగపిండి: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి, టమాటా: రెండు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: అర టీస్పూన్, గరం మసాలా: అర టీస్పూన్, మిరియాల పొడి: పావు టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, ధనియాల పొడి: ఒక టీస్పూన్, సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి: అర టీస్పూన్, పసుపు: అర టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: అర కప్పు, ఉప్పు: తగినంత, వంటసోడా: చిటికెడు, నిమ్మరసం: రెండు టీస్పూన్లు.
తయారీ విధానం
ఒక గిన్నెలో శనగపిండి, కొద్దిగా ఉప్పు, వంటసోడా వేసి నీళ్లుపోసి కొంచెం జారుగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి నూనెలో దోరగా వేయించాలి. బాగా వేగాక.. చిన్నగా తరిగిన టమాటా ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలిపి మూతపెట్టి సన్నని మంటపై అయిదు నిమిషాలు మగ్గించాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని అందులో వేసి, కదపకుండా మూతపెట్టి సన్నని మంటపై పది నిమిషాలు ఉడికించాలి. గరిటెతో కదుపుతూ ముక్కలు ముక్కలుగా చేస్తూ బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర తురుము, నిమ్మరసం వేసుకుంటే నోరూరించే వెజ్ బుర్జీ సిద్ధం.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిరుతిండి ఏది?
ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడిన జాతీయ చిరుతిండి ఒకటి లేనప్పటికీ, సమోసాలు భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విస్తృతంగా ఆస్వాదించబడే చిరుతిండి. అవి రుచికరమైన ఫిల్లింగ్‌తో కూడిన క్రిస్పీ, వేయించిన లేదా కాల్చిన పేస్ట్రీ, సాధారణంగా బంగాళాదుంపలు మరియు బఠానీలు, మరియు సాధారణంగా చట్నీతో వడ్డిస్తారు.
భారతదేశపు చిరుతిండి రాజధాని ఏది?
గుజరాత్- భారతదేశపు చిరుతిండి రాజధాని, ఇక్కడ ప్రతి మూల రుచికరమైన ఫర్సాన్ నిధి! క్రిస్పీ ధోక్లాస్, ఫాఫ్డాస్ మరియు ఖాండ్వీ నుండి రుచికరమైన తెప్లా మరియు ఘుఘ్రా వరకు, ఈ రాష్ట్రం అద్భుతమైన వివిధ రకాల చిరుతిళ్లను అందిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sweet potato fritters: చిలగడదుంప బజ్జీలు ఎలా తాయారు