📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest Telugu news : Toothache – పంటి నొప్పికి వంటింటి చిట్కాలు..

Author Icon By Sudha
Updated: August 26, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పంటి నొప్పి చాలా భయంకరమైన బాధ. ఇది మన రోజువారీ పనులకు అడ్డుపడుతుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది, నిద్రపట్టదు, ఆహారం సరిగ్గా తీసుకోలేము. పంటి నొప్పి(Toothache) ఒక్కోసారి కొన్ని గంటలపాటు లేదా రోజులపాటు ఉంటుంది. దంతాల సమస్యల వల్ల వచ్చే పంటి నొప్పి (Toothache)నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు (Home Tips)చాలా ఉపయోగపడతాయి.పంటి నొప్పి చిన్నదైనా, పెద్దదైనా భరించలేని బాధ. ఇది దంతాల సమస్యల వల్ల వస్తుంది. అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైతే, డాక్టర్ దగ్గరికి వెళ్లడానికి సమయం పట్టవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని సహజ చిట్కాలు బాగా పనిచేస్తాయి.

Toothache – పంటి నొప్పికి వంటింటి చిట్కాలు..

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించండి. ఇది నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. దీనివల్ల పంటి నొప్పి (Toothache)నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. అలాగే లవంగం నూనెలో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. దీనికి నొప్పిని తగ్గించే గుణం ఉంది. ఒక దూది ఉండను లవంగం నూనెలో ముంచి నొప్పి ఉన్న పంటిపై ఉంచండి. కొన్ని నిమిషాల్లో నొప్పి మాయమవుతుంది.వెల్లుల్లిలో యాంటీబయాటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బను మెత్తగా నలిపి, నొప్పి ఉన్న పంటి మీద ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నిరోధిస్తుంది. వాపు, నొప్పి ఉంటే ఐస్ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. కొన్ని ఐస్ ముక్కలను ఒక గుడ్డలో చుట్టి, నొప్పి ఉన్న చోట బుగ్గపై ఉంచండి. ఇది వాపును తగ్గించి, నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇవి కేవలం చిన్న పాటి హోమ్ రెమిడీస్ మాత్రమే. పంటి నొప్పి తరచుగా వస్తూ భరించలేనంత నొప్పి కలుగుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మేలు.

పంటి నొప్పి వస్తే ఏ స్థితిలో నిద్రించాలి?

తల పైకెత్తి పడుకోవడం ఉత్తమ పరిష్కారం. ఇది రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది మరియు నరాల నుండి ఒత్తిడిని తగ్గిస్తుంది. పంటి నొప్పితో నిద్రపోతున్నప్పుడు ఎక్కువ ఉపశమనం కోసం ఈ భంగిమను కోల్డ్ కంప్రెస్ మరియు మందులతో జత చేయండి.

పంటి నొప్పికి అమోక్సిసిలిన్ ఉపయోగం?

అమోక్సిసిలిన్ మీ దంతాల ఇన్ఫెక్షన్‌కు సహాయపడుతుంది . దంతాల ఇన్ఫెక్షన్ చికిత్సకు సిఫార్సు చేయబడిన మొదటి యాంటీబయాటిక్‌లలో అమోక్సిసిలిన్ ఒకటి. ఇది విస్తృతంగా ప్రభావవంతంగా ఉంటుందని మరియు ఇతర ఎంపికలతో పోలిస్తే తక్కువ జీర్ణశయాంతర దుష్ప్రభావాలను కలిగి ఉందని నిరూపించబడింది.

పంటి నొప్పికి 3-3-3 నియమం ఏమిటి?

పంటి నొప్పికి 3-3-3 నియమం అనేది వాపును తగ్గించడానికి ఇబుప్రోఫెన్ (అడ్విల్ లేదా ఇలాంటిది) ఉపయోగించడం ద్వారా నొప్పిని నిర్వహించడానికి ఒక స్వల్పకాలిక పద్ధతి, ఇది దంత నొప్పికి ప్రధాన కారణం. ఇందులో 3 మాత్రలు ఇబుప్రోఫెన్ (మొత్తం 600 mg, సాధారణంగా మూడు 200mg మాత్రలు) రోజుకు మూడు సార్లు మూడు రోజులు తీసుకోవడం జరుగుతుంది. వాపు మరియు నొప్పిని ఎదుర్కోవడానికి మీ వ్యవస్థలో మందుల స్థిరమైన స్థాయిని నిర్వహించడం లక్ష్యం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/finger-millet-health-benefits-ragi/more/cheli/535969/

Breaking News dental pain relief home remedies latest news Oral Health Telugu News tooth pain toothache

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.