శారీరక శ్రమ లేని జీవన శైలి, అధికంగా ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడంతో చాలా మందిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తుతోంది. ఇది మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తోంది.ఇటీవలి కాలంలో పెరుగుతున్న అధిక కొలెస్ట్రాల్ బాధితులు, అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో చర్మంపై కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని గుర్తించి ముందే జాగ్రత్తపడితే అధిక కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవచ్చని, గుండె జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని స్పష్టం చేస్తున్నారు. అనేక ఆరోగ్య సమస్యలకి మూల కారణం కొవ్వు. ఈ కొవ్వు కారణంగానే గుండె జబ్బులు, బీపీ, షుగర్స్ ఇంకా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ కూడా తమకు తాముగా తమ శరీరాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలిన కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే ఏ సమస్య అయినా రావడానికి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం, మొదట్లోని గుర్తించడం వల్ల దానికి పరిష్కారం ఈజీగా తీసుకోవచ్చు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం, ఇయర్లీ హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని చెబుతున్నారు.
కాళ్లపై చర్మం రంగు మారడం
కాళ్ల దిగువ భాగంలో చర్మం పాలిపోయి, మెరుస్తూ లేదా ఎరుపు మచ్చల్లా కనిపించడం.
చర్మంపై పసుపు/నారింజ రంగు బొడిపెలు
మోచేతులు, మోకాళ్లు, చేతులు, ఇతర భాగాల్లో చిన్న చర్మ గడ్డలు కనిపించడం.
కనురెప్పలు, కళ్ల దిగువ పసుపు చారలు
కనురెప్పల చుట్టూ, కళ్ల దిగువ భాగంలో లేత పసుపు రంగు గీతలు ఏర్పడటం (జ్సాంతెలెస్మా).
చర్మంపై జిగురు, మెత్తగా ఉండే భాగాలు
వీపు, నడుము కింద భాగాల్లో మెత్తగా, జిగురుగా ఉండే చర్మ పొరలు ఏర్పడడం.
కంటి పాప చుట్టూ తెలుపు/బూడిద రంగు వలయం
కనుపాప చుట్టూ తెలుపు, బూడిద, లేత నీలం రంగు వలయం ఏర్పడటం.
గాయాలు మానడంలో ఆలస్యం
గాయాలు నెమ్మదిగా మానిపోవడం, ముఖ్యంగా చేతులు, కాళ్లపై.
నలుపు రంగు ప్యాచ్‌లు
మెడ, బాహుమూలాలు, జననాంగాల చుట్టూ నలుపు రంగు మందమైన ప్యాచ్‌లు కనిపించడం.
జాగ్రత్తలు:
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, కొలెస్ట్రాల్ స్థాయులు పరీక్షించుకోవాలి.
ఆహారంలో నూనెలు, కొవ్వు పదార్థాలు తగ్గించి, వ్యాయామం అలవర్చుకోవడం అవసరం.
వైద్యుల సూచనల మేరకు మందులు వాడి, జీవనశైలిని మార్చుకోవాలి.
కొంతమంది వ్యక్తుల్లో పెరిగిన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. తినే ఆహారంలోనూ సాల్మన్ వంటి చేపలు, బ్రౌన్ రైస్, ఫైబర్ ఫుడ్ తినాలి. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు తీసుకోవాలి.