📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Unripe Tamarind : చింత పండు క‌న్నా చింత కాయ‌ల‌తో ఎన్నో ప్రయోజనాలు..

Author Icon By Sudha
Updated: August 4, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చింత పండను మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటాం. ప‌ప్పు, చారు, సాంబార్ వంటి వంట‌ల‌తోపాటు పులిహోర‌, పుల‌సు వంటి వంట‌ల్లోనూ చింత పండును వేస్తుంటారు. చింత పండు క‌న్నా చింత కాయ‌ల్లోనే అధిక ఔష‌ధ గుణాలు (Medicinal properties)ఉంటాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు చింత‌కాయ‌ (Unripe Tamarind)ల్లో ఉంటాయి. చింత‌పండు క‌న్నా చింత‌కాయ‌ల‌ (Unripe Tamarind)ను ఉప‌యోగిస్తేనే ఎక్కువ మేలు జ‌రుగుతుంద‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. చింత కాయ‌ల‌ (Unripe Tamarind)ను నేరుగా తిన‌లేరు. కానీ వీటిని వంటల్లో ఉప‌యోగించ‌వ‌చ్చు. వీటితో ప‌చ్చ‌డి, సూప్. కూర‌లు, పులిహోర వంటివి చేసి తిన‌వ‌చ్చు. దీంతో పలు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Unripe Tamarind : చింత పండు క‌న్నా చింత కాయ‌ల‌తో ఎన్నో ప్రయోజనాలు..

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం

చింత‌పండులో క‌న్నా చింత‌కాయ‌ల్లోనే విట‌మిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. అందువ‌ల్ల చింత పండు కాస్త తియ్య‌గా ఉన్న‌ట్లు అనిపిస్తుంది. కానీ కాయ మాత్రం చాలా పుల్ల‌గా ఉంటుంది. అందుకు అందులో ఉండే విట‌మిన్ సి నే కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. విట‌మిన్ సి శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తుంది. క‌ణాలకు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్తం త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. మ‌హిళ‌ల‌కు చింత‌కాయ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. అందుక‌నే గ‌ర్భంతో ఉన్న మ‌హిళ‌ల‌ను చింత‌కాయ‌లు తినాల‌ని చెబుతుంటారు. వారికి కూడా ఆ స‌మ‌యంలో పుల్ల‌గా ఏమైనా తినాల‌ని అనిపిస్తుంది. అందువ‌ల్ల ఆ స‌మ‌యంలో చింత‌కాయ‌ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది.

అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు

చింత‌కాయ‌ల‌ను తింటే ఫైబ‌ర్ అధికంగా ల‌భిస్తుంది. చింత పండులో ఇది త‌క్కువగా ఉంటుంది. చింత‌కాయ‌ల‌ను తింటే పేగుల్లో మ‌లం సుల‌భంగా క‌దులుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గిపోతుంది. చింత‌కాయ‌ల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇవి గ్యాస్, పొట్ట ఉబ్బ‌రాన్ని త‌గ్గిస్తాయి. చింత‌కాయ‌లు స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్‌గా కూడా ప‌నిచేస్తాయి. ఎంత‌టి తీవ్ర మ‌ల‌బ‌ద్ద‌కాన్ని అయినా స‌రే త‌గ్గిస్తాయి. ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. చింత‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చింత పండు క‌న్నా ఆకుప‌చ్చ రంగులో ఉండే కాయ‌ల్లోనే అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాయ పండుగా మారే కొద్దీ అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల శాతం త‌గ్గుతుంది. చింత‌కాయ‌ల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గేలా చేస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Unripe Tamarind : చింత పండు క‌న్నా చింత కాయ‌ల‌తో ఎన్నో ప్రయోజనాలు..

ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గిపోతాయి

చింత‌కాయ‌ల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరంలోని వాపుల‌ను త‌గ్గిస్తాయి. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. చింత‌కాయ‌ల్లో ఉండే స‌మ్మేళ‌నాలు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. ఈ కాయ‌ల్లో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు షుగ‌ర్‌ను నియంత్రిస్తాయి. అందువ‌ల్ల డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. ఈ కాయ‌ల్లో యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల వీటిని తింటే ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గిపోతాయి. చింత‌కాయ‌ల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివ‌ర్‌ను సంర‌క్షిస్తాయి. ఈ కాయ‌ల్లో ప్రొ స‌య‌నైడిన్స్ అధికంగా ఉంటాయి. ఇవి లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపి లివ‌ర్‌ను క్లీన్ చేస్తాయి. దీంతో లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఇలా చింత‌కాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే కొంద‌రికి ఈ కాయ‌ల‌ను తింటే గ్యాస్ స‌మ‌స్య రావ‌చ్చు. అలాంటి వారు చింతకాయ‌ల‌కు దూరంగా ఉండాలి.

పచ్చి చింతపండు తినడం వల్ల కలిగే నష్టాలు?

చింతపండు కొంతమందిలో గ్యాస్ లేదా ఉబ్బరం కలిగించవచ్చు, ఎందుకంటే ఇందులో కొన్ని సహజ చక్కెరలు మరియు ఫైబర్ ఉంటాయి, ఇవి జీర్ణవ్యవస్థలో కిణ్వ ప్రక్రియకు దారితీస్తాయి, ఇది గ్యాస్ ఉత్పత్తికి దారితీస్తుంది. మీరు ఈ ప్రభావాలకు సున్నితంగా ఉంటే, చింతపండును మితంగా తీసుకోవడం మంచిది.

చింతపండు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉందా?

వాణిజ్యపరంగా బాగా ప్రాచుర్యం పొందిన ఔషధ మొక్కలలో ఒకటైన టామరిండస్ ఇండికా; దాని శక్తివంతమైన శోథ నిరోధక చర్యలకు ప్రసిద్ధి చెందింది సాంప్రదాయ వైద్యంలో మంట, కడుపు నొప్పి, గొంతు నొప్పి మరియు రుమాటిజం చికిత్సకు ఉపయోగిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Custard apple: సీతాఫలం తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన

Breaking News e Tamarind health tips Indian Herbs latest news natural remedies Tamarind Benefits Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.