📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest Telugu news : Fruit Salad – రోజూ ఫ్రూట్ స‌లాడ్‌ తింటే చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు..!

Author Icon By Sudha
Updated: August 26, 2025 • 4:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌ల‌గాలంటే పండ్ల‌ను తినాల‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది త‌మ‌కు ఇష్ట‌మైన లేదా అందుబాటులో ఉన్న పండ్ల‌ను తింటుంటారు. అయితే ఒకే ర‌కానికి చెందిన పండ్ల‌ను ఎక్కువ మోతాదులో తిన‌డం క‌న్నా అన్ని ర‌కాల పండ్ల‌ను కొద్ది మోతాదులో తిన‌డం ఎంతో మేల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. అన్ని ర‌కాల పండ్ల‌ను కొద్ది మోతాదులో రోజూ తింటుంటే ఒకేసారి అధిక మొత్తంలో వివిధ ర‌కాల పోష‌కాల‌ను (Nutrients) పొంద‌వ‌చ్చు. దీంతో ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అన్ని ర‌కాల పండ్ల‌ను ఒకేసారి తిన‌డం అంటే దాన్నే ఫ్రూట్ స‌లాడ్ (Fruit Salad )అని కూడా అంటారు. అయితే ఫ్రూట్ స‌లాడ్ అంటే కేవ‌లం పండ్ల‌ను మాత్ర‌మే చిన్న ముక్క‌లుగా చేసి అన్నింటినీ క‌లిపి తినాలి. అందులో ఎలాంటి బేక‌రీ ప‌దార్థాల‌ను క‌ల‌ప‌కూడ‌దు. ఇక ఫ్రూట్ స‌లాడ్‌ను (Fruit Salad )రోజూ ఒక క‌ప్పు తింటే చాలు, ఎన్నో లాభాలు క‌లుగుతాయి.

Fruit Salad – రోజూ ఫ్రూట్ స‌లాడ్‌ తింటే చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు..!

రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ ప‌టిష్టం

ఫ్రూట్ స‌లాడ్‌(Fruit Salad )లో భిన్న ర‌కాల పండ్లు ఉంటాయి క‌న‌క మ‌న‌కు దాదాపుగా అన్ని ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. అన్ని ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్ల‌ను పొంద‌వ‌చ్చు. ఫ్రూట్ స‌లాడ్‌లో సిట్ర‌స్ ఫ‌లాలు, స్ట్రాబెర్రీలు, కివీలు, నారింజ‌, బొప్పాయి వంటి పండ్ల‌ను క‌లుపుతారు. క‌నుక మ‌న‌కు విట‌మిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ల‌భిస్తాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తాయి. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. మనం తిన్న ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తాయి. దీంతో ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. చిన్నారులు, మ‌హిళ‌లు పండ్ల‌ను ఫ్రూట్ స‌లాడ్‌గా చేసి తింటుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. ఫ్రూట్ స‌లాడ్‌లో మామిడి పండ్లు, త‌ర్బూజా వంటి పండ్ల‌ను కూడా క‌లుపుతారు. వీటిల్లో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల ఫ్రూట్ స‌లాడ్‌ను తింటే ఆ బీటాకెరోటిన్ మ‌న శ‌రీరంలో విట‌మిన్ ఎ గా మారుతుంది. ఇది కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి

ఫ్రూట్ స‌లాడ్‌లో అర‌టి పండ్లు, నారింజ‌, త‌ర్బూజా ఉంటాయి క‌నుక ఫ్రూట్ స‌లాడ్‌ను తింటే అధిక మొత్తంలో పొటాషియం ల‌భిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. హైబీపీ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఫ్రూట్ స‌లాడ్‌లో ఉండే వివిధ ర‌కాల పండ్ల కార‌ణంగా అధిక మొత్తంలో మ‌న‌కు యాంటీ ఆక్సిడెంట్లు ల‌భిస్తాయి. ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీని వ‌ల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. శ‌రీరంలో అంత‌ర్గతంగా ఉండే వాపులు త‌గ్గుతాయి. గుండె పోటు, డ‌యాబెటిస్‌, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

Fruit Salad – రోజూ ఫ్రూట్ స‌లాడ్‌ తింటే చెప్ప‌లేన‌న్ని ప్ర‌యోజ‌నాలు..!

ఆక‌లి వేయ‌దు

ఫ్రూట్ స‌లాడ్‌లో ఉండే పండ్ల‌లో ఫైబ‌ర్ కూడా అధికంగానే ఉంటుంది. అన్ని ర‌కాల పండ్లు ఉంటాయి క‌నుక వాటిల్లో ఉండే ఫైబ‌ర్ మొత్తం క‌లిపి ఎక్కువ శాతం ఫైబ‌ర్ మ‌న‌కు ల‌భిస్తుంది. ఫైబ‌ర్ వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. ఫైబ‌ర్ ఉన్న కార‌ణంగా ఫ్రూట్ స‌లాడ్‌ను తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. ఫ్రూట్ స‌లాడ్‌ను ఉద‌యం తింటే రోజంతా శరీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణలో ఉంటుంది. ఇలా ఫ్రూట్ స‌లాడ్‌ను రోజూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాలను పొంద‌వ‌చ్చు.

ఫ్రూట్ సలాడ్ చరిత్ర ఏమిటి?

ఫ్రూట్ సలాడ్ అనే భావన బహుశా US నావికాదళ యుగంలో, బహుశా 1900ల ప్రారంభంలో ప్రవేశపెట్టబడి ఉండవచ్చు. పురాతన చామోరస్లు మామిడి, బొప్పాయి, చిన్న కొబ్బరి (మాంహా), అరటిపండ్లు మరియు ఇతర స్థానిక పండ్లను తిన్నప్పటికీ, వివిధ రకాల పండ్లను తీపి సాస్‌తో కలపడం స్పష్టంగా పాశ్చాత్యమైనది.

ఫ్రూట్ సలాడ్ ఏ రకమైన మిశ్రమం?

ఫ్రూట్ సలాడ్ అనేది ఒక వైవిధ్యమైన మిశ్రమం ఎందుకంటే ఇది ఒకేలా కలపని వివిధ రకాల పండ్లతో కూడి ఉంటుంది. మీరు స్ట్రాబెర్రీలు, అరటిపండ్లు మరియు ద్రాక్ష వంటి వ్యక్తిగత భాగాలను చూడవచ్చు మరియు ఎంచుకోవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-smoking-tea-health-risks-organs/health/536445/

Breaking News daily diet fruit salad fruits healthy eating latest news nutrition Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.