దాల్చిన చెక్క ఆహారానికి రుచితోపాటు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అంతేకాదు.. అందాన్ని కాపాడటంలోనూ ముందుంటుంది. దాల్చిన చెక్క(Cinnamon)ని యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి మైక్రోబయల్ లక్షణాలు.. మొటిమలు, ఇతర చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించడం (Reducing infections)లో ముందుంటాయి. ఇందులోని పాలీఫెనాల్స్, యూజినాల్.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి.. కణాల నష్టాన్ని, వృద్ధాప్య ఛాయల్ని నివారిస్తాయి.దాల్చిన చెక్క (Cinnamon)లోని యాంటి ఆక్సిడెంట్లు.. స్కిన్ టోన్‌ను మెరుగుపరుస్తాయి. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి(Cinnamon)లో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయి చేయాలి. 15-20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దాల్చిన చెక్కలో పుష్కలం. ఇవి మొటిమలను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి. ఇందుకోసం ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయి చేసి.. 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
పెదాలకు రక్త ప్రవాహం పెంచడంలో చెక్క సాయపడుతుంది. దాంతో పెదాలు ఆరోగ్యంగా ఉండి, మరింత అందంగా కనిపిస్తాయి. టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి.. బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లయి చేసి, కొన్ని నిమిషాల తర్వాత కడిగేయాలి. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ దాల్చినచెక్క సాయపడుతుంది. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.. సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత.. తక్కువ గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. దాంతో జుట్టు కుదుళ్లకు రక్త సరఫరా బాగా జరిగి.. జుట్టు రాలడం తగ్గుతుంది.
దాల్చిన చెక్కకు ప్రసిద్ధి చెందిన దేశం ఏది?
శ్రీలంక దాని ప్రీమియం సిలోన్ దాల్చిన చెక్క (సిన్నమోమమ్ వెరం) కు ప్రసిద్ధి చెందింది, దీనిని “నిజమైన దాల్చిన చెక్క” అని కూడా పిలుస్తారు. దాని తీపి, సున్నితమైన రుచికి ప్రసిద్ధి చెందిన సిలోన్ దాల్చిన చెక్కను ఎక్కువగా దక్షిణ ప్రావిన్స్‌లో పండిస్తారు మరియు తరచుగా ఆరోగ్య సప్లిమెంట్లు మరియు గౌర్మెట్ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.
తీపి దాల్చినచెక్క మరియు దాల్చినచెక్క మధ్య తేడా ఏమిటి?
సాధారణంగా సూపర్ మార్కెట్లలో కనిపించే కాసియా దాల్చిన చెక్క, బలమైన మరియు కొద్దిగా కారంగా ఉండే రుచిని కలిగి ఉంటుంది, తరచుగా క్లాసిక్ దాల్చిన చెక్క రుచితో ముడిపడి ఉంటుంది. “నిజమైన” లేదా “తీపి” దాల్చిన చెక్క అని పిలువబడే సిలోన్ దాల్చిన చెక్క, మరింత సున్నితమైన మరియు సిట్రస్ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది , ఇది డెజర్ట్‌లు మరియు సున్నితమైన వంటకాలకు బాగా ఉపయోగపడుతుంది.
అత్యంత ఖరీదైన దాల్చినచెక్క ఏది?
సిలోన్ దాల్చిన చెక్కకు శ్రీలంక అనే పాత బ్రిటిష్ పేరు పెట్టారు మరియు దీనిని తరచుగా “నిజమైన” దాల్చిన చెక్కగా పరిగణిస్తారు. దీనిని సిన్నమోమమ్ వెరం అనే చెట్టు యొక్క ఎండిన లోపలి బెరడు నుండి తయారు చేస్తారు. ఈ చెట్లను పెంచడం పెట్టుబడి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: