📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Ginger Tea : వ‌ర్షాకాలంలో అల్లం టీతో ఎన్నో ప్రయోజనాలు..

Author Icon By Sudha
Updated: August 6, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వ‌ర్షాకాలం కార‌ణంగా చాలా మంది శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతున్నారు. ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ‌, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు చాలా మందికి వ‌స్తున్నాయి. అయితే ఈ స‌మ‌స్య‌ల‌కు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఒక ప‌దార్థంతోనే వీటికి చెక్ పెట్ట‌వ‌చ్చు. అదే.. అల్లం. దీన్ని మ‌నం రోజూ వంట‌ల్లో వేస్తుంటాం. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం అల్లం ఎన్నో ఔష‌ధ గుణాల‌ను (Medicinal properties)క‌లిగి ఉంటుంది. ప‌లు ఔష‌ధాల త‌యారీలోనూ దీన్ని ఉప‌యోగిస్తారు. అల్లంతో టీ (Ginger Tea)త‌యారు చేసుకుని తాగితే ఈ సీజ‌న్‌లో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. ఒక పాత్ర‌లో త‌గినంత నీళ్ల‌ను తీసుకుని అందులో కొద్దిగా తురిమిన అల్లాన్ని వేసి 10 నిమిషాల పాటు మ‌రిగించాలి. త‌రువాత వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు అందులో కాస్త తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగేయాలి. ఇలా అల్లం టీని (Ginger Tea)రోజుకు 2 సార్లు ఉద‌యం. సాయంత్రం తాగితే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Ginger Tea : వ‌ర్షాకాలంలో అల్లం టీతో ఎన్నో ప్రయోజనాలు..

జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి

అల్లం టీని (Ginger Tea)తాగ‌డం వ‌ల్ల వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. ప్ర‌యాణంలో వాంతులు కాకుండా ఉండాల‌న్నా లేదా గ‌ర్భిణీలు వాంతుల‌ను ఆపాల‌న్నా అల్లం టీని తాగితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. క్యాన్స‌ర్ కోసం కీమో థెర‌పీ చేయించుకునేవారికి త‌ర‌చూ వికారంగా ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. వారు కూడా అల్లం టీని తాగ‌వ‌చ్చు. అల్లం టీని తాగ‌డం వ‌ల్ల వికారంకు కార‌ణం అయ్యే ర‌సాయనాల ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అల్లం టీని తాగితే జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. ఆహార నాళం, జీర్ణాశ‌యం, పేగుల్లో ఆహారం సుల‌భంగా క‌దులుతుంది. దీని వ‌ల్ల అజీర్తి ఉండ‌దు. క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్ త‌గ్గుతాయి. అల్లం టీని తాగితే జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.

నొప్పిని త‌గ్గించే గుణాలు

అల్లం టీని సేవిస్తుంటే అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు వాపులు, నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల ఆస్టియో ఆర్థ‌రైటిస్‌, రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్‌, కండ‌రాల నొప్పులు ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అల్లం టీలో నొప్పిని త‌గ్గించే గుణాలు ఉంటాయి. దీని వ‌ల్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశ‌మ‌నం ల‌భిస్తుంది. స్త్రీలు రుతు స‌మ‌యంలో ఈ టీని తాగితే నొప్పుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అధిక ర‌క్త‌స్రావం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు సైతం త‌గ్గిపోతాయి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండ‌డంతోపాటు యాంటీ మైక్రోబియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అల్లం టీని తాగితే సీజ‌న‌ల్ వ్యాధులు అయిన ద‌గ్గు, జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గొంతులో గ‌ర‌గ‌ర‌, గొంతు నొప్పి త‌గ్గిపోతాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గిపోతాయి. జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు.

Ginger Tea : వ‌ర్షాకాలంలో అల్లం టీతో ఎన్నో ప్రయోజనాలు..

షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి

అల్లం టీని క‌నీసం రోజుకు ఒక‌సారి తాగినా చాలు, శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ని, దీంతో బీపీ, కొలెస్ట్రాల్ నియంత్ర‌ణ‌లో ఉంటాయ‌ని, గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంద‌ని, గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చేసిన అధ్య‌య‌నాల్లో తేలింది. అల్లం టీని సేవిస్తుంటే షుగ‌ర్ ఉన్న‌వారికి కూడా మేలు జ‌రుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉప‌యోగించుకునేలా చేస్తాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. అల్లం టీని తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుపై ప‌డే ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. మెద‌డు వాపుల‌కు గురి కాకుండా ఉంటుంది. మ‌తిమ‌రుపు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఏకాగ్ర‌త, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి. ఇలా అల్లం టీని తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

అల్లం టీ అంటే ఏమిటి?

అల్లం టీ అనేది అల్లం వేరు నుండి తయారు చేయబడిన ఒక మూలికా పానీయం . తూర్పు ఆసియా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా మరియు పశ్చిమ ఆసియాలో సాంప్రదాయ మూలికా ఔషధంగా దీనికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

అల్లం టీ లో పొటాషియం ఎక్కువగా ఉందా?

అల్లం పొటాషియం, భాస్వరం లేదా సోడియం యొక్క అధిక మూలం కాదు . మీరు తక్కువ పొటాషియం ఆహారాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంటే, ఈ వ్యాసం ఉపయోగకరంగా ఉండవచ్చు. తాజా మరియు ఎండిన/చల్లని అల్లంను ఆహారంలో చేర్చవచ్చు. ఎండిన అల్లం అత్యంత యాంటీఆక్సిడెంట్ విలువను కలిగి ఉంటుంది.

అల్లం కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది?

రోజుకు 250 μg అల్లం సారం తీసుకోవడం వల్ల ప్లాస్మా ట్రైగ్లిజరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ (వరుసగా 27 మరియు 29%) తగ్గాయి (P < 0.01), VLDL (వరుసగా 36 మరియు 53%) మరియు LDL (వరుసగా 58 మరియు 33%) తగ్గాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Green coffee: గ్రీన్ టీ కంటే గ్రీన్ కాఫీ మేలు..ఎందుకంటే?

Breaking News ginger tea health benefits herbal tea Immunity Booster latest news rainy season Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.