📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Foods to Eat during Pregnancy: గర్భిణీలకు బీపీ కంట్రోల్ కి ఈ పోషకాలు?

Author Icon By Sharanya
Updated: March 25, 2025 • 2:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గర్భం ధరించినప్పుడు మహిళ తన ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనివార్యం. ముఖ్యంగా, ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఏ సీజన్‌లో ఏం తినాలి అనే దానిపై నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. గర్భిణులు తీసుకునే ఆహారంలో ముఖ్యంగా బి12, మాంగనీస్, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటే, మధ్య వయసులో బీపీ సమస్య తగ్గే అవకాశం ఉందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన పరిశోధనలు తెలియజేస్తున్నాయి.

గర్భిణుల ఆరోగ్యానికి మేలు చేసే ముఖ్యమైన ఖనిజాలు

కేవలం గర్భిణులే కాదు, ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, సెలీనియం వంటి ఖనిజాలను చేర్చుకోవడం అవసరం. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడేటివ్ గుణాలు కలిగి ఉండటంతో గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ అందిస్తాయి. ఈ పరిశోధనలో భాగంగా, 20 సంవత్సరాల క్రితం కొందరు గర్భిణుల రక్తంలో ఖనిజాల స్థాయిని అంచనా వేశారు. వారి ఆరోగ్యాన్ని 51 ఏళ్ల వయస్సు వచ్చాక పరిశీలించగా, గర్భిణుల సమయంలో మాంగనీస్, కాపర్ ఎక్కువగా తీసుకున్న వారికి బీపీ సమస్య 25% తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా, బి12 ఎక్కువగా తీసుకున్న మహిళల్లో లో బీపీ (Low BP) కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు. శరీరానికి అవసరమైన పోషకాలను సహజమైన ఆహార పదార్థాల ద్వారా పొందడం ఉత్తమం. నిపుణులు సూచించిన ఆహార జాబితా-బి12 సమృద్ధిగా లభించే ఆహారాలు – చేప, చికెన్, గుడ్డు, పాల ఉత్పత్తులు. కాపర్‌ అధికంగా ఉండే ఆహారాలు – ఆకుకూరలు, పిస్తా, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు. మాంగనీస్‌ను అధికంగా కలిగిన ఆహారాలు – పాలకూర, హేజల్ నట్స్, బ్రౌన్ రైస్, శనగలు, పైనాపిల్, ముడిగోధుమలు. గర్భిణుల ఆరోగ్యం మంచిగా ఉండటానికి ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, బి, సి విటమిన్లు, ప్రొటీన్ అవసరమని డాక్టర్ సూచిస్తున్నారు. వీటిని పొందేందుకు పండ్లు, కూరగాయలు, ముడిధాన్యాలు, పాల ఉత్పత్తులు, గింజలు, నట్స్, లీన్ ప్రోటీన్ వంటి ఆహారాలను సమతులంగా తీసుకోవాలి. గర్భం దాల్చాక ఏ సీజన్‌లో ఏం తినాలి అనేది శరీర అవసరాలను బట్టి నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా, మాంగనీస్, కాపర్, బి12 లాంటి ఖనిజాలు సరైన మోతాదులో తీసుకుంటే, భవిష్యత్‌లో రక్తపోటు సమస్యలు తగ్గే అవకాశముందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఏ పోషకాలైనా మితంగా తీసుకోవాలి. ఆరోగ్య నిపుణుల సిఫార్సు మేరకు గర్భిణులు రోజుకి 1.7 మి.గ్రా కాపర్, 4 మి.గ్రా మాంగనీస్, 2.45 మై.గ్రా బి12 మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.

#BPControl #FoodsForPregnancy #GarbhinilaAharam #HealthyMom #PregnancyCare #PregnancyDiet #PregnancyNutrition Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today News Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.