📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Finger Millet – రాగుల‌తో క‌లిగే లాభాలు ఏమితో తెలుసా..

Author Icon By Sudha
Updated: August 25, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్ర‌స్తుత చిరుధాన్యాల వాడ‌కం పెరిగింది. చాలా మంది వీటిని తినేందుకు ఎక్కువ ఆస‌క్తిని చూపిస్తున్నారు. చిరు ధాన్యాల విష‌యానికి వ‌స్తే వాటిల్లో రాగులు (Finger Millet)కూడా ఒక‌టి. రాగుల‌తో రాగి ముద్ద‌, రాగి జావ‌, రొట్టె వంటివి చేసుకుని తింటుంటారు. రాగుల‌ను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. రాగుల్లో (Finger Millet)క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ (Bones)ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. వృద్ధాప్యంలో ఆస్టియో పోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. చిన్నారులు, వృద్ధులు రాగుల‌(Finger Millet)ను తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. ఎముక‌లు బ‌ల‌హీనంగా మార‌కుండా ఉంటాయి. పాలిచ్చే తల్లులు కూడా రాగును తింటే శిశువుకు ఎంతో మేలు జ‌రుగుతుంది. శిశువు ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ఎముక‌లు బ‌లంగా మారుతాయి. చ‌క్క‌గా ఎదుగుతారు.

Finger Millet – రాగుల‌తో క‌లిగే లాభాలు ఏమితో తెలుసా..

అధికంగా బ‌రువు త‌గ్గుతుంది

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. రాగుల గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అందువల్ల రాగుల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నెమ్మ‌దిగా పెరుగుతాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. రాగుల్లో అధికంగా ఉండే ఫైబ‌ర్‌, పాలిఫినాల్స్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించేందుకు స‌హాయం చేస్తాయి. రాగుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉన్న కార‌ణంగా జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. అధికంగా బ‌రువు ఉన్న‌వారు బ‌రువును త‌గ్గించుకునేందుకు గాను రాగులు స‌హాయం చేస్తాయి. వీటిల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక వీటిని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీని వ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది.

ర‌క్త‌హీన‌త

రాగుల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ఇది స‌హ‌జ‌సిద్ధంగా మ‌న‌కు ల‌భిస్తుంది. అందువ‌ల్ల రాగుల‌ను తింటుంటే ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ముఖ్యంగా మ‌హిళ‌లు, చిన్నారుల‌లో వ‌చ్చే ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌వ‌చ్చు. రాగుల్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు సైతం ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గేందుకు స‌హాయం చేస్తాయి. దీని వ‌ల్ల క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల శ‌రీరానికి జ‌రిగే న‌ష్టం త‌గ్గుతుంది. ఫ‌లితంగా గుండెపోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మ క‌ణాలు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. దీని వ‌ల్ల ముఖంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు త‌గ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి.

Finger Millet – రాగుల‌తో క‌లిగే లాభాలు ఏమితో తెలుసా..

రోజుకు 100 గ్రాముల

రాగులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. రాగుల్లో లెకిథిన్, మిథియోనైన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. రాగుల్లో ఉండే మెగ్నిషియం ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అయితే రాగుల‌ను రోజూ ఎంత మోతాదులో తినాలి..? అని చాలా మందికి సందేహం ఉంటుంది. దీనికి ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రీసెర్చ్, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిష‌న్‌కు చెందిన ప‌రిశోధ‌కులు ఏం చెబుతున్నారంటే.. రాగుల‌ను పిండి రూపంలో తీసుకుంటే రోజుకు 100 గ్రాముల వ‌ర‌కు తీసుకోవ‌చ్చు. మ‌రీ అధికంగా తింటే శ‌రీరంలో ఆగ్జాలిక్ యాసిడ్ పెరిగే అవ‌కాశం ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక రాగుల‌ను రోజూ మోతాదులోనే తినాలి.

రాగి మరియు ఫింగర్ మిల్లెట్ మధ్య తేడా ఏమిటి?

రాగి అని కూడా పిలువబడే ఫింగర్ మిల్లెట్ భారతదేశం మరియు ఆఫ్రికాలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా పండించే ముఖ్యమైన మిల్లెట్ . దీని శాస్త్రీయ నామం ఎలుసిన్ కొరాకానా. భారతదేశంలో గోధుమ, బియ్యం, మొక్కజొన్న, జొన్న మరియు బజ్రా తర్వాత ఇది ఉత్పత్తిలో ఆరవ స్థానంలో ఉంది.

రోజూ రాగి తినవచ్చా?

వ్యక్తిగత ఆహార అవసరాలను బట్టి సిఫార్సు చేయబడిన రోజువారీ రాగులు తీసుకోవడం మారవచ్చు, కానీ సాధారణ మార్గదర్శకం రోజుకు 1 నుండి 2 సర్వింగ్‌లు . ఇది 50-100 గ్రాముల రాగు పిండి కావచ్చు, దీనిని మీరు గంజి, రోటీలు లేదా కాల్చిన వస్తువులు వంటి వివిధ రూపాల్లో తీసుకోవచ్చు. రాగులు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-breakfast-health-risks-skipping-morning-meal/health/535913/

Breaking News Finger Millet health benefits healthy diet latest news millets nutrition Ragi Superfoods Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.