📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Mutton curry: పండుగ స్పెషల్ మటన్ కర్రీ రెసిపీ

Author Icon By Sudha
Updated: July 18, 2025 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ పండుగల వంటల్లో మటన్ కర్రీ (Mutton curry)ఒక అప్రతిమమైన రుచికరమైన వంటకం. ముఖ్యంగా బోనాల పండుగ, బతుకమ్మ, దసరా, లాంటి శుభదినాల్లో కుటుంబ సమేతంగా విందులప్పుడు మటన్ కర్రీ (Mutton curry)తప్పనిసరిగా వండబడే వంటకం. ఇంట్లో ఘుమఘుమలాడే మసాలా మటన్ వండటం అనేది ఓ ట్రెడిషన్ (tradition) లాంటిది. ఎప్పుడు వన్డేలా కాకుండా ఇంకాస్త టేస్టీగా, అదిరిపోయేలా మటన్ కర్రీ (Mutton curry)తయారు చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి.

Mutton curry: పండుగ స్పెషల్ మటన్ కర్రీ రెసిపీ

కావాల్సిన పదార్థాలు

మటన్ – 500 గ్రాములు, నూనె – 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర – ½ టీ స్పూన్, పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
కరివేపాకు – ఒక రెబ్బ, ఉల్లిపాయలు – 2 (మధ్య సైజు, తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – చిన్న కట్ట, పుదీనా – 10 ఆకులు. పసుపు – ¼ టీ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా, కారం – 1 టీ స్పూన్ (కారం ఎక్కువ తినేవాళ్లు పెంచుకోవచ్చు), నిమ్మరసం – 1 టీ స్పూన్, నూనె లేదా నెయ్యి – 1 టేబుల్ స్పూన్.
గ్రేవీ కోసం కావాల్సిన పదార్థాలు
తురిమిన కొబ్బరి – 2 టేబుల్ స్పూన్లు, దాల్చినచెక్క – 2 ఇంచుల ముక్క, అనాసపువ్వు – 1,యాలకులు – 2, లవంగాలు – 4, బిర్యానీ ఆకు – 1, మిరియాలు – ½ టీ స్పూన్, ధనియాలు – 2 టీ స్పూన్లు,
గసగసాలు – 1 టీ స్పూన్, నువ్వులు – 2 టీ స్పూన్లు, జీడిపప్పు – 5, ఎండు మిర్చి – 5.

Mutton curry: పండుగ స్పెషల్ మటన్ కర్రీ రెసిపీ

తయారీ విధానం

మటన్ మారినేషన్.. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, నూనె వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా చేస్తే మసాలా మటన్‌ కు పట్టేసి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మిక్సీ జార్‌ లో కొబ్బరి తురుము, దాల్చినచెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
కుక్కర్ వేడయ్యాక నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట తగ్గించి మరికొంత వేయించాలి. మారినేట్ చేసిన మటన్‌ ను కుక్కర్‌లో వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్‌ను కుక్కర్‌లో వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత కావలసినంత నీళ్లు పోసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి టేస్ట్ చెక్ చేయాలి. వేడిగా ఉండగానే అన్నం లేదా రోటీతో లాగించేయడమే. ఈ మటన్ కర్రీని నెయ్యితో తయారు చేస్తే రుచి మరింత అదిరిపోతుంది. ఈ రుచికరమైన బోనాల స్పెషల్ మటన్ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.

భారతదేశంలో పురాతన కూర ఏది?

హరప్పా నాగరికత ఆధునిక గుజరాత్ మరియు మహారాష్ట్రలకు దగ్గరగా ఉన్నందున, వారు తమ ఆహారంలో ఉప్పును ఉపయోగించారని చెప్పడం సురక్షితం అని వీడియోలో కునాల్ ఇంకా చెబుతున్నాడు. అందువల్ల, బైగాన్ కర్రీ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కూర తయారీ అని నమ్మవచ్చు.

మటన్ కూర శరీరానికి ఆరోగ్యమా ?

మటన్ మొత్తం ఆరోగ్యానికి దోహదపడే ముఖ్యమైన పోషకాలకు మంచి మూలం . ఇందులో అధిక-నాణ్యత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల నిర్మాణం, కణజాల మరమ్మత్తు మరియు రోగనిరోధక పనితీరుకు అవసరం.

మటన్ కాలేయానికి మంచిదా?

కొవ్వు కాలేయ రోగులు పంది మాంసం లేదా మటన్ వంటి ఎర్ర మాంసాన్ని తినకూడదు . ఎర్ర మాంసం కొవ్వు కాలేయ రోగులకు చాలా హానికరం. చేప వంటి సన్నని మాంసాన్ని తినాలి. అందువల్ల, ఎర్ర మాంసం బదులుగా సన్నని మాంసాన్ని తినడం కొవ్వు కాలేయ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Paneer Jalebi : పనీర్‌ జిలేబీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

Breaking News Festival Recipes Indian Non-Veg Recipes latest news mutton curry Spicy Mutton Curry Telangana Food Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.