📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

WalNuts:వాల్‌నట్స్ ఎక్కువగా తింటున్నారా!అయితే ఒకసారి వీటిని చదవండి..

Author Icon By Anusha
Updated: March 23, 2025 • 5:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాల్‌నట్స్‌పోషక విలువలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్‌లో ఒకటి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అందించడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలుంటాయి.

వాల్‌నట్స్‌ వల్ల ఉపయోగాలు

వాల్‌నట్స్‌ ఆకారం మన మెదడును పోలి ఉంటుంది, ఇదేలా కాకుండా వీటి ప్రయోజనాలు కూడా మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉంటాయి. వీటిలో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ మెదడు పనితీరును మెరుగుపరిచేలా సహాయపడతాయి. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలను నివారించడంలో వాల్‌నట్స్‌ ఉపయుక్తంగా ఉంటాయి.వాల్‌నట్స్‌ లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండడం వల్ల ఇవి గుండెకు చాలా మంచివి. రోజూ వాల్‌నట్స్‌ తినడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో మాలినాలను తొలగించి గుండె సంబంధిత వ్యాధులను అరికట్టుతాయి.మహిళల్లో (పోలీసైస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ), హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను వాల్‌నట్స్‌ తగ్గించగలవు. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.వాల్‌నట్స్‌ లో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మన కడుపును త్వరగా నింపేలా చేసి ఆకలిని నియంత్రిస్తుంది.

వాల్‌నట్స్‌ ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు

వాల్‌నట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పినా, ఇవి అధిక స్థాయిలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.జీర్ణ సమస్యలు,ఎక్కువ వాల్‌నట్స్‌ తినడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి.కొందరికి డయేరియా సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది.ఎలర్జీ సమస్యలుకొంతమందికి వాల్‌నట్స్‌ తిన్న వెంటనే చర్మంపై దురద, వాపు, మంట వంటి సమస్యలు తలెత్తవచ్చు.శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.బరువు పెరగడం,వాల్‌నట్స్‌ ఎక్కువగా తింటే అధిక క్యాలరీలు శరీరంలో చేరి బరువు పెరగడానికి కారణమవుతాయి.బరువు తగ్గాలని అనుకునే వారు వాల్‌నట్స్‌ను పరిమితంగా తినాలి.కిడ్నీ సమస్యలు,అధికంగా వాల్‌నట్స్ తినడం వల్ల ఆక్సలేట్ స్థాయిలు పెరిగి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.అతిగా తినడం వల్ల ఛాతిలో మంట,అధికంగా తింటే ఛాతిలో మంట, అజీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.వాల్‌నట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా, రోజు 4-5 వాల్‌నట్స్ తినడం మంచిది. వీటిని అధికంగా తింటే ఆనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. ఎవరైనా ఎలర్జీ, గుండె సంబంధిత వ్యాధులు, లేదా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, డాక్టర్ సూచనల మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం ఉత్తమం.

#BrainFood #HealthyFats #HealthyNuts #hearthealthy #NutPower #SuperFood #WalnutLover #Walnuts Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.