📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news: Cumin Water – జీల‌క‌ర్ర నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్ని లాభాలో..

Author Icon By Sudha
Updated: August 28, 2025 • 4:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జీల‌క‌ర్ర మ‌నంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని ఎంతో కాలంగా వంట ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తున్నారు. జీల‌క‌ర్ర‌ను రోజూ మ‌నం వంటల్లో వేస్తుంటాం. ఇది చ‌క్క‌ని సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. జీల‌క‌ర్ర‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయి. అయితే దీన్ని నేరుగా తిన‌లేరు. కానీ జీల‌క‌ర్ర‌ను(Cumin Water) నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తాగ‌వ‌చ్చు. రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీళ్ల‌ను (Cumin Water)ఒక క‌ప్పు మోతాదులో తాగాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర‌లో కుమినాల్డిహైడ్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీని వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం సుల‌భంగా జీర్ణం అవుతుంది. ప‌ర‌గ‌డుపునే జీల‌క‌ర్ర నీళ్ల‌ను (Cumin Water)తాగ‌డం వ‌ల్ల అజీర్తి, క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, క‌డుపు నొప్పి వంటి జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

Cumin Water – జీల‌క‌ర్ర నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్ని లాభాలో..

బరువు త‌గ్గేందుకు స‌హాయం

జీల‌క‌ర్ర నీళ్ల‌ను సేవిస్తుంటే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని వ‌ల్ల క్యాల‌రీలు ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న‌వారు జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగుతుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. ఈ నీళ్ల‌ను తాగితే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బరువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. జీల‌క‌ర్ర నీళ్ల‌ను సేవించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఉన్న టాక్సిన్లు బ‌య‌ట‌కు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. జీల‌క‌ర్ర నీళ్ల‌ను తాగుతుంటే లివ‌ర్‌, కిడ్నీలు సైతం శుభ్రంగా ఉంటాయి. ఆయా భాగాల్లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. లివ‌ర్ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. మూత్రాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి

జీల‌క‌ర్ర‌లో ఐర‌న్‌తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లంగా మారుస్తాయి. దీని వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీరం వ్యాధుల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తుంది. జీల‌క‌ర్ర‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. జీల‌క‌ర్ర‌లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. ముఖ్యంగా మొటిమ‌ల‌ను త‌గ్గించేందుకు దోహ‌దం చేస్తాయి. దీంతో ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ముఖంపై ఉండే ముడ‌త‌లు, మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. జీల‌క‌ర్ర నీళ్ల‌ను రోజూ తాగుతుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం.. ఈ నీళ్ల‌ను తాగితే శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జరుగుతుంది.

Cumin Water – జీల‌క‌ర్ర నీళ్ల‌ను ప‌ర‌గ‌డుపునే తాగితే ఎన్ని లాభాలో..

గుండె పోటు నివారణ

జీల‌క‌ర్ర నీళ్లు బీపీని త‌గ్గించ‌డంలో స‌హాయం చేస్తాయి. కొలెస్ట్రాల్, ట్రై గ్లిజ‌రైడ్ స్థాయిలను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. దీని వ‌ల్ల ర‌క్త నాళాల్లోని అడ్డంకులు తొల‌గిపోతాయి. గుండె పోటు రాకుండా నివారించ‌వ‌చ్చు. ఇక జీల‌క‌ర్ర నీళ్ల‌ను మ‌రీ అతిగా తాగ‌కూడ‌దు. ఒక క‌ప్పు మోతాదులోనే సేవించాలి. లేదంటే క‌డుపులో మంట వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. గ‌ర్భిణీలు, పాలిచ్చే త‌ల్లులు కూడా ఈ నీళ్ల‌ను తాగ‌కూడ‌దు.

జీరా నీటి ప్రాముఖ్యత ఏమిటి?

జీరా నీరు ఎంజైమ్‌లను ప్రేరేపించడం మరియు గ్యాస్‌ను తగ్గించడం ద్వారా మెరుగైన జీర్ణక్రియ, జీవక్రియ మరియు ఆకలి నియంత్రణను పెంచడం ద్వారా బరువు నిర్వహణ, విషాన్ని బయటకు పంపడం ద్వారా నిర్విషీకరణ మరియు దాని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా మెరుగైన రోగనిరోధక శక్తి వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది, ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టును ప్రోత్సహిస్తుంది మరియు రుతుక్రమంలో అసౌకర్యాన్ని తగ్గించవచ్చు.

జీరా నీరు తాగడానికి ఉత్తమ సమయం ఏది?

ఉదయాన్నే, అల్పాహారం ముందు జీరా నీరు తాగడం వల్ల మీ జీవక్రియ రోజులో వేగంగా ప్రారంభమవుతుంది. జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనం తర్వాత కూడా దీనిని తీసుకోవచ్చు.

జీలకర్ర మూత్రపిండ రోగులకు మంచిదేనా?

జీలకర్ర మూత్రపిండాల రోగులకు మంచిది, ముఖ్యంగా ఉప్పు అవసరాన్ని తగ్గించడానికి వంటలో ఉపయోగించినప్పుడు, ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి మూత్రపిండాల రక్షణను అందిస్తాయి. అయితే, నల్ల జీలకర్ర (నిగెల్లా సాటివా) అధ్యయనాలలో ఆశాజనకమైన రక్షణ ప్రభావాలను చూపుతున్నప్పటికీ, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్న మానవులలో దాని ఉపయోగం కోసం క్లినికల్ ఆధారాలు విస్తృత సిఫార్సు చేయడానికి సరిపోవు మరియు పెద్ద మోతాదుల సప్లిమెంట్లను జాగ్రత్తగా తీసుకోవాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/news-telugu-heart-attack-warning-signs-before-one-month/health/537237/

Breaking News Cumin Water Empty Stomach Drink health benefits Jeera Water latest news natural remedies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.