బెల్లీ ఫ్యాట్ (పొట్ట కొవ్వు) అనేది చాలా మందిని వేధించే సాధారణ సమస్య. దాన్ని తగ్గించడానికి జిమ్, కఠినమైన డైట్‌లు, అనేక వ్యాయామాలు చేస్తుంటాం. కానీ మన వంటింట్లోనే ఉండే సాధారణ పదార్థం. జీలకర్ర (Cumin seeds) బెల్లీ ఫ్యాట్ (Belly fat)సమస్యకు ఒక అద్భుతమైన సహజ పరిష్కారం అని మీరు తెలుసా?జీలకర్రను నీటిలో మరిగించి తాగే అలవాటు వల్ల శరీరంలో ఫ్యాట్ ద్రవీభవించి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనికి తోడు ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి శక్తిని కూడా అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు రెండు చెంచాల జీలకర్ర (Cumin seeds) ను ఒక గ్లాసు నీటిలో వేయాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని మరిగించకుండా తాగాలి. మిగిలిన జీలకర్ర (Cumin seeds) గింజలను కూడా నమిలి మింగేయాలి. ఇది బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. మీ బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో జీలకర్ర చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
ఆకలిని తగ్గిస్తుంది
ఇది ఆకలిని తగ్గిస్తుంది. మన జీవక్రియను పెంచుతుంది. ఇలా శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించి బరువు తగ్గించేందుకు జీలకర్ర సహాయపడుతుంది.అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి జీలకర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. మీకు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీ, మలబద్ధకం సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే, జీలకర్ర మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది. జీర్ణక్రియకు ఇది చాలా మంచి ఔషధం. డయాబెటిక్ రోగులకు జీలకర్ర విరుగుడుగా సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. ఐరన్ లోపం అనీమియా ఉన్నవారు తప్పనిసరిగా జీలకర్రను ఆహారంలో చేర్చుకోవాలి. బహిష్టు సమయంలో దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
రక్తహీనత రాకుండా చూస్తుంది
మొటిమలతో బాధపడేవారికి కూడా జీలకర్ర ఎంతో మేలు చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ముఖం మీద మొటిమలు, మచ్చలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మీ ఆహారంలో చేర్చుకోవడం చాల ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతేకాదు..గర్భిణీలకు కూడా జీలకర్ర నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భిణీలలో జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కార్బొహైడ్రేట్లను జీర్ణం చేసేందుకు అవసరం అయ్యే ఎంజైమ్‌లు ఉత్పత్తి చేస్తుంది. అంతేకాదు.. పాలిచ్చే తల్లులు కూడా రోజూ జీలకర్ర నీటిని తాగడం మంచిది. జీలకర్ర నీటిని తాగడం వల్ల పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. జీలకర్రలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తహీనత రాకుండా చూస్తుంది. తల్లీ బిడ్డలను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీలకర్ర నీటితో శ్వాసకోశ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీలకర్ర నీటిలోని యాంటీ కంజెస్టివ్ లక్షణాలు ఛాతిలో పేరుకుపోయిన మ్యూకస్ కరిగింపజేస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. మన శరీర పనితీరుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది హైబీపీని తగ్గిస్తుంది. ఉప్పు వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి రక్షిస్తుంది.
భారతదేశంలో జీలకర్ర ఎక్కడ పండిస్తారు?
భారతదేశంలో, దీనిని ప్రధానంగా గుజరాత్ మరియు రాజస్థాన్‌లలో రబీ పంటగా పండిస్తారు. గతంలో చాలా విలువైన మొక్క, జీలకర్ర సాగు దాదాపు 4000 సంవత్సరాల నాటిది. జీలకర్ర చేదుగా ఉంటుంది, కానీ విలక్షణమైన వెచ్చని రుచిని కలిగి ఉంటుంది, ఇది పొడిగా వేయించినప్పుడు మెరుగుపడుతుంది.
భారతదేశంలో అతిపెద్ద జీలకర్ర మార్కెట్ ఏది?
ఉంజా ఆసియాలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాలు మరియు జీలకర్ర విత్తనాల మార్కెట్‌గా మరియు భారతదేశంలో అతిపెద్ద నియంత్రిత మార్కెట్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.
భారతదేశంలో జీలకర్ర ఏ కాలంలో పండిస్తారు?
భారతదేశంలో జీలకర్రను అక్టోబర్ నుండి డిసెంబర్ ప్రారంభం వరకు విత్తుతారు మరియు ఫిబ్రవరిలో కోత ప్రారంభమవుతుంది. సిరియా మరియు ఇరాన్‌లలో, జీలకర్రను నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు విత్తుతారు (జనవరి మధ్య వరకు పొడిగించే అవకాశం ఉంది) మరియు జూన్/జూలైలో పండిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: