📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Cockroach Milk : బొద్దింక పాలు ఆరోగ్యానికి మేలు మీకు తెలుసా?

Author Icon By Sharanya
Updated: March 14, 2025 • 5:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాలు అనేవి మానవుల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనవి. ఇది అత్యుత్తమ ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు వంటి అనేక పోషకాలను అందించే ఆహారం. సాధారణంగా మనం ఆవు, గేదె, మేక, ఒంటె పాలను వినియోగిస్తుంటాం. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల ప్రకారం, బొద్దింక పాలు కూడా పోషకపరంగా మిగతా పాలకన్నా సమృద్ధిగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బొద్దింక పాలను గురించిన పరిశోధన

జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రిస్టల్లోగ్రాఫిక్ యూనియన్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో బొద్దింక పాలలో 45% ప్రోటీన్, 25% కార్బోహైడ్రేట్లు, 16-22% కొవ్వు, శరీర కణాల పెరుగుదలకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయని వెల్లడించారు. సాధారణ పాల కంటే ఈ పోషకాల శాతం చాలా ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో ‘డైప్టర్ ప్లానిటా’ (Diploptera Punctata) అనే ఓ ప్రత్యేకమైన రకం బొద్దింకపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా బొద్దింకలు గుడ్లు పెడతాయి, అయితే ఈ రకానికి చెందిన బొద్దింకలు ప్రత్యక్ష ప్రసవం చేస్తాయి. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు గర్భంలో ఉండే పిల్లల పెరుగుదలకు అవసరమైన పాల తరహా ద్రవాన్ని ఈ బొద్దింకలు ఉత్పత్తి చేస్తాయని గుర్తించారు.

బొద్దింక పాలలో ఉన్న పోషకాలు,ప్రయోజనాలు

ఇతర పాల కంటే బొద్దింక పాలలో ఉన్న పోషకాలు అధికంగా ఉంటాయని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా ఈ పాలలో ప్రోటీన్ క్రిస్టల్స్ అత్యధికంగా ఉండటమే దీని ప్రత్యేకత. ప్రోటీన్ – 45% , కార్బోహైడ్రేట్లు – 25% అధిక శక్తి ఉత్పత్తి – శరీరానికి తక్కువ పరిమాణంలోనే ఎక్కువ శక్తిని అందించగలదు.
ప్రోటీన్ సమృద్ధి – సాధారణ పాల కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉండటం వల్ల అథ్లెట్లకు, బాడీబిల్డర్లకు, పోషకాహార శాస్త్రవేత్తలకు ఇది ఆసక్తికరమైన విషయం.
అమైనో ఆమ్లాలు సమృద్ధిగా – శరీర కణాల అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
తక్కువ కొవ్వు, అధిక పోషకాలు – అధిక కొవ్వు తినాలనుకోని వాళ్లకు ఇది మంచి ప్రత్యామ్నాయం కావచ్చు.కొవ్వు- 16-22% , అమైనో ఆమ్లాలు – శరీర కణాల అభివృద్ధికి సహాయపడతాయి. శక్తి నిచ్చే పోషకాలు – సాధారణ పాలకన్నా మూడు రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి. ప్రస్తుతం బొద్దింక పాలను మానవ వినియోగానికి అందుబాటులోకి తేవడం చాలా కష్టం. కారణం, బొద్దింకల నుంచి పాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం అంత సులభం కాదు. ఒక చిన్న బొద్దింక నుంచి అతి తక్కువ పరిమాణంలోనే పాలను తీసుకోవచ్చు. పైగా, బొద్దింకల పెంపకం, పాల సేకరణ అనేవి చాలా సమయపరిమితమైన ప్రక్రియలు. అందువల్ల, శాస్త్రవేత్తలు ప్రస్తుతం ‘కృత్రిమంగా బొద్దింక పాలను ఉత్పత్తి చేయడం’ పై పరిశోధనలు చేస్తున్నారు. బయోటెక్నాలజీ సహాయంతో ఈ క్రిస్టల్ ప్రోటీన్‌ను ప్రయోగశాలలో తయారు చేసి, ప్రజలకు అందుబాటులోకి తేనే అవకాశం ఉందని అంటున్నారు. శాస్త్రవేత్తలు ప్రస్తుతం దీన్ని ‘ఫ్యూచర్ సూపర్ ఫుడ్’ గా అభివర్ణిస్తున్నారు. అంతరిక్షయాత్రలు, సైనికులు లేదా ఎడారి ప్రాంతాల్లో జీవించే వ్యక్తులకు ఇది ఒక ముఖ్యమైన పోషకాహార వనరుగా మారొచ్చు. ప్రోటీన్ సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్స్‌లో దీన్ని ఉపయోగించే అవకాశముంది. ఇప్పటి వరకు మనం ఆవు, గేదె, మేక, ఒంటె పాలను మాత్రమే ఆరోగ్యానికి మంచివని భావించేవాళ్లం. కానీ భవిష్యత్తులో బొద్దింక పాలు కూడా మానవుల ఆహారంలో భాగమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిశోధనలు విజయవంతమైతే, ఇది ఒక కొత్త పోషక వనరుగా మారొచ్చు.

#BoddinkaPalu #CockroachMilk #HealthInnovation #HealthTips #HealthyLiving #InterestingFacts #ProteinRich #ScienceNews #SuperFood Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.