ఆరోగ్యంగా ఉండడం కోసం చాలా మంది రోజూ అనేక రకాల జ్యూస్‌లను తాగుతుంటారు. కొందరు పండ్ల రసాలను సేవిస్తే, కొందరు కూరగాయల జ్యూస్‌లను తాగుతుంటారు. అయితే మనకు అందుబాటులో ఉండే కూరగాయలతో అయితేనే జ్యూస్ తయారు చేసి తాగడం సులభతరం అవుతుంది. అలాంటి వాటిల్లో క్యారెట్లు, బీట్ రూట్ (Carrot Beetroot Juice)కూడా ఉన్నాయి. వీటిని మనం తరచూ వంటల్లో ఉపయోగిస్తుంటాం. క్యారెట్లను పులావ్ రైస్, వివిధ రకాల వంటకాల్లో వేస్తుంటారు. బీట్ రూట్‌ను (Carrot Beetroot)సలాడ్‌గా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ రెండింటినీ కలిపి జ్యూస్ తయారు చేస్తే అది శక్తివంతమైన టానిక్ (Powerful tonic)అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. క్యారెట్, బీట్‌రూట్‌లను కలిపి జ్యూస్‌ను తయారు చేసి రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగాలి. దీంతో అనేక పోషకాలు లభిస్తాయి. ఆరోగ్యంగా ఉండవచ్చు. పలు వ్యాధులను నయం చేసుకోవచ్చు.
రక్త సరఫరా మెరుగు పడుతుంది
క్యారెట్, బీట్ రూట్ లతో తయారు చేసిన జ్యూస్‌ను (Carrot Beetroot Juice)తాగడం వల్ల నైట్రేట్లు అధికంగా లభిస్తాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్త నాళాలు వెడల్పుగా మారి రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ఈ జ్యూస్‌లో పొటాషియం సైతం అధికంగానే ఉంటుంది. ఇది కూడా బీపీని తగ్గించడంలో గణనీయంగా సహాయం చేస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ రెండింటి మిశ్రమంలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటి జ్యూస్‌ను తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. బద్దకం పోతుంది. ఈ జ్యూస్‌ను ఉదయం సేవిస్తే రోజంతా శరీరంలో శక్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. నీరసం, అలసట ఏర్పడవు.
లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి
ఈ మిశ్రమంలో బీటా కెరోటిన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. అలాగే లుటీన్, జియాజాంతిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ జ్యూస్‌లో ఉంటాయి. ఇవన్నీ కంటి చూపును మెరుగు పరిచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అతినీలలోహిత కిరణాల బారి నుంచి కళ్లను రక్షిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఈ మిశ్రమంలో బీటెయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. అలాగే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభిస్తాయి. ఇవి లివర్ పనితీరును మెరుగు పరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్లేలా చేస్తాయి. లివర్ ఆక్సీకరణ ఒత్తిడికి గురి కాకుండా ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి మేలు జరుగుతుంది. లివర్ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి.
వాపులు తగ్గిపోతాయి
ఈ రెండింటి జ్యూస్‌లో బీటాలెయిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలాగే బీటా కెరోటిన్, విటమిన్ సి కూడా అధికంగానే ఉంటాయి. ఇవన్నీ ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించడంలో సహాయం చేస్తాయి. వాపులను తగ్గిస్తాయి. ముఖ్యంగా శరీరం అంతర్గతంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. గుండె కండరాలు, రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ఈ రెండింటి మిశ్రమంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్త సరఫరా మెరుగు పడి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కాంతి పెరుగుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు తగ్గిపోతాయి. ఇలా క్యారెట్, బీట్ రూట్ జ్యూస్‌ను రోజూ తాగుతుంటే అనేక లాభాలను పొందవచ్చు.
బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎప్పుడు తాగాలి?
బీట్‌రూట్, క్యారెట్ మరియు దోసకాయ రసం తాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో లేదా భోజనాల మధ్య. ఇది పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది మరియు మీ రోజును ప్రారంభించడానికి ఉత్తేజకరమైన శక్తిని అందిస్తుంది.
రక్తాన్ని పెంచే రసం?
బీట్‌రూట్ రసం, దానిమ్మ రసం లేదా బెల్లం నీరు వంటి సహజ పానీయాలు హిమోగ్లోబిన్‌ను పెంచుతాయని అంటారు. ఇనుము శోషణను మెరుగుపరచడానికి మీరు నిమ్మకాయ నీరు వంటి విటమిన్ సి పానీయాలను కూడా జోడించవచ్చు.
చర్మం తెల్లబడటానికి ఏది మంచిది క్యారెట్ లేదా బీట్రూట్?
క్యారెట్ మరియు బీట్‌రూట్ జ్యూస్ రెండూ చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి, కానీ రెండూ చర్మాన్ని తెల్లగా చేయడానికి ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందలేదు. విటమిన్ ఎ మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యకరమైన గ్లో మరియు చర్మపు రంగును కూడా ప్రోత్సహిస్తుంది.