📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Cardamom : యాల‌కులు – వంటకాలకు రుచిని, ఆరోగ్యానికి శుభాన్ని అందించే మసాలా రాజు!

Author Icon By Sudha
Updated: July 1, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యాల‌కుల‌ను మ‌నం ఎంతో పూర్వ కాలం నుంచే మ‌న వంటి ఇంటి మ‌సాలా దినుసుగా ఉప‌యోగిస్తున్నాం. మ‌సాలా వంట‌కాలు చేస్తే క‌చ్చితంగా యాల‌కుల‌ను వాడుతారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంట‌ల్లో అయితే యాల‌కులు క‌చ్చితంగా ఉండాల్సిందే.యాల‌కులు ఒక ముఖ్యమైన సుగంధ ద్రవ్యము(Spice). ఇది వంటకాలకు (to recipes)మంచి రుచి, వాసనను అందిస్తుంది. ప్రత్యేకంగా బిర్యానీ, కుర్మా, పులావ్, మసాలా గ్రేవీల వంటి నాన్ వెజ్ వంటకాల్లో వాడితే రుచి పెరుగుతుంది. యాల‌కుల‌ను కేవ‌లం మ‌సాలా వంట‌కాలు మాత్ర‌మే కాకుండా స్వీట్ల త‌యారీలో (In thepreparation of sweets) కూడా ఉప‌యోగిస్తుంటారు. యాల‌కుల‌తో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాల‌తోపాటు అనేక ఔష‌ధ గుణాలు (Medicinal properties) కూడా యాల‌కుల్లో ఉంటాయ‌ని, యాల‌కుల‌ను రోజూ తింటుంటే అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వారు అంటున్నారు. యాల‌కుల‌ను భోజ‌నం చేసిన త‌రువాత నోట్లో వేసుకుని న‌మిలి మింగాలి. భోజ‌నం చేశాక ఒక యాల‌క్కాయ‌ను న‌మిలి తింటే అనేక లాభాలు ఉంటాయ‌ని వైద్యులు చెబుతున్నారు.

యాల‌కులు – వంటకాలకు రుచిని, ఆరోగ్యానికి శుభాన్ని అందించే మసాలా రాజు!


జీర్ణ క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి
యాల‌కుల్లో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. అంటే గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంద‌ని అర్థం. యాలకుల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌య ఎంజైమ్‌లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి జీర్ణ క్రియ‌ను మెరుగు ప‌రుస్తాయి. యాల‌కులను తింటుంటే అజీర్తి, గుండెల్లో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, పొట్టలో అసౌక‌ర్యం, వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే వీటి ద్వారా వ‌చ్చే నోటి దుర్వాస‌న కూడా త‌గ్గిపోతుంది. చాలా మంది భోజ‌నం చేసిన త‌రువాత నోరు దుర్వాస‌న‌గా ఉంటుంది. అలాంటి వారు యాల‌కుల‌ను న‌ములుతుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది.
ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా చేస్తాయి
యాల‌కుల్లో అనేక ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖ్యంగా ఫ్లేవ‌నాయిడ్స్‌, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి మ‌న శ‌రీరంలో ఉండే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గిపోతాయి. క‌ణాలకు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా ఉంటాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం బీపీని నియంత్రించ‌డంలో యాల‌కులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిల్లో డై యురెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి ర‌క్త నాళాల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. రోజూ యాల‌కుల‌ను తిన‌డం వ‌ల్ల హైబీపీ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. యాల‌కుల్లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు సైతం ఉంటాయి. అందువ‌ల్ల వీటిని రోజూ తింటుంటే శ‌రీరంలోని నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.
నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది
యాల‌కుల్లో యాంటీ మైక్రోబియ‌ల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల యాల‌కుల‌ను న‌మిలి తింటే నోట్లో ఉండే బ్యాక్టీరియా న‌శిస్తుంది. నోటి దుర్వాస‌న త‌గ్గిపోతుంది. దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి. యాల‌కుల్లో యాంటీ క్యాన్స‌ర్ గుణాలు ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో తేలింది. యాల‌కుల‌ను తిన‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ క‌ణాలు నిర్మూలించ‌డ‌బ‌తాయి. దీంతో ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. షుగ‌ర్ ఉన్న‌వారికి సైతం యాల‌కులు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే స‌మ్మేళ‌నాల వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ స‌మ‌స్య త‌గ్గుతుంది. ఇలా యాల‌కుల‌ను ఆహారం అనంత‌రం తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also:Brown Top Millets: రాత్రి పూట బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తింటే ఎంతో

Breaking News in Telugu Cardamom for digestion Cardamom health benefits Cardamom in Indian recipes Cardamom tea benefits Google News in Telugu Google News in TeluguTelugu News Today Green cardamom vs black cardamom How to use cardamom in cooking Paper Telugu News Spices for biryani Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news What is cardamom used for?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.