📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Budhas Hand : వింతైన పండు ‘బుద్ధాస్ హ్యాండ్’ – సుగంధంలో అద్భుతం!

Author Icon By Sudha
Updated: June 30, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పండ్ల దుకాణాల్లో లేదా సూపర్ మార్కెట్లలో కొన్నిసార్లు మనకు చూడగానే ఆశ్చర్యం కలిగించే వింతైన ఆకారాల పండ్లు కనిపిస్తుంటాయి. అలాంటి వింత పండ్లలో “బుద్ధాస్ హ్యాండ్” (Buddha’s Hand) ఒకటి. ఇది పేరు విన్నా, ఆకారాన్ని చూసినా సాధారణ పండ్లలా కనిపించదు. దీని ప్రత్యేకత, ఆకృతి (texture,), వాసన (the smell), మరియు ఉపయోగాల (of uses)వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన పండ్లలో ఒకటిగా మారింది. కానీ ఇది అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits) మాత్రం అద్భుతం అనే చెప్పాలి. చాలా మంది బ‌హుశా ఈ పండును ఎప్పుడూ చూసి ఉండ‌రు. బుద్ధాస్ హ్యాండ్ పండును చాలా వ‌ర‌కు ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. దీంతో ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను కూడా త‌యారు చేస్తారు. ఈ పండులో గుజ్జు, విత్త‌నాలు ఉండ‌వు. ఈ పండు వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. బుద్ధాస్ హ్యాండ్ పండులో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా విట‌మిన్లు ఎ, సిల‌తోపాటు ఫైబ‌ర్‌, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్ల‌లో స‌మృద్ధిగా ఉంటాయి.

Budhas Hand : వింతైన పండు ‘బుద్ధాస్ హ్యాండ్’ – సుగంధంలో అద్భుతం!

ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు
బుద్ధాస్ హ్యాండ్ పండ్ల‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, కౌమ‌రిన్స్‌, విట‌మిన్ సి ఉంటాయి. ఇవ‌న్నీ యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి, వాపులు త‌గ్గిపోతాయి. గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్లు, వ‌యస్సు మీద ప‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే రోగాలు రాకుండా అడ్డుకోవ‌చ్చు. నొప్పుల‌ను త‌గ్గించేందుకు ఈ పండును ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ఈ పండులో కౌమారిన్‌, లైమోనిన్ అనే స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి అనాల్జెసిక్ ల‌క్ష‌ణాలను క‌లిగి ఉంటాయి. అందువ‌ల్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. వాపుల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఆర్థ‌రైటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులు, వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.
పండ్లలో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువ
బుద్ధాస్ హ్యాండ్ పండ్ల‌లో ఉండే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ, ముక్కు దిబ్బ‌డ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది. శ్వాస నాళాలు క్లియ‌ర్ అవుతాయి. గాలి స‌రిగ్గా ల‌భిస్తుంది. బుద్ధాస్ హ్యాండ్ పండ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల కార‌ణంగా జీర్ణాశ‌యం, పేగుల గోడ‌లు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో అల్స‌ర్లు త‌గ్గిపోతాయి. ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్ పొట్ట‌లో ఉండే అసౌక‌ర్యాన్ని త‌గ్గిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రం, క‌డుపు నొప్పి, అజీర్తి, మ‌ల‌బ‌ద్ద‌కం, విరేచ‌నాలు వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తుంది.
నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం
బుద్ధాస్ హ్యాండ్ పండ్ల‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తుంది. దీంతో శ‌రీరం ఇన్ఫెక్ష‌న్లు, వ్యాధుల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. దీని వ‌ల్ల సీజ‌న‌ల్‌గా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఈ పండ్ల‌లో ఉండే బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తాయి. దీంతో బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. స్త్రీలు రుతు స‌మ‌యంలో ఈ పండ్ల‌ను తింటే ప‌లు ర‌కాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. రుతు స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి త‌గ్గిపోతుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గిపోతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అయితే ఈ పండ్లు మ‌న‌కు మార్కెట్‌లో అరుదుగా ల‌భిస్తాయి. కానీ ఈ పండ్ల‌కు చెందిన పొడి లేదా క్యాండీలు మ‌న‌క‌కు అందుబాటులో ఉంటాయి. ఎసెన్షియ‌ల్ ఆయిల్ కూడా ల‌భిస్తుంది. వీటితో టీ త‌యారు చేసుకుని తాగ‌వ‌చ్చు. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also:Rose Tea: ఆరోగ్య సిరి ‘గులాబీ టీ’ తో..

#telugu News Breaking News in Telugu Buddha's Hand benefits Buddha's Hand citron aroma Buddha's Hand culinary uses Buddha's Hand fragrance uses Buddha's Hand fruit Buddha's Hand fruit in India Buddha's Hand health benefits Exotic fruits in supermarkets Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Unique citrus fruit Buddha's Hand What is Buddha's Hand fruit

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.