📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Blood donation – అన్ని దానాలలో రక్తదానమే మిన్న

Author Icon By Sudha
Updated: October 1, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రక్తదానం ప్రాణదానంతో సమానం. అత్యవసర సమ యాలలో శస్త్రచికిత్స సమయంలో రక్తం అవసరం ఉంటుంది. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటనలో గాయపడిన వారికి సకాలంలో రక్తం అందక చనిపోయిన వారు అధిక సంఖ్యలో ఉంటున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాన (Blood donation)దినోత్సవం గా జరుపుకుంటారు. 1975 సంవత్సరంలో స్వరూప కృష్ణన్, డా. జె.జి. జొలిల చొరవతో ఈ రక్తదాన దినోత్సవం ప్రారంభం అయినది. రక్తదానం చేయాలని ప్రోత్సహిస్తూ రక్తదానం (Blood donation)ఆవశ్యకతను తెలియపరచడం రక్తదాన దినోత్స వం ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. నేటికీ గ్రామీణ ప్రాంతాలలో రక్తదానంపై ప్రజలకు యువతకు అవగాహన లేదు. రక్త దానం చేస్తే నీరసించి పోతామని, బలహీనపడి పోతామని అపోహ ప్రజల్లో బలంగా ఉంది. వివిధ స్వచ్ఛందసంస్థలు, రెస్లాంటివి గ్రామాల్లో, పట్టణాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నారు. ముఖ్యంగా యువత మాత్రం రక్తదానం అంటేనే రెండు అడుగులు వెనక్కి వేస్తున్నారు. ఒకవేళ స్వచ్ఛందంగా రక్తదానం చేసే వారికి ప్రభు త్వం స్వచ్ఛంద సంస్థల నుండి ప్రోత్సాహం లేకపోవడంచే రక్తదానం (Blood donation) చేయడానికి అనేకమంది వెనుకంజ వేస్తున్నసంఘ టనలు కోకొల్లలు. ప్రతి ఆరోగ్యవంతుడిలో సుమారు 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది.

Blood donation – అన్ని దానాలలో రక్తదానమే మిన్న

18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉన్న ఎవరైనా రక్తదానం చేయడానికి అర్హులు. ఆరోగ్యవంతులు ప్రతి మూడు నెలలకు ఓమారు అనగా సంవత్సరానికి నాలుగు సార్లు (four times) రక్తదానంచేయవచ్చు. 45కిలోల బరువు పైన ఉన్న వారు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి నుండి రక్తదాత 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్త దానం చేసేవ్యక్తిని వైద్యుల సంరక్షణలో కొన్ని వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. హైపటైటిస్ బి, హెచ్ఐవి, రక్తహీనత, బల హీనత, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులతో, బాధపడేవారు రక్త దానం చేయడానికి అనర్హులు. ఒకవేళ తెలియక చేసి రక్తం ఉపయోగపడదు. రక్తదానం చేసిన వారికి పూర్తిస్థాయిలో రక్తం 21రోజుల్లో తిరిగి ఉత్పత్తి అవుతుంది. రక్తంలో మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి 4 నెగటివ్ గ్రూపులు నాలుగు పాజిటివ్ గ్రూపులు రక్తదానం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీవోనెంబర్ 184ద్వారా ఆ రోజు స్పెషల్ క్యాజువల్ మంజూరు చేయబడుతుంది.

Blood donation – అన్ని దానాలలో రక్తదానమే మిన్న

ప్రపంచంలో అధిక మొత్తంలో ఓ పాజిటివ్ వారే అధికంగా ఉన్నారు. ఒక యూనిట్ సుమారు 500 మిల్లీ లీటర్లు రక్తంలో మూడు నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం చేసేవారు మిగతా వారికన్నా చాలా చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు. రక్త గ్రూపులు దేశవ్యాప్తంగా వాని శాతం ఓ పాజిటివ్ 46,ఏ పాజిటివ్ 37శాతం, బి నెగిటివ్ 8శాతం, యే నెగిటివ్ 4 శాతం, నెగిటివ్ 2, ఏబి నెగిటివ్ ఒక శాతం. ఒక శాతం ఏ బి పాజిటివ్. ఒక శాతం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో రెడ్ క్రాస్ అనే అంతర్జాతీయ సంస్థ, ఆయా జిల్లాల ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న రక్తనిధి కేంద్రాలు అధిక సంఖ్యలో రక్తాన్ని సేకరిస్తున్నాయి. ప్రతిఏటా వందలాది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ వేల యూనిట్ల రక్తం సేకరిస్తున్నారు. అలాగే జిల్లా కేంద్రాలు, డివిజన్ కేంద్రాలలో రక్తదాన కేంద్రాలు ఉన్నాయి. అనేక మంది తమ జన్మదినాలు, పెళ్లి రోజును పురస్కరించుకొని కూడా రక్తదాన శిబిరాలు ఏర్పా టు చేస్తూ తమ మిత్రులు, బంధువులు, సన్నిహితుల ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. బ్లడ్ బ్యాంకులకు అందజేస్తూ తమ దాతృత్వంతో, ఉదారతను చాటుతున్నారు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులలో కల్తీ రక్తాన్ని విక్రయిస్తున్నట్లు కూడా వార్తలు వినవస్తున్నాయి. రెడ్ క్రాస్, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలలో నామ మాత్రపు డబ్బులతో రక్తాన్ని విక్రయిస్తున్నారు. సమాజంలో ఇప్పటివరకు రక్తదానం చేయని వారు అధికసంఖ్యలో ఉన్నారు. రక్తదానం చేయడం అంటే ఓ మనిషిని బ్రతి కించేది. రక్తం ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. రక్త దానం పట్ల ప్రజల్లో అవగాహన కొరవడింది. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కరపత్రాలు, గోడ పత్రికలు, సదస్సుల ద్వారా గ్రామ ప్రజలు యువతలో, మహిళా సంఘాలద్వారా విస్తృత ప్రచారం చేయాలి. రక్తదానం మించిన దానం లేదు అనే నినాదాన్ని విశ్వవ్యాప్తం చేయాలి.

-కామిడి సతీష్ రెడ్డి


రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు, దాతల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎముక మజ్జను ఉత్తేజపరిచి కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది, శరీరం నుండి అదనపు ఇనుమును తొలగిస్తుంది మరియు మానసిక శ్రేయస్సును పెంచుతుంది. 

సాధారణ మానవ శరీరంలో ఎన్ని లీటర్ల రక్తం ఉంటుంది?

ఒక సాధారణ వయోజన మానవుని శరీరంలో సుమారు 5 లీటర్ల రక్తం ఉంటుంది, ఇది వారి శరీర బరువులో దాదాపు 7% ఉంటుంది. అయితే, వయస్సు, బరువు, ఎత్తు మరియు లింగం వంటి వివిధ కారకాలపై ఆధారపడి ఈ మొత్తం మారవచ్చు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Blood Donation blood donors Breaking News donate blood Health awareness latest news save lives Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.