📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Black Salt : ఆరోగ్యానికి మేలు చేసే కాలా న‌మ‌క్ వంటింటి రహస్యం!

Author Icon By Sudha
Updated: July 5, 2025 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్లాక్ సాల్ట్, ( Black Salt)హిందీలో దీనిని కాలా న‌మ‌క్ అంటారు. ఇది సాధారణ ఉప్పుతో పోలిస్తే వాసన, రుచి, శరీరంపై ప్రభావం కూడా భిన్నంగా ఉంటుంది. ఈ బ్లాక్ సాల్ట్, ( Black Salt) ముఖ్యంగా దక్షిణాసియాలో, ముఖ్యంగా భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ వంటి దేశాల్లో వంటకాలలో విస్తృతంగా వాడబడుతోంది. చాట్స్‌, స‌లాడ్స్‌, ఇత‌ర శాకాహార వంట‌కాల్లో బ్లాక్ సాల్ట్‌ను ఎక్కువ‌గా వాడుతారు.ఆయుర్వేద ప్ర‌కారం బ్లాక్ సాల్ట్ ( Black Salt)ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఇందులో అనేక ఔష‌ధ గుణాలు (Medicinal properties)ఉంటాయి. ఇది ప‌లు ర‌కాల వ్యాధుల‌కు మెడిసిన్‌లా ప‌నిచేస్తుంది. మీరు రోజూ వాడే సాధార‌ణ తెల్ల ఉప్పుకు బ‌దులుగా బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. బ్లాక్ సాల్ట్‌ను వాడ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జ‌ఠ‌రాగ్ని పెరుగుతుంది. ఇది ఆల్క‌లైన్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. బ్లాక్ సాల్ట్‌లో స‌ల్ఫ‌ర్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. క‌నుక పొట్ట‌లో ఏర్ప‌డే అసిడిటీని త‌గ్గిస్తాయి. లివ‌ర్‌లో పైత్య ర‌సం స‌రిగ్గా ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తాయి. అలాగే కొవ్వులో క‌రిగే విట‌మిన్ల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకునేలా చేస్తాయి.

ఆరోగ్యానికి మేలు చేసే కాలా న‌మ‌క్ వంటింటి రహస్యం!

లాక్సేటివ్ గుణాలు ఎక్కువ
బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే క‌డుపు ఉబ్బ‌రం, గ్యాస్‌, అజీర్తి, గుండెల్లో మంట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌జ్జిగ‌, నిమ్మ‌కాయ నీళ్లు, స‌లాడ్స్ వంటి వాటిలో క‌లిపి బ్లాక్ సాల్ట్‌ను చాలా సుల‌భంగా తీసుకోవ‌చ్చు. ఈ ఉప్పులో స‌హ‌జ‌సిద్ధ‌మైన లాక్సేటివ్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల ఈ ఉప్పును ఆహారంలో భాగం చేసుకుంటే పేగుల్లో మ‌లం సుల‌భంగా క‌దులుతుంది. దీంతో మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బ్లాక్ సాల్ట్‌లో సోడియం క్లోరైడ్ ఉంటుంది. కానీ సాధార‌ణ ఉప్పుతో పోలిస్తే ఇందులో సోడియం ప‌రిమాణం త‌క్కువ‌గా ఉంటుంది. అందువల్ల సాధార‌ణ ఉప్పు క‌న్నా బ్లాక్ సాల్ట్ మ‌న‌కు మేలు చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. శ‌రీరంలో సోడియం ప‌రిమాణం పెరిగితే కిడ్నీల‌పై భారం ప‌డుతుంది. దీంతో శ‌రీరం వాపుల‌కు గురవుతుంది. ఈ స‌మ‌స్య‌లు రావొద్దంటే బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకోవాల‌ని వైద్యులు చెబుతున్నారు.
మిన‌ర‌ల్స్ ఎన్నో
హైబీపీ ఉన్న‌వారిని ఉప్పు అధికంగా తినొద్ద‌ని చెబుతుంటారు. అయితే అలాంటి వారు సాధార‌ణ ఉప్పుకు బ‌దులుగా బ్లాక్ సాల్ట్‌ను వాడ‌వ‌చ్చు. ఇందులో సోడియం ప‌రిమాణం త‌క్కువ క‌నుక బీపీ పేషెంట్ల‌కు మేలు చేస్తుంది. అయితే ఉప్పు ఏదైనా ఉప్పే క‌నుక బ్లాక్ సాల్ట్‌ను కూడా హైబీపీ ఉన్న‌వారు త‌క్కువ మోతాదులోనే తినాలి. కానీ ఆరోగ్య‌క‌ర‌మైన‌ది క‌నుక బీపీ పేషెంట్లు తెల్ల ఉప్పుకు బ‌దులుగా న‌ల్ల ఉప్పును వాడితే మేలు జ‌రుగుతుంది. బ్లాక్ సాల్ట్‌లో ఐర‌న్‌, క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి మిన‌ర‌ల్స్ ఎన్నో లభిస్తాయి. సాధార‌ణ ఉప్పులో ఇవి ఉండ‌వు. క‌నుక పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డుతున్న వారికి బ్లాక్ సాల్ట్ ఎంత‌గానో మేలు చేస్తుంది. బ్లాక్ సాల్ట్‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. క‌నుక‌నే ఈ ఉప్పు ఆ రంగులో ఉంటుంది. బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వహించ‌బ‌డ‌తాయి. నాడులు, కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎర్ర‌రక్త క‌ణాలు వృద్ధి చెందుతాయి.

ఆరోగ్యానికి మేలు చేసే కాలా న‌మ‌క్ వంటింటి రహస్యం!

ద‌ద్దుర్లు, వాపులు త‌గ్గిపోతాయి
బ్లాక్ సాల్ట్‌లో ఉండే పొటాషియం కండ‌రాల ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. శ‌రీరంలో ఎల‌క్ట్రోలైట్స్ స‌మ‌తుల్యంలో ఉండేలా చేస్తుంది. దీని వ‌ల్ల కండ‌రాల నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. రాత్రి పూట నిద్ర‌లో కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోకుండా ఉంటాయి. బ్లాక్ సాల్ట్‌లో ఉండే అనేక మిన‌ర‌ల్స్ కార‌ణంగా ఈ ఉప్పు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. ఇది మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. బ్లాక్ సాల్ట్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే దుర‌ద‌లు, ద‌ద్దుర్లు, వాపులు త‌గ్గిపోతాయి. ఈ ఉప్పును ఉప‌యోగించి ఫేస్ ప్యాక్ త‌యారు చేసి కూడా వాడ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మంపై ఉండే మృత‌కణాలు తొల‌గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారి కాంతివంతంగా త‌యార‌వుతుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. కేశాలకు కూడా బ్లాక్ సాల్ట్ మేలు చేస్తుంది. జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తుంది. చుండ్రు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంది. ఇలా బ్లాక్ సాల్ట్‌ను రోజూ వాడితే మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Read Also :hindi.vaartha.com

Read Also :Fried Idli Recipe : ఫ్రైడ్ ఇడ్లీ తయారు చేసే విధానం

#AyurvedaTips #BlackSalt #DigestiveAid #HealthyLiving #HealthySalt #IndianSpices #KalaNamak #KitchenSecrets #NaturalSalt #TeluguHealthTips ayurvedic salt black salt black salt benefits black salt for chat Breaking News in Telugu digestion aid salt Google news Google News in Telugu healthy salt alternative kala namak kala namak in food kala namak uses Latest News in Telugu natural salt benefits Paper Telugu News telugu health tips Telugu News Telugu News online Telugu News Today Today news uses of black salt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.