📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Tomatoes – ట‌మాటాల‌ను ఎలా తింటే ఎక్కువ మేలు..

Author Icon By Sudha
Updated: September 3, 2025 • 4:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ట‌మాటాల‌ను మ‌నం మ‌న రోజువారి ఆహారంలో భాగంగా వాడుతూనే ఉంటాం. ట‌మాటాల‌ను ప‌లు ర‌కాల కూరల్లో వేస్తుంటారు. ఇత‌ర కూర‌గాయ‌ల‌తో క‌లిపి వండుతారు. ట‌మాటాల‌ను (Tomatoes)అన్ని ర‌కాలుగా వంట‌ల్లో ఉప‌యోగిస్తూనే ఉంటారు. వృక్ష‌శాస్త్రం ప్ర‌కారం చెప్పాలంటే వాస్త‌వానికి ట‌మాటా ఒక కూర‌గాయ కాదు, పండు. కానీ దీన్ని కూర‌గాయ గానే ఉప‌యోగిస్తున్నారు. ట‌మాటాల్లో (Tomatoes)అనేక పోష‌కాలు ఉంటాయి. అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు (Health benefits)క‌లుగుతాయి. ట‌మాటాల్లో లైకోపీన్ అనే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. దీని వ‌ల్లే ట‌మాటాలు (Tomatoes)చూడ‌చ‌క్క‌ని ఎరుపు రంగులో ఉంటాయి. లైకోపీన్ వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది.

Tomatoes – ట‌మాటాల‌ను ఎలా తింటే ఎక్కువ మేలు..

ఎముక‌ల‌ను దృఢంగా

లైకోపీన్ వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ల‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ని సైంటిస్టుల అధ్య‌య‌నాల్లో తేలింది. లైకోపీన్‌తోపాటు ట‌మాటాల్లో పొటాషియం, విట‌మిన్ సి అధికంగా ఉంటాయి. ఇవ‌న్నీ క‌ల‌సి గుండె ఆరోగ్యం కోసం ప‌నిచేస్తాయి. పొటాషియం వ‌ల్ల బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. లైకోపీన్ ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్ల‌తో క‌లిసి శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాల్లో విట‌మిన్లు సి, కె అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తాయి. చ‌ర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ట‌మాటాల్లో ఉండే విట‌మిన్ కె ఎముక‌ల‌ను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయిన‌ప్పుడు తీవ్ర ర‌క్త స్రావం జ‌ర‌గ‌కుండా ర‌క్షిస్తుంది. రక్తం త్వ‌ర‌గా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది.

చ‌ర్మం ఆరోగ్యం

టమాటాల్లో ఉండే లైకోపీన్, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు చ‌ర్మాన్ని అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి ర‌క్షిస్తాయి. దీని వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. సూర్య‌కాంతిలోనూ చ‌ర్మం కందిపోకుండా చూసుకోవ‌చ్చు. ఇక ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజనాలు క‌లుగుతాయ‌ని చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు పోష‌కాహార నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే.. ట‌మాటాల్లో లైకోపీన్ అధికంగా ఉంటుంద‌ని, ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని అంద‌రికీ తెలుసు. అయితే లైకోపీన్ మ‌న‌కు అధిక మోతాదులో ల‌భించాలంటే ట‌మాటాల‌ను ఎల్ల‌ప్పుడూ ఉడికించే తినాలి. ప‌చ్చిగా ఉండే ట‌మాటాల్లో లైకోపీన్ త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుక లైకోపీన్ ఎక్కువ‌గా కావాల‌నుకునే వారు ట‌మాటాల‌ను ఉడ‌క‌బెట్టి తింటే మంచిది.

Tomatoes – ట‌మాటాల‌ను ఎలా తింటే ఎక్కువ మేలు..

విట‌మిన్ సి

ట‌మాటాల్లో ఉండే లైకోపీన్ ఎక్కువ‌గా కొవ్వుల్లో క‌రుగుతుంది. క‌నుక ట‌మాటాల‌ను ఎప్పుడు తిన్నా కొవ్వు ప‌దార్థాల‌తో తింటే మేలు జ‌రుగుతుంది. ఆలివ్ ఆయిల్‌, అవ‌కాడో, చేప‌లు, నెయ్యి, గింజ‌లు, విత్త‌నాలు వంటి వాటితో క‌లిపి తింటే లైకోపీన్‌ను శ‌రీరం ఎక్కువ‌గా శోషించుకుంటుంది. అయితే ప‌చ్చి ట‌మాటాల‌ను తిన‌డం వ‌ల్ల కూడా లాభాలు ఉన్నాయి. ప‌చ్చి ట‌మాటాల‌ను తింటే విట‌మిన్ సి ని అధికంగా పొంద‌వ‌చ్చు. ట‌మాటాల‌ను ఉడికిస్తే విట‌మిన్ సి ని కోల్పోతాము. కానీ లైకోపీన్ ఎక్కువ‌గా ల‌భిస్తుంది. క‌నుక విట‌మిన్ సి కావాలంటే ట‌మాటాల‌ను ప‌చ్చిగానే తినాలి. అదే లైకోపీన్ కావాలంటే ఉడ‌క‌బెట్టి తినాలి. కొంద‌రు రెండు రకాల ట‌మాటాల‌ను క‌లిపి తింటారు. దీంతో రెండు పోష‌కాల‌ను ఒకేసారి పొంద‌వ‌చ్చు. ట‌మాటాల‌ను రోజుకు 2 లేదా 3 కు మించి తిన‌కూడ‌దు. కూర‌ల్లో వేసినా, ఉడికించి లేదా ప‌చ్చిగా తిన్నా 3 ట‌మాటాల‌కు మించి తిన‌కూడ‌దు. ఇలా ట‌మాటాల‌ను తింటుంటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

టమోటాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి?

టమోటాలు దక్షిణ అమెరికాలోని ఆండీస్ ప్రాంతంలో ఉద్భవించాయి కానీ మొదట మెక్సికోలో పెంపకం చేయబడ్డాయి. 16వ శతాబ్దంలో స్పానిష్ వారు వాటిని యూరప్‌కు తీసుకువచ్చారు కానీ మొదట వాటిని అనుమానంతో చూశారు మరియు విషపూరితమైన నైట్‌షేడ్ కుటుంబానికి వాటి సంబంధం కారణంగా ప్రధానంగా అలంకార మొక్కలుగా పెంచారు. టమోటాలు యూరోపియన్ ఆహారంలో, ముఖ్యంగా మధ్యధరా ప్రాంతంలో విస్తృతంగా ఆమోదించబడిన ఆహార పదార్థంగా మారడానికి 18వ శతాబ్దం వరకు పట్టింది.

భారతదేశంలో టమోటా ఎంత పాతది?

16వ శతాబ్దం ప్రారంభంలో పోర్చుగీస్ అన్వేషణల ద్వారా టమోటా భారతదేశానికి వచ్చింది. టమోటాలు తీవ్రమైన మంచు లేకుండా వెచ్చని, ఎండ ఉన్న పరిస్థితులలో బాగా పెరుగుతాయి కాబట్టి, మొక్కలు భారతీయ నేలలకు బాగా అలవాటు పడ్డాయి.

టమోటా ఎందుకు పండు?

టమాటో పువ్వు అండాశయం నుండి అభివృద్ధి చెందుతుంది మరియు విత్తనాలను కలిగి ఉంటుంది కాబట్టి వృక్షశాస్త్రపరంగా ఒక పండుగా వర్గీకరించబడింది. అయితే, పాక పరంగా, దీనిని తరచుగా ఉపయోగిస్తారు మరియు డెజర్ట్‌గా కాకుండా ప్రధాన వంటకాలలో దాని రుచికరమైన రుచి మరియు సాధారణ ఉపయోగం కారణంగా కూరగాయగా పరిగణిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dates-with-milk-health-benefits/health/540329/

Breaking News diet tips health benefits healthy eating latest news nutrition Telugu News Tomatoes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.