📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Liver- లివర్‌ ఆరోగ్యానికి బెస్ట్‌ డీటాక్స్‌ డ్రింక్స్‌..

Author Icon By Sudha
Updated: September 3, 2025 • 4:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఇది శరీరం నుండి అన్ని రకాల విషాలను తొలగించి మనకు అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. అందుకే వైద్యులు, ఆరోగ్య నిపుణులు కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా (Healthy)ఉంచుకోవాలని తరచూ చెప్తూ ఉంటారు. ఇలాంటప్పుడే కాలేయాన్ని(Liver) ఆరోగ్యంగా ఉంచడానికి మనం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని చాలా మందిలో సందేహాలు మొదలవుతాయి. కానీ మీరు కతల చెందాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో తయారు చేసుకునే కొన్ని పానియాలతో మన కాలేయాన్ని(Liver) రక్షించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Liver- లివర్‌ ఆరోగ్యానికి బెస్ట్‌ డీటాక్స్‌ డ్రింక్స్‌..

నిమ్మకాయ నీరు

గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండుకొని త్రాగడం కాలేయాన్ని(Liver) ఆరోగ్యంగా ఉంచడానికి సులభమైన మార్గం. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి, పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు త్రాగడం వల్ల కాలేయ నిర్విషీకరణతో పాటు మీ జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

గ్రీన్ టీ, బీట్‌రూట్ రసం

గ్రీన్ టీలో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కాలేయ కణాలను రక్షిస్తుంది. దీన్ని రోజూ తీసుకుంటే, కాలేయ ఎంజైమ్‌లు బాగా పనిచేస్తాయి అలాగే ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూసుకుంటుంది.తాజా బీట్‌రూట్ రసం వారానికి రెండు-మూడు సార్లు తాగడం వల్ల మీ కాలేయం బలపడుతుంది. అలాగే పేగు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కాలేయం, పేగులు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. కాబట్టి బీట్‌రూట్ రసం ఈ రెండింటికీ ప్రయోజనకరంగా ఉంటుంది.

Liver- లివర్‌ ఆరోగ్యానికి బెస్ట్‌ డీటాక్స్‌ డ్రింక్స్‌..

పసుపు టీ, అల్లం-పుదీనా నీరు

పసుపుతో తయారుచేసిన టీ కాలేయానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే కర్కుమిన్ అనే మూలకం కాలేయం వాపును తగ్గిస్తుంది. అలాగే ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. పసుపు కాలేయం పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి, చెడు కణాలను రిపేర్‌ చేయడానికి సహాయపడుతుంది. అలాగే హానికరమైన పదార్థాల నుండి కాలేయాన్ని రక్షిస్తుంది. అల్లం, పుదీనాను మరిగించి తయారు చేసిన ఈ పానీయం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉండే అల్లం కాలేయ వాపును తగ్గిస్తుంది. పుదీనా జీర్ణక్రియ, పిత్త ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఇవి శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి.

కాలేయాన్ని తయారు చేసే భాగాలు?

కాలేయంలో రెండు లోబ్‌లు ఉంటాయి – కుడి మరియు ఎడమ. ప్రతి లోబ్ వేల షడ్భుజాకార ఆకారపు లోబ్యూల్స్‌తో రూపొందించబడింది. ఈ లోబ్యూల్స్ చాలా చిన్నవి. ప్రతి లోబ్యూల్ హెపటోసైట్లు అని పిలువబడే అనేక కాలేయ కణాలతో రూపొందించబడింది, ఇవి ప్రసరించే వరుసలలో వరుసలో ఉంటాయి.

కాలేయం ఎంత శక్తివంతమైనది?

కాలేయం కొవ్వులను శరీరానికి శక్తి వనరుగా కూడా మారుస్తుంది. ఈ అవయవం ప్రోటీన్‌ను అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేయడానికి, అలాగే అమైనో ఆమ్లాలను గ్లూకోజ్, కొవ్వులు మరియు ప్రోటీన్‌లుగా మార్చడానికి ప్రదేశం. చివరగా, కాలేయం కొలెస్ట్రాల్ సంశ్లేషణ మరియు కొలెస్ట్రాల్ స్థాయిల నియంత్రణకు బాధ్యత వహిస్తుంది.

కాలేయం నల్లగా ఎందుకు ఉంటుంది?

డుబిన్-జాన్సన్ సిండ్రోమ్ ఉన్న చాలా మందిలో, కాలేయంలో కొన్ని నిక్షేపాలు పేరుకుపోతాయి కానీ కాలేయ పనితీరును దెబ్బతీసేలా కనిపించవు. ఈ నిక్షేపాలు వైద్య ఇమేజింగ్‌తో చూసినప్పుడు కాలేయాన్ని నల్లగా కనిపించేలా చేస్తాయి. అరుదుగా, డుబిన్-జాన్సన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో పుట్టిన వెంటనే కామెర్లు అభివృద్ధి చెందుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/best-way-to-eat-tomatoes-for-health-benefits/more/cheli/540691/

Breaking News detox drinks Healthy Drinks latest news Liver Cleanse Liver Health natural remedies Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.