📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత నేటి బంగారం ధరలు సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి తిరువనంతపురంలో నేడు 3వ T20 అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం

Latest Telugu news : Bathukamma – బతుకమ్మ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

Author Icon By Sudha
Updated: September 22, 2025 • 5:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బతుకమ్మకు ఉపయోగించే పూవుల్లో అనేక ఆరోగ్య అంశాలు ఇమిడి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, రుద్రాక్షతోపాటు వివిధ రకాల పువ్వుల్లో ఆరోగ్యానికి మేలుచేసే ఔషధ గుణాలు (Medicinal properties) ఉన్నట్ల్లు పేర్కొంటున్నారు. పూల నుంచి వచ్చే సువాసనలు, వాటి స్పర్శ ఆరోగ్యాన్ని పెంచుతాయని అంటున్నారు.బతుకమ్మలను( Bathukamma ) చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం ద్వారా.. ఆయా పువ్వుల్లోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సహజసిద్ధ క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి. నీటిలోని విష క్రిములను నిర్మూలిస్తాయి. అలా కొత్తనీటితోపాటు వచ్చే కొత్త రోగాల నుంచి కాపాడుకునే పండుగే.. బతుకమ్మ.

Bathukamma – బతుకమ్మ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

గుమ్మడి, తంగేడు పూలు

బతుకమ్మను ( Bathukamma ) పేర్చడం గుమ్మడి ఆకులతో మొదలై.. గుమ్మడి పువ్వులోని గౌరమ్మను ప్రతిష్ఠించడంతో పూర్తవుతుంది. పండుగతోపాటే గుమ్మడి తీగ కూడా మొగ్గలు తొడుగుతుంది. ఈ పూలల్లో సహజసిద్ధ ‘పసుపు గౌరమ్మ’ కొలువై ఉంటుంది. గుమ్మడి పువ్వు శాస్త్రీయనామం కుకుంబిటాపిపో’దీనిలో విటమిన్‌-ఎ, సి పుష్కలం. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్‌ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది కూడా. బతుకమ్మలో గుమ్మడి తర్వాత ఎక్కువ ప్రాధాన్యం కలిగిన పువ్వు.. తంగేడు. ఇది మన రాష్ట్ర పుష్పం. శాస్త్రీయనామం ‘కేసియా అరికులేటా’. దీనిని ఆయుర్వేదంలో విరివిగా వాడుతారు. ఈ పూల కషాయం తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. తంగేడు పూల పొడిని బెల్లంతో కలిపి తీసుకుంటే.. అతిమూత్ర వ్యాధి, నరాల బలహీనత దూరం అవుతాయి. తంగేడుపూల టీ తాగితే.. నెలసరి సమస్యలు తగ్గుముఖం పడుతాయి. కీళ్ల నొప్పులు తగ్గించడంలో, శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో తంగేడు సాయపడుతుంది. తంగేడు ఆకులు, పూలను చెరువులు, కుంటల్లో వేయడం వల్ల.. కొత్త నీటిలోని బ్యాక్టీరియా చనిపోతుంది.

గునుగు పూలు, పట్టుకుచ్చు

బతుకమ్మను ( Bathukamma )పేర్చడంలో ఎక్కువగా వాడేవి గునుగు పూలు. ఇవి గడ్డిజాతికి చెందినవి. ‘సెలోషియా’ దీని శాస్త్రీయనామం. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. రక్తపోటును తగ్గించడంలో గునుగు పువ్వు ముందుంటుంది. నోటిలో పుండ్లు, ముక్కులో రక్త స్రావాన్ని తగ్గించడానికి దీనిని వాడుతారు. గునుగు పూలు చర్మంపై గాయాలు, పొక్కులను తగ్గిస్తాయి. దగ్గు, టీబీ, డయేరియాలకు చక్కని ఔషధం. గునుగు గింజలు సహజసిద్ధ రక్తస్రావ నివారిణిగా పనిచేస్తాయి. నేత్ర సంబంధ మందుల తయారీలో వాడుతారు. వీటిని తింటే.. మూత్ర సంబంధ సమస్యలూ తగ్గుతాయి. బతుకమ్మకు చక్కటి అందాన్ని ఇచ్చేవి పట్టుకుచ్చు (సీత జడ) పూలు. దీని శాస్త్రీయ నామం ‘సిలోసియా అరెగేటియా’. ఇది అమరాంథస్‌ కుటుంబానికి చెందిన మొక్క. పట్టుకుచ్చు పూలలో జలుబు, ఆస్తమాను తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయి. వీటి ఆకులు గాయాలు, నోటి పొక్కులను నివారించడంలో సాయపడుతాయి.

Bathukamma – బతుకమ్మ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..

బంతి పువ్వు

బంతి పువ్వు ‘ఆస్టరేసి’ కుటుంబానికి చెందింది. క్రిసాంథిమమ్‌ బయాన్కో దీని శాస్త్రీయ నామం. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో, చర్మంపై దద్దుర్లను తగ్గించడంలో సాయపడుతుంది. బంతి ఆకులను మెత్తగా చేసి, గాయాలు, పుండ్లపై రాస్తే.. త్వరగా మానిపోతాయి. పంటి నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. బంతిపూల రెక్కలను మిరియాలతో కలిపి తీసుకుంటే.. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది.

బతుకమ్మ అంటే ఏమిటి?

బతుకమ్మ పండుగ, అంటే అమ్మవారి సజీవంగా రావడం , ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టిన ప్రకృతిని గౌరవించడానికి మరియు అభినందించడానికి జరుపుకుంటారు.

బతుకమ్మ 9 రోజుల పేర్లు?

బతుకమ్మ పండుగలోని తొమ్మిది రోజులకు సంబంధించిన పేర్లు వరుసగా ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ, మరియు చివరి రోజు సద్దుల బతుకమ్మ. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/can-you-eat-beetroot-leaves-benefits/more/cheli/552145/

bathukamma Bathukamma Flowers Breaking News health benefits Indian Culture latest news telangana festival Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.