📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Air Conditioner: ఏసీ గదుల్లో ఉంటున్నారా .. ఐతే మీ ఒళ్లు గుల్ల!

Author Icon By Sudha
Updated: June 20, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ మధ్య కాలంలో వాతావరణం ఎలా ఉన్నా, చాలామందికి ఏసీ(AC) లేకుండా జీవితం ఊహించదగినదే కాదు. ఇళ్లు, ఆఫీసు, షాపింగ్ మాల్స్‌, కారు – అన్నింటిలోనూ ఏసీ తప్పనిసరి అయిపోయింది. కానీ నిపుణుల హెచ్చరికల ప్రకారం, గంటల తరబడి ఏసీ వాడకానికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు (Health problems)ఉన్నట్లు తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి.

Air Conditioner: ఏసీ గదుల్లో ఉంటున్నారా .. ఐతే మీ ఒళ్లు గుల్ల!


ఏసీని ఉపయోగించే వారే ఎక్కువ
గంటల తరబడి ఎయిర్ కండిషనర్ (ఏసీ) కింద కూర్చొని విశ్రాంతి తీసుకోవడం కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఫ్యాన్లను ఉపయోగించడం కంటే ఏసీని ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ ఎక్కువసేపు ఏసీలో కూర్చోవడం వల్ల ఆరోగ్యానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?ఏసీ వాతావరణంలో గంటల తరబడి ఉండే వారికి ఎముకల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తేలింది.
ఎముకలను బలహీనపరుస్తుంది
ఏసీలో ఉండటానికి అలవాటు పడిన వారు రోజంతా ఎయిర్ కండిషన్డ్ గదుల్లోనే ఉంటారు. ఈ అలవాటు తెలియకుండానే ఎముకలను బలహీనపరుస్తుంది. ఎక్కువసేపు ఏసీలో ఉండటం ఎముకలకు హానికరం. ఎందుకంటే తక్కువ ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు ఉండటం వల్ల మన ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువసేపు తక్కువ ఉష్ణోగ్రతలలో ఉన్నప్పుడు, శరీర జీవక్రియ క్రమంగా మందగించడం ప్రారంభమవుతుంది. ఇది ఎముకలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. వాటిని బలోపేతం చేయడానికి అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది. ఈ స్థితిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు పెరుగుతాయి.
కాల్షియం చాలా ముఖ్యం
ఎముకలను బలంగా ఉంచడానికి కాల్షియం చాలా ముఖ్యం. దీని కోసం ప్రతిరోజూ పాలు తప్పకుండా తాగాలి. అంతేకాకుండా పెరుగు, పనీర్, ఇతర పాల ఉత్పత్తులు కూడా ఎముకలకు మేలు చేస్తాయి. కాబట్టి వీటిని కూడా మీ ఆహారంలో చేర్చుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. వీలైనంత ఎక్కువ నీరు తాగడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే నీరు శరీర జీవక్రియను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఎముకలకు అవసరమైన ఖనిజాల సమతుల్యతను కాపాడుతుంది.
ఆకుకూరలతో ఎముకల ఆరోగ్యం
పాలకూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు మన శరీరానికి కాల్షియం, ఇనుము, ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కాబట్టి, ఈ ఆహారాలు తీసుకోవడం వల్ల మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఎముకలు, కండరాలను బలంగా ఉంచుకోవడానికి, ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి. లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి. ఇది ఎముకలను సాగదీయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ధూమపానం, మద్యం సేవించకూడదు
ధూమపానం, మద్యం సేవించడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ అలవాట్లను మానేయడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగ్గా కాపాడుకోవచ్చు. అలాగే జంక్ ఫుడ్ ఎముకలకు హానికరం. ఎందుకంటే ఈ రకమైన ఆహారాలలో పోషకాలు ఉండవు. పైగా శరీరంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీని ఫలితంగా ఎముకలు దెబ్బతింటాయి.

Read Also:Kombucha Tea : ఈ టీ రోజూ తాగితే చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు !

#ACUsage #AirConditionerRisks #DryAirEffects #EcoFriendlyLiving #HealthVsComfort #NaturalCooling Are you staying Breaking News in Telugu Google news Google News in Telugu in AC rooms? Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Your skin is oily!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.