📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu News : Amaranth Leaves : తోట‌కూర‌తో క‌లిగే లాభాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Author Icon By Sudha
Updated: November 20, 2025 • 4:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆకుకూర‌లను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి మ‌న‌కు అనేక పోష‌కాల‌ను అందిస్తాయి. అయితే ఆకుకూర‌ల్లో దేనిక‌దే ప్ర‌త్యేకం అయిన‌ప్ప‌టికీ తోట‌కూర (Amaranth Leaves) చాలా మందికి ఫేవ‌రెట్‌గా ఉంటుంది. తోట‌కూర‌తో అనేక ర‌కాల వంట‌ల‌ను చేసి తింటారు. దీంతో వేపుడు, పులుసు, ప‌ప్పు వంటి కూర‌ల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ప‌లు రైస్ వంట‌కాల్లోనూ తోట‌కూర‌ను వేస్తుంటారు. చిన్నారుల‌కు త‌ల్లులు త‌ర‌చూ తోట‌కూర‌ను ఆహారంలో భాగంగా పెడుతుంటారు. దీని వ‌ల్ల వారికి ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి. అయితే తోట‌కూర (Amaranth Leaves)ఆరోగ్య‌క‌ర‌మ‌ని తెలుసు కానీ దీంతో ఎలాంటి ప్రయోజ‌నాలు క‌లుగుతాయి, ఇది మ‌న‌కు ఏయే పోష‌కాల‌ను అందిస్తుంది..? అన్న విష‌యాలు చాలా మందికి తెలియ‌వు. కానీ ఈ విష‌యాల‌ను పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. తోట‌కూర‌ను త‌ర‌చూ తినాల‌ని వారు సూచిస్తున్నారు.

Read Also: http://Cracked heels : శీతాకాలంలో మడమలకు పగుళ్లు వస్తున్నాయా? ఇలా చేయండి..

Amaranth Leaves

ఎముక‌లు దృఢంగా

తోట‌కూర‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇత‌ర ఆకుకూర‌ల‌తో పోలిస్తే ఇందులో ప్రోటీన్ల శాతం ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల తోట‌కూర‌ను తింటే కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. కండ‌రాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు జ‌రిగి ఆరోగ్యంగా ఉంటాయి. కండ‌రాల నొప్పి త‌గ్గుతుంది. కండ‌రాలు వృద్ధి చెందుతాయి. దేహ దారుఢ్యం పెరుగుతుంది. తోట‌కూర‌లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందిస్తాయి. దీని వ‌ల్ల తోట‌కూర‌ను తింటే ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. బ‌ద్ద‌కం పోతుంది. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. తోటకూర‌లో క్యాల్షియం స‌మృద్ధిగా ఉంటుంది. పాలు లేదా పాల ఉత్ప‌త్తుల‌ను తీసుకోని వారు తోట‌కూర‌ను తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల పెద్ద మొత్తంలో క్యాల్షియంను పొంద‌వ‌చ్చు. క్యాల్షియం వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక‌ల సంబంధిత స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. అలాగే విరిగిన ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది

తోట‌కూర‌లో విట‌మిన్ కె కూడా అధికంగానే ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే గాయాలు అయిన‌ప్పుడు ర‌క్తం త్వ‌ర‌గా గ‌డ్డ క‌ట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర ర‌క్త స్రావం జ‌ర‌గ‌కుండా అడ్డుకోవ‌చ్చు. తోట‌కూర‌లో ఐర‌న్‌, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల తోటకూర‌ను తింటే హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల ర‌క్తం వృద్ధి చెందుతుంది. ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే ఫోలేట్ వ‌ల్ల గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. వారు తోట‌కూర‌ను తింటే ఫోలేట్ ల‌భించి గ‌ర్భ‌స్థ శిశువు ఎదుగుద‌లకు స‌హాయం చేస్తుంది. దీని వ‌ల్ల పిల్ల‌ల‌కు పుట్టుక లోపాలు రాకుండా ఉంటాయి. తోట‌కూర‌లో ఫైబ‌ర్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గేలా చేస్తుంది. ఫైబ‌ర్ కార‌ణంగా శ‌రీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Amaranth Leaves

కంటిలోని రెటీనాను ర‌క్షిస్తాయి

తోట‌కూర‌లో విట‌మిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. విట‌మిన్ ఎ వ‌ల్ల కంటి చూపు మెరుగు ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు తగ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. తోట‌కూర‌లో ఉండే లుటీన్‌, జియాజాంతిన్ అనే పోష‌కాలు శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లుగా ప‌నిచేస్తాయి. ఇవి కంటిలోని రెటీనాను ర‌క్షిస్తాయి. దీని వల్ల క‌ళ్లు ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా తోటకూర‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే దీన్ని రోజూ తిన‌ద‌లిస్తే గుప్పెడు మోతాదులో ఉడ‌క‌బెట్టి తినాలి. లేదా ర‌సం తీసి 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వ‌చ్చు. ఇలా తోట‌కూర‌ను తింటే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amaranth Leaves Breaking News health benefits healthy eating latest news Leafy Greens nutrition Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.